
ఒక పెనం... మూడు వంటలు
చూడ్డానికి సింపుల్‌గా ఉంది. ఈ మాత్రం దానికి టెక్నాలజీ పేజీలో వెయ్యాలా అనిపించవచ్చు. కానీ ఇందులో ఒకేసారి మూడు కూరలు వండుకునే సదుపాయం ఉంది. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే... ఏ కంపార్ట్‌మెంట్‌లోకి ఎంత వేడి అవసరమో అంతే వేడి అందేలా సెట్ చేసుకోవచ్చు! చేప ఫ్రైకి ఎక్కువ వేడి, ఆమ్లెట్‌కు కొంచెం తక్కువ వేడి, కూరగాయలు దోరగా వేగడానికి ఇంకాస్త తక్కువ వేడి... ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమయిందా ఇందులోని టెక్నాలజీ. ఎంజాయ్ కుకింగ్... లేడీస్ అండ్ జెంటిల్మన్.