ఆర్టికేరియా తగ్గుతుంది! | The artikirea decreases! | Sakshi
Sakshi News home page

ఆర్టికేరియా తగ్గుతుంది!

Published Tue, Aug 22 2017 12:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

ఆర్టికేరియా తగ్గుతుంది!

ఆర్టికేరియా తగ్గుతుంది!

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 26 ఏళ్లు. నాకు అప్పుడప్పుడు చర్మం మీద ఎర్రని దద్దుర్లు వచ్చి మర్నాటికి తగ్గుతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నా తగ్గడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందా?  
– శివకుమార్, నరసరావుపేట


అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మసమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారి బాధిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి...

అక్యూట్‌ అర్టికేరియా : సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్‌ అర్టికేరియా అంటారు.

క్రానిక్‌ అర్టికేరియా : ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్‌ అర్టికేరియా అంటారు. ఇది దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరావడం లేదు.

కారణాలు: మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్‌ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా ఇది  కనిపిస్తుంది.

అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు :నొప్పి నివారణకుపయోగించే మందులు ∙కీటకాలు, పరాన్నజీవులు ∙ఇన్ఫెక్షన్‌ కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లు ∙అధిక ఒత్తిడి, సూర్యకాంతి ∙మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు ∙అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు ∙జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి.

లక్షణాలు:  చర్మంపై ఎరుపు లేదా డార్క్‌ కలర్‌లో దద్దుర్లు ఏర్పడటం ∙విపరీతమైన దురదగా అనిపించడం ∙దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం  కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు.  గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు

చికిత్స : హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతుల్లో తగిన మందులు ఇస్తారు. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.

డాక్టర్‌శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండిహోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement