పులి పిల్లలు - శునకమాత..! | Tiger children - the mother dog ..! | Sakshi
Sakshi News home page

పులి పిల్లలు - శునకమాత..!

Published Tue, Dec 24 2013 11:16 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

పులి పిల్లలు - శునకమాత..! - Sakshi

పులి పిల్లలు - శునకమాత..!

మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా ‘సరోగసి’ ఉంటుందంటున్నారు చైనా జూ అధికారులు. అనడమే కాదు, నిజమని నిరూపిస్తున్నారు కూడా.  తల్లి నిరాదరణకు గురైన పులిపిల్లలను అదే జూలోని ఓ శున కమాతకి దత్తత ఇచ్చి, జంతువులకు జాతివైరం లేదని చాటి చెబుతున్నారు. హాంగ్‌జూహూ జూ లో ఈ వింత సంఘటన చోటు చేసుకొంది. అక్కడ ఒక సైబీరియన్ టైగర్ రెండు కబ్స్‌కు జన్మనిచ్చింది.  

ఎందుకో అది వాటికి పాలివ్వనని మొరాయించింది. దీంతో దిక్కుతోచని జూ అధికారులు అదే జూ లో ప్రసవించిన జియావో అనే శునకం దగ్గరకు ఈ కబ్స్‌ను తీసుకెళ్లారు. పరాయి తల్లి కన్నబిడ్డలైనప్పటికీ వాటిని ఈసడించుకోకుండా, తన పిల్లలతో సమానంగా  పులిపిల్లలకు కూడా ప్రేమతో పాలిచ్చింది జియావో. నవంబర్ పదోతేదీన కబ్స్ పుట్టాయట. అప్పటినుంచి వాటికి పాలిచ్చే బాధ్యత జియావోకే అప్పజెప్పామని వారు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ శునకాన్ని పులిపిల్లలకు సరోగసీ మదర్‌గా చెప్పవచ్చని వారు అంటున్నారు.
 
ఈ జూలో ఇలా ఒక జాతి జంతువును మరోజాతికి దత్తతఇవ్వడం కొత్తకాదు. గతంలోనూ జరిగింది. అప్పుడూ ఇలాగే చేశారు. పులులు ఇలా తమ పిల్లలకు పాలివ్వకుండా మొరాయించడం మామూలేనని, అలాంటప్పుడు ఇదే పరిష్కార మార్గమని జూ అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement