ఆ నేడు ఆగస్ట్ 28, 1963 | That today, August 28, 1963 | Sakshi
Sakshi News home page

ఆ నేడు ఆగస్ట్ 28, 1963

Published Thu, Aug 27 2015 11:34 PM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

ఆ  నేడు ఆగస్ట్ 28, 1963 - Sakshi

నాకో కల ఉంది!

పదాలు వాక్యాలవుతాయి. వాక్యాలు ఉపన్యాసాలవుతాయి. ఉపన్యాసాలు ఉద్యమాలవుతాయి. అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ ఉపన్యాసం ఈ కోవకే చెందుతుంది. మాటలకే కింగ్ అయిన మార్టిన్ లూథర్ ఉపన్యాసమిచ్చాడంటే... ఉద్యమానికి ఊతం ఇవ్వడమే! వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి మార్టిన్ వాషింగ్టన్ డి.సిలో ఇచ్చిన ‘ఐ హావ్ ఏ డ్రీమ్’ ఉపన్యాసం అందరినీ ఉర్రూతలూగించింది.

టాప్ అమెరికన్ స్పీచ్‌లలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఉపన్యాసంలో పద పదమున ‘మనుషులందరూ సమానమే’ అనే నినాదం వినిపిస్తుంది. జాత్యహంకారాన్ని ఉప్పుపాతరవేసే ఈ ఉపన్యాసం ఉద్యమాలకు కొత్త శక్తిని ఇచ్చింది. ఇప్పటికీ ఇస్తూనే ఉంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement