
ఊలు స్వెట్టర్లను మామూలుగా ఉతికి ఆరేస్తే అవి కుంచించుకుపోతాయి. ఆరిన తర్వాత వాటిని తిరిగి వేసుకుంటే అవి పొట్టిగా, బిగుతుగా అనిపిస్తాయి. ఊలు స్వెట్టర్లను ఉతకడంలో చిన్న చిట్కాలు పాటిస్తే చాలు, అవి శుభ్రంగా కొత్త వాటిలాగానే ఉంటాయి. ఊలు స్వెట్టర్లు కుంచించుకుపోకుండా ఉండాలంటే... గోరు వెచ్చని నీటిలో డిటెర్జెంట్‌కు బదులుగా బేబీ షాంపూ లేదా హెయిర్ కండిషనర్ వేసి, స్వెట్టర్లను నానబెట్టాలి.
నానిన తర్వాత వాటిని మామూలు బట్టలు ఉతికినట్లు నలిపేసి, పిండేసి ఉతకొద్దు. నీళ్లలోంచి స్వెట్టర్లను పైకి తీసి, సున్నితంగా పిండుతూ నీరంతా ఓడిపోయేలా చేయాలి. తర్వాత నేలపై ఒక పొడి తువ్వాలును పరిచి, దాని మీద స్వెట్టర్‌ను జాగ్రత్తగా పూర్తిగా విస్తరించి పరచాలి. ఇలా చేస్తే పూర్తిగా ఆరిన తర్వాత స్వెట్టర్ ఏమాత్రం కుంచించుకుపోకుండా కొత్త దానిలాగానే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment