చీకాకులు తగ్గించే అరటిపండు
ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్(పిఎంఎస్)తో బాధపడుతున్న వాళ్లకు అరటి పండు చక్కని ఔషధం. పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి రోజూ ఒక అరటిపండు తింటుంటే ఆ సమయంలో బాధించే ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటే ఆ సమస్య కూడా అదుపులోకి వస్తుంది.
మానసిక ఒత్తిడి, అశాంతితో నిరుత్సాహంగా ఉన్నప్పుడు అరటిపండు తింటే ఉత్సాహం వస్తుంది. డిప్రెషన్‌తో బాధపడే వాళ్ల మానసిక స్థితిలో అరటిపండు తినడానికి ముందుకూ, తిన్న తర్వాతకూ మంచి మార్పు ఉంటుంది.
అరటిలో ఉండే పొటాషియం మెదడును అలర్ట్‌గా ఉంచుతుంది. క్రమం తప్పకుండా ఉదయం కాని మధ్యాహ్న భోజనం తర్వాత కాని అరటిపండు తిన్న వారి మెదడు అరటిపండు తినడానికి ముందు కంటే మరింత చురుకుగా పని చేసినట్లు ఒక పరిశీలన.