Wool
-
మిస్టరీ.. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది..
అది 12వ శతాబ్దం. వారసత్వ సంక్షోభంతో ఇంగ్లండ్ సింహాసనం కోసం అంతర్యుద్ధం జరుగుతున్న కాలమది. దాన్ని చరిత్రలో ‘ది అనార్కీ’ అని పిలుస్తారు. ఆ అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే!సఫెక్‌లోని వూల్‌పిట్ అనే గ్రామంలో కొందరు పొలం పనులు చేసుకుంటున్నారు. అప్పుడే ఉన్నట్టుండి, సమీపంలో తోడేళ్ల కోసం తవ్విన గుంతలో ఎండుటాకుల అలికిడి బాగా పెరిగింది. ‘అబ్బ.. తోడేళ్లు పడినట్లు ఉన్నాయి. ఈ రోజుకి మన పంట పండింది’ అనుకున్నారు. వారంతా నెమ్మదిగా తోడేళ్ల గుంత వైపు నడిచారు. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది. ఆ అస్పష్టతకు కారణం స్వరం కాదు, భాష. ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అక్కడున్నవారెవ్వరికీ అర్థంకాలేదు.దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూస్తే ఆ గుంతలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చూస్తుంటే వారిద్దరూ అక్కా, తమ్ముడు అని అర్థమవుతోంది. కానీ ఇద్దరూ ఆకుపచ్చ చర్మంతో ఉన్నారు. వారి ఒంటి మీద దుస్తులు అసాధారణంగా, వింతగా కనిపించాయి. మానవులు కాదనే అనుమానం ఓ వైపు.. పసివాళ్లు అనే జాలి మరోవైపు.. పెనుగులాడుతుంటే.. చివరికి జాలే గెలిచింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా పైకి తీసి, ‘రిచర్డ్ డి కాల్నే’ అనే ఊరిపెద్ద ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడే పిల్లలకు ఆవాసం ఏర్పాటు చేశారు. అయితే తినడానికి ఏం పెట్టినా పిల్లలు వద్దన్నారు. వాళ్లు చెప్పిన మాటలు పిల్లలకు అర్థం కాలేదు. పిల్లల అవసరం పెద్దలకు బోధపడలేదు.ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు.. చాలారోజుల పాటు తిండి తినలేదట. అయితే కొంత కాలానికి.. ‘కాల్నే’ తోటలో పెరుగుతున్న బఠాణీ మొక్కల నుంచి బఠాణీలను తెంపుకుని తినడం మొదలుపెట్టారు. అలా కొన్ని నెలల పాటు వాటి మీదే బతకారు వాళ్లు. దాంతో ఆ పిల్లలు వేరే లోకం నుంచి వచ్చి పడ్డారన్న వాదన స్థానికుల్లో బలపడింది. తర్వాత కొంత కాలానికి.. ‘కాల్నే’ ఇంట్లో కాల్చిన రొట్టెలను తినడం మొదలుపెట్టారా పిల్లలు. దానివల్ల క్రమంగా వారి చర్మం రంగు మారుతూ వచ్చింది. పిల్లలు స్థానిక భాషను నేర్చుకుని.. మాట్లాడటం ప్రారంభించారు. అలా నెమ్మదిగా వాళ్లు సాధారణ మనుషులుగా మారుతున్న తరుణంలో.. ఉన్నట్టుండి పిల్లాడు చనిపోయాడు.తమ్ముడి మరణంతో ఆ పాప చాలా కుంగిపోయింది. తేరుకోవడానికి నెలలు పట్టింది. ఆ బాధలో చుట్టుపక్కలవారితో అనుబంధం పెరిగి.. అమ్మాయి మాటల్లో స్పష్టత వచ్చింది. ఆమె ఇంగ్లిష్ మాట్లాడటం నేర్చుకుంది. భాష పూర్తిగా నేర్చుకున్న తర్వాత.. ఆ అమ్మాయి మాటలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ‘నేను, నా సోదరుడు గతంలో ఉన్న చోటకి.. ఇప్పుడు ఉంటున్న చోటికి చాలా తేడా ఉంది. అది వేరే గ్రహంలా అనిపిస్తోంది.మేము ఇక్కడికి ఎలా వచ్చామో మాకు తెలియదు. మేము తోడేళ్ల గుంతలో పడకముందు వరకూ మా నాన్నతోనే ఉన్నాం. ఉన్నట్టుండి పెద్ద గంటల మోత వినిపించింది. మేము ఆ సమీపంలో పెద్ద నదిని కూడా చూశాం. ఆ క్షణంలో మాకేమైందో తెలియదు. కళ్లు తెరిచేసరికి మీ ముందు ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. ఆ పిల్ల అంత చెప్పుకొచ్చినా ఆ అక్క, తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారనేది అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు.అలా ‘కాల్నే’ ఇంట్లోనే పెరిగిన ఆ అమ్మాయికి.. ‘ఆగ్నెస్ బారే’ అనే పేరుపెట్టారు. దగ్గర్లోని కింగ్స్ లిన్ పట్టణానికి చెందిన ‘ఆర్చ్‌డీకన్ రిచర్డ్’ని పెళ్లి చేసుకుంది. నివేదికల ప్రకారం ఆమెకు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఆమె వంశస్థుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. ఆమెకు పుట్టిన పిల్లలు ఆకుపచ్చరంగులో పుట్టారని, వారు తిరిగి తమ పూర్వీకులను వెతుక్కుంటూ వెళ్లిపోయారంటూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఆనాడు ఆ పిల్లల్ని చూసిన కొందరు చిత్రకారులు.. కొన్ని చిత్రాలను గీసి భద్రపరచారట.అయితే తర్వాత కాలంలో .. ఈ అక్కా తమ్ముళ్లిద్దరూ బెల్జియంలోని ఫ్లాండర్స్‌కి చెందిన ఫ్లెమిష్ వలసదారుల పిల్లలు కావచ్చు అనే ఓ వాదన పుట్టుకొచ్చింది. 12వ శతాబ్దంలో అనేక మంది ఫ్లెమిష్ వలసదారులు.. వూల్‌పిట్ సమీపంలోని ఫోర్న్‌హామ్ సెయింట్ మార్టిన్ పట్టణానికి చేరుకున్నారనే ఆధారాలూ దొరికాయి. ఫోర్న్‌హామ్‌ను, పూల్‌పిట్‌లను.. లార్క్ నది వేరు చేస్తుంది. ఆ పాప చెప్పిన నది అదే కావచ్చని అంచనా వేశారు.కింగ్ హెన్రీ ఐఐ పాలనలో, ఫోర్న్‌హామ్ యుద్ధంలో చాలామంది ఫ్లెమిష్ వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధం కారణంగా ఆ అక్కాతమ్ముళ్లిద్దరూ తమ వాళ్లను కోల్పోయి అనాథలుగా మారి ఉండొచ్చు. పాప విన్న పెద్ద గంటల చప్పుడు .. యుద్ధానికి సంబంధించిందే అయ్యుండొచ్చు. అలా అనాథలైన ఈ పిల్లలు.. అడవి బాటలో పడి పోషకాహారం కరవై అనారోగ్యానికి గురై ఉండొచ్చని, పిల్లల్ని కాపాడినవారికి వీరి డచ్ భాష అర్థమై ఉండకపోవచ్చని అంచనా వేశారు.ఈ అంచనా నిజమైతే.. పిల్లల చర్మం ఎందుకు ఆకుపచ్చగా ఉంది? అనే ప్రశ్న.. మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. పోషకాహారం అందకుంటే చర్మం ఆకుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అందుకే సమతుల ఆహారం తీసుకున్నా కొద్ది రోజులకే వాళ్ల చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరిందని గుర్తుచేస్తూ.. పై వాదనకు బలాన్నిచ్చారు నిపుణులు.ఇదిలా ఉండగా.. ఆర్సెనిక్ పాయిజనింగ్ వల్ల కూడా చర్మం ఆకుపచ్చగా మారుతుందనే మరో వాదన వచ్చి షాక్‌నిచ్చింది అందరికీ! పిల్లలపై ఆ విషప్రయోగం జరిగి ఉంటుందా? కావాలనే పిల్లలకు ఈ విషం ఇచ్చి.. అడవిలో వదిలేసి వెళ్లారా? అనే ప్రశ్నలు ఈ కథను ఉత్కంఠగా మార్చాయి.అయితే ఆ ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు దొరకలేదు. ఆ దిశలో అన్వేషణ కొనసాగుతుండగానే.. ఆ పిల్లలు ఏలియ¯Œ ్స అని కొందరు నమ్మసాగారు. పిల్లలు దొరకడం నిజమే. కానీ ఎలా దొరికారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే ఊహాజనితమైన ఈ కథనాన్ని ప్రేరణగా తీసుకుని.. ఎన్నో నవలలు, పద్యాలు, నాటకాలు, సినిమాలు, డ్రామాలు పుట్టుకొచ్చాయి. దాదాపు ఎనిమిది శతాబ్దాలకు పైగా ఈస్టోరీ మిస్టరీగా కొనసాగుతునే ఉంది. — సంహిత నిమ్మనఇవి చదవండి: Funday Story: చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’? -
పశుగ్రాసం, ఎరువులుగా ఈకల వ్యర్థాలు
సాక్షి, న్యూఢిల్లీ: మానవ జుట్టు, ఉన్ని , పౌల్ట్రీ ఈకలవంటి కెరాటిన్ వ్యర్థాలను ఎరువులు, జంతువుల ఫీడ్లుగా తక్కువ ఖర్చులో మార్చేందుకు నూతన విధానాన్ని మన దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దేశంలో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో మానవ జుట్టు, పౌల్ట్రీ ఈకల వ్యర్థాలు, ఉన్ని వ్యర్థాలు వెలువడతాయి. ఈ వ్యర్ధాలను డంప్ చేయడం, పాతిపెట్టడం, ల్యాండ్‌ఫిల్లింగ్ కోసం ఉపయోగించడం లేదా దహనం చేయడం ద్వారా పర్యావరణ ప్రమాదాలు, కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయని గుర్తించారు. అంతేగాక ఈ వ్యర్థాల్లో ఉన్న అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ వంటి వనరులను జంతువుల దాణాతో పాటు ఎరువుగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉందని నిపుణులు తెలిపారు. ముంబైకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎ. బి.పండిట్ తన విద్యార్థులతో కలిసి, కెరాటిన్ వ్యర్థాలను పెంపుడు జంతువుల ఆహారంగా, మొక్కలకు ఎరువులుగా వాడే సాంకేతికతను అభివృద్ధి చేశారు. వ్యర్థాలను విక్రయించదగిన ఎరువులు, పశుగ్రాసంగా మార్చేందుకు వారు అధునాతన ఆక్సీకరణ విధానాన్ని ఉపయోగించారు. -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న గొర్రె, స్పెషల్ ఏంటంటే..
ఇదేదో గొంగలి కప్పుకున్న గొర్రె కాదు.. ఐదేళ్లుగా షేవింగ్ చేయని గొర్రె.. ఈ మధ్యే ఆస్ట్రేలియాలోని అడవుల్లో కనిపించింది. కళ్లు మీదకు కూడా ఉన్ని వచ్చేసి.. దారి సరిగా కనపడక.. అంత భారాన్ని మోయలేక నీరసించిన దీన్ని లక్కీగా కొందరు పర్యాటకులు చూసి అధికారులకు సమాచారమిచ్చారు.. వారు వచ్చి.. ఈ గొర్రెను చూసి ఆశ్చర్యపోయారు. మామూలుగా గొర్రెలకు ఉన్ని తీయడానికి కొన్ని నిమిషాల టైం పడితే.. దీనికి గంట పట్టిందట.. అది ఎంత బరువుందో తెలుసా? 35 కిలోలు. ఇది ఒకప్పుడు ఏదో గొర్రెల ఫాంలో ఉన్నదేనని.. తప్పిపోయి అడవికి చేరి ఉంటుందని చెబుతున్నారు.. కొన్ని రోజులు ఇలాగే ఉండి ఉంటే.. నీరసించి.. చచ్చి ఉండేదట.. మొత్తమ్మీద గ్రహాంతర జీవిలా కనిపిస్తూ.. ఈ గొర్రె ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. -
ఊలు స్వెట్టర్లు ముడుచుకుని పోకుండా ఉండాలంటే..!
ఊలు స్వెట్టర్లను మామూలుగా ఉతికి ఆరేస్తే అవి కుంచించుకుపోతాయి. ఆరిన తర్వాత వాటిని తిరిగి వేసుకుంటే అవి పొట్టిగా, బిగుతుగా అనిపిస్తాయి. ఊలు స్వెట్టర్లను ఉతకడంలో చిన్న చిట్కాలు పాటిస్తే చాలు, అవి శుభ్రంగా కొత్త వాటిలాగానే ఉంటాయి. ఊలు స్వెట్టర్లు కుంచించుకుపోకుండా ఉండాలంటే... గోరు వెచ్చని నీటిలో డిటెర్జెంట్కు బదులుగా బేబీ షాంపూ లేదా హెయిర్ కండిషనర్ వేసి, స్వెట్టర్లను నానబెట్టాలి. నానిన తర్వాత వాటిని మామూలు బట్టలు ఉతికినట్లు నలిపేసి, పిండేసి ఉతకొద్దు. నీళ్లలోంచి స్వెట్టర్లను పైకి తీసి, సున్నితంగా పిండుతూ నీరంతా ఓడిపోయేలా చేయాలి. తర్వాత నేలపై ఒక పొడి తువ్వాలును పరిచి, దాని మీద స్వెట్టర్‌ను జాగ్రత్తగా పూర్తిగా విస్తరించి పరచాలి. ఇలా చేస్తే పూర్తిగా ఆరిన తర్వాత స్వెట్టర్ ఏమాత్రం కుంచించుకుపోకుండా కొత్త దానిలాగానే ఉంటుంది. -
వెచ్చని అతిథులు
- జిల్లాకు చేరిన 'టిబెట్' వాసులు - కర్నూలులో ఉన్ని దుస్తుల విక్రయాలు - చలికాలంలో పెరిగిన డిమాండ్ కర్నూలు(రాజ్‌విహార్): చలికాలంలో ఉన్ని దుస్తులు వెచ్చని నేస్తాలు. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన అతిథులు వీటిని అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. జిల్లా కేంద్రమైన కర్నూలులో ఫుట్‌పాత్‌లపై అమ్మకాలు కొనసాగుతున్నాయి. అక్టోబరు నెల ముగిసి నవంబరు వచ్చేసిందంటే వాతావరణంలో మార్పులు వస్తాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయి. చలి పెరుగుతుంది. అలాంటప్పుడు చలికి 'స్వెటర్' వేస్తే వణుకు తగ్గుతుంది. గత ఐదారురోజుల నుంచి చలి పెరుగుతుండడంతో రక్షణ పొందేందుకు ఉలన్ (ఉన్నీ) దుస్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మన అవసరాలు గుర్తించి 'టిబెట్' దేశ అతిధులు కర్నూలు నగరానికి చేరుకుకున్నారు. రంగు రంగుల ఉలన్ స్వెటర్లు మనకు కావాల్సిన రకాల్లో అమ్మకాలకు పెట్టారు. నేపాల్, పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఈ వెచ్చని దుస్తుల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిపోతోంది. టిబెట్ నుంచి.. కార్తీక మాసం ప్రారంభమైందంటే ఉష్ణోగ్రతలు మారిపోతాయి. అప్పటి వరకు ఉన్న వేడి తగ్గుముఖం పడితే చలి పంజా విసిరి వెన్నులోనే వణుకు పుట్టిస్తుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి చెప్పలేనిది. ఉన్ని దుస్తులు వేసుకుంటే వెచ్చదనం వస్తుంది. మంచు దేశాల నుంచి దిగుమతి అయిన ఉన్ని దుస్తులంటే మరింత ఇష్టపడుతాం. ఉలన్ దుస్తులకు పెట్టింది పేరుగా టిబెట్ దేశస్తులు ఎప్పటి లాగే వలస పక్షుల్లా కర్నూలుకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా కర్నూలుకు వచ్చి నగరంలోని అవుట్ డోర్ స్టేడియం (ఎస్టీబీసీ కళాశాల వెనుక) ఎదురుగా ఉన్న ఫ్లాట్‌ఫామ్‌పై షెడ్లు వేసుకొని ఉలన్ దుస్తులను విక్రయిస్తున్నారు. దేశ విదేశాల నుంచి వాటిని తెప్పించి అమ్ముతున్నారు. మూడు నెలల పాటు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. శీతాకాలంలో వెచ్చని దుస్తులు అమ్మి ఫిబ్రవరి నెలలో తిరిగి వెళ్తారు. మనస్సుకు హత్తుకునే రకాలు: కొనుగోలుదారుల మనస్సుకు హత్తుకునే వెచ్చని దుస్తులు అమ్మకానికి పెట్టారు. ముఖ్యంగా చలితోపాటు వర్షానికి కూడా తట్టుకునేలా టూ ఇన్ వన్ వంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్నారులను ఆకర్షించేవిధంగా పలు రకాల బొమ్మలు, జంతువుల బొమ్మలతో కూడినవి ఉన్నాయి. మహిళలు, వృద్థులకు అనుకూలమైన బటన్, జిబ్, బనియన్ టైప్ తదితర రకాలు వివిధ రంగుల్లో అమ్మకానికి పెట్టారు. చెవులను కప్పేసేలా మాంకీ క్యాప్‌లు, ఆఫ్ టోపీలు, ఉలన్ క్లాత్‌లు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులను అందుబాటులో ఉంచారు. వీటి ధర రూ. 200 నుంచి రూ.1300 వరకు నాణ్యతను, సైజును బట్టి ఉంటోదని వ్యాపారస్తులు చెబుతున్నారు. తగ్గిన ఉష్ణోగత్రలు: గత పది రోజులుగా పరిశీలిస్తే ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 7వ తేదిన గరిష్ట ఉష్ణోగ్రతలు 35.0 డిగ్రీలు ఉండగా 16వ తేదిన 23.4, మంగళవారం 30.1 డిగ్రీలుగా నమోదు అయింది. -
ఉన్నితంగా...
మన్నిక చలికాలంలో ఉన్ని దుస్తులు ఎంతో ఉపకరిస్తాయి. తలకు కట్టుకునే మఫ్లర్, స్వెటర్, గ్లౌజులు, సాక్సులు ఇలా ఎన్నో ఉన్ని వస్తువులను ఈ కాలంలో రోజూ ఉపయోగిస్తుంటారు. మరి వాటిని ఉతికేటప్పుడు మామూలు దుస్తుల్లా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన బ్రష్: ఉన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో వాషింగ్ మిషన్‌లో వేయకూడదు. ఆ దుస్తులకు తగ్గట్టుగా బ్రష్‌ను ఎంచుకోవాలి. అంతేకాదు ప్రతిరోజూ స్వెటర్లను ఉపయోగిస్తుంటారు కాబట్టి ఎక్కువ మురికి వాటిపై పేరుకుపోతుంది. అందుకే రెండు రోజులకోసారి వాటిని ఉతకడం ఆరోగ్యకరం. మరకలు పోయేందుకు డ్రై క్లీన్: ఏదో ఒక సందర్భంలో ఉన్ని దుస్తులపై మరకలు పడుతూనే ఉంటాయి. వెంటనే వాటికి డ్రై క్లీనింగ్ చేయించాలి. మరీ అంత పెద్ద మరక కాదు అనుకుంటేనే చేతులతో ఉతకాలి. అదీ నాణ్యమైన సబ్బునే ఉపయోగించాలి.తీగలపై ఆరేయకూడదు: మిగతా దుస్తుల్లాగా ఉన్ని వాటిని తీగలపై ఆరేయకూడదు. అలా చేస్తే అవి సాగిపోయి ఆకారం మారే అవకాశం ఉంది. వీలైనంత వరకు వాటిని గోడలపైనో లేక టేబుళ్లపైనో ఆరేయడం మేలు. వాటికి వేడి కూడా ఎక్కువ తగలకుండా చూసుకోవాలి.