2060లోపు ఈ సృష్టి అంతరిస్తుంది!?
న్యూటన్ నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డ. బతకడం కష్టం అనుకున్నారు వైద్యులు. బాల్యంలో న్యూటన్ ఎప్పుడూ పరధ్యానంగా కనిపించేవాడు. అయినప్పటికీ కొత్త కొత్త వస్తువులు తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. చదువులో వెనకబడి ఉండేవాడు. తరచుగా ఉపాధ్యాయులతో తిట్లుతినేవాడు.
తరగతి గదిలో ఒకసారి న్యూటన్‌ను ఒక అబ్బాయి అకారణంగా కొట్టాడు. అప్పుడు న్యూటన్ శపథం చేశాడు. ఒకటి: తనను కొట్టిన వాడిని తిరిగి కొట్టాలని. రెండు: చదువులో ముందుండాలని....అనుకున్నది సాధించాడు. న్యూటన్‌ను స్కూలు మానిపించి వ్యవసాయం చేయించాలని అనుకుంది తల్లి. కొన్నిరోజులు తల్లికి వ్యవసాయంలో సహాయం చేశాడు.
2060లోపు ఈ సృష్టి అంతరిస్తుందని అంచనా వేశాడు. న్యూటన్ రాసిన శాస్త్రీయ వ్యాసాల కంటే మతపరమైన వ్యాసాలే ఎక్కువ. రసవిద్య మీద న్యూటన్‌కు ప్రత్యేక ఆసక్తి ఉండేది. దాని మీద చాలా పుస్తకాలే రాశాడు.పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్‌లో న్యూటన్ ఒకే ఒక మాట మాట్లాడారని చెబుతారు. ఆ మాట: ‘ఆ కిటికీ తలుపు వేయండి’