సాధన మారాలి...సీజన్‌ మారింది | yoga good for health | Sakshi
Sakshi News home page

సాధన మారాలి...సీజన్‌ మారింది

Sep 7 2017 12:06 AM | Updated on Sep 17 2017 6:29 PM

సాధన మారాలి...సీజన్‌ మారింది

సాధన మారాలి...సీజన్‌ మారింది

సీజన్‌ మారింది. నీళ్లలో తడవడం, నానడం, ముసురు పట్టిన వాతావరణంలో పయనించడం..

సీజన్‌ మారింది. నీళ్లలో తడవడం, నానడం, ముసురు పట్టిన వాతావరణంలో పయనించడం...ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణం. దీంతో పాటే సీజన్‌లో మార్పు ద్వారా వచ్చే ఆరోగ్యసమస్యలూ.వీటికి ప్రాణాయామ ఓ చక్కని పరిష్కారం. కేవలం కొన్ని నిమిషాల పాటు సులభంగా చేసే  సాధన ద్వారా సీజన్‌ మార్పుతో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.శ్వాసకోస వ్యవస్థలో ఊపిరితిత్తుల పాత్ర ఎంతో కీలకమైనది. మానవ శరీరంలోని ఊపిరి తిత్తులలో కుడి వైపు 3, ఎడమ వైపు 2 రోబ్స్‌ ఉంటాయి. శరీరంలోనే అతి పెద్ద అవయవమైనఊపిరితిత్తులు. మనం శ్వాస పీల్చినప్పుడు వాటి ఆకారం కన్నా 20 రెట్లు ఎక్కువగా వ్యాకోచం చెందుతాయి. రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణజాలానికి అవసరమైన ఆక్సిజన్‌ని ఇవిసరఫరా చేస్తాయి.

ఈ వ్యవస్థ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తే రోగనిరోధక శక్తి అంత బాగా పెరుగుతుంది. ఈ వ్యవస్థ బలహీనపడినట్లయితే బ్రోంకైటిస్, న్యుమోనియా, ఆస్తమా వంటివ్యాధులకు దారి తీస్తుంది. ముఖ్యంగా వానాకాలంలో శ్వాస కోస సమస్యలు సర్వసాధారణం. దీనికి పరిష్కారమే ప్రాణాయామాలు. ప్రాణాయామ సాధనకి కొన్ని వారాల ముందుఊపిరితిత్తులను, శ్వాస కోశ వ్యవస్థను బలోపేతం చేయడానికి కొన్ని బహిరంగ ప్రాణాయామాలను సాధన చేయాలి. బహిరంగ ప్రాణయామాల్లో... విభాగ ప్రాణయామం ముఖ్యమైంది.

ఊపిరితిత్తుల్లోని పై భాగాలకు, మధ్య భాగాలకు, కింది భాగాలకు వేర్వేరుగా ఆక్సిజన్‌ను ప్రాణాయామం ద్వారా పంపవచ్చు. అంతేకాకుండా ప్రతి సెక్షన్స్‌లోనూ ఉన్న జోన్స్‌కు అన్ని లోబ్స్‌కి ప్రాణవాయువును అందించడం సా«ధ్యపడుతుంది. చేతులు పైకి ఉంచి చేసే సాధన వల్ల ఊపిరితిత్తుల క్రేనియల్‌ నెర్వస్‌ సిస్టమ్‌కు, చేతులు పక్కకు పెట్టి చేసినందు వల్ల మధ్య భాగాలకు, చేతులు కింద పెట్టి చేసినందువల్ల ఊపిరి తిత్తుల కింది భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా మెరుగవుతుంది. పై భాగాలకు చేసే సాధనను క్లాలిక్యులర్‌ బ్రీతింగ్, మధ్య భాగాలకు చేసినప్పుడు ఇంటర్‌ కోస్టల్‌ బ్రీతింగ్, క్రింది భాగాలకు చేస్తే డయాఫ్రమెటిక్‌ బ్రీతింగ్‌ అంటారు.

ఇంటర్‌ కోస్టల్‌ బ్రీతింగ్‌లోచేతులు రెండూ పక్కలకు పెట్టి అరచేతుల దిశ మార్చడం ద్వారా శ్వాసను మధ్య ఊపిరితిత్తులలోని వివిధ భాగాలకు పంపవచ్చు.  ప్రతి ప్రాణాయామ కనీసం 10శ్వాసల కాలం పాటు చేయాలి. అరచేతుల దిశ మారుస్తూ 5 నుంచి 10 శ్వాసల కాలం పాటు ఆరు దిక్కులా ప్రాణాయామాలు చేస్తే ఒక సైకిల్‌ (భ్రమణం) పూర్తయినట్టు. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం 5సైకిల్స్‌ చొప్పున చేస్తుంటే ఊపిరి తిత్తుల సామర్ధ్యం క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు లేని/ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా  చేయవచ్చు.ఇవి తేలికపాటి ప్రాణాయామాలు కాబట్టి, ఊపిరితిత్తుల పై ఎటువంటి భారం పడదు. ఈ బహిరంగ ప్రాణాయామాల నిరంతర సాధన ద్వారా రోగ నిరోధకశక్తి పెరిగి సీజన్‌ మారడం వల్ల వచ్చే వైరల్‌ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్‌.. దరి చేరవు.

1 సుపీరియర్‌ ఇంటర్‌ కోస్టల్‌æబ్రీతింగ్‌ మధ్య ఊపిరితిత్తుల్లో  పై భాగాలకు ఆక్సిజన్‌  సరఫరా చేస్తుంది.

2 ఇన్ఫీరియర్‌ ఇంటర్‌ కోస్టల్‌ బ్రీతింగ్‌ మధ్య ఊపిరి తిత్తుల్లో కింది భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా మెరుగు పరుస్తుంది.

3 యాంటీరియర్‌ ఇంటర్‌ కోస్టల్‌ బ్రీతింగ్‌ మధ్య ఊపిరితిత్తుల్లో  ముందు భాగాలకు  ఆక్సిజన్‌ సరఫరాకు ఉపకరిస్తుంది.

4 పోస్టీరియర్‌  ఇంటర్‌ కోస్టల్‌ బ్రీతింగ్‌ మధ్య ఊపిరి తిత్తులలో వెనుక భాగాలకు ఆక్సిజన్‌   సరఫరా చేస్తుంది.

5 ఎక్స్‌టీరియర్‌  ఇంటర్‌ కోస్టల్‌ బ్రీతింగ్‌ మధ్య ఊపిరితిత్తుల్లో  బాహ్యంగా ఉన్న పక్క భాగాల ఆక్సిజన్‌  సరఫరాకు మేలు.

6 ఇంటీరియర్‌ ఇంటర్‌ కోస్టల్‌ బ్రీతింగ్‌ మధ్య ఊపిరి తిత్తుల్లో  లోపలి పక్క భాగాలకు  ఆక్సిజన్‌ను అందిస్తుంది.

ఎ.ఎల్‌.వి కుమార్‌ ట్రెడిషనల్‌ యోగా ఫౌండేషన్‌
సమన్వయం:  ఎస్‌. సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement