
ఈ వారం యూట్యూబ్ హిట్స్
డెమీ లొవాటో జూన్ 29న తన ఇంట్లో పార్టీ ఇచ్చింది.
నువ్వలా చేసినందుకే.. ఇదిగో ఇలా అయింది
డెమీ లొవాటో – సారీ నాట్ సారీ
నిడివి : 3 ని. 50 సె., హిట్స్ : 1,50,20,278
డెమీ లొవాటో జూన్ 29న తన ఇంట్లో పార్టీ ఇచ్చింది. ఆ ముక్కల్ని మిక్స్ చేసి ఈ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేసింది. ఇంతకీ హూ ఈజ్ షీ? పాతికేళ్లయినా లేని అమెరికన్ పాప్‌గుర్రం. చూడ్డానికి సన్నీ లియోన్. పాడితే.. మనసు పాడైపోవున్! హౌస్ పార్టీలో ఆమె పాడిన సాంగ్.. ‘సారీ నాట్ సారీ’. తనే రాసుకుంది. తనే పాడేసుకుంది. ఇప్పుడు కుర్రకుంకలన్నీ ఆ పాట వెనుక పరుగులు తీస్తున్నాయి. ఇది అబద్ధం. పాట వెనక కాదు, పాట పాడిన డెమీ వెనుక. పేబ్యాక్ ఈజ్ ఎ బ్యాడ్ బిచ్. అండ్ బేబీ ఐయామ్ ది బ్యాడెస్ట్, ఐయామ్ ది బ్యాడెస్ట్.. అయామ్ ది బ్యాడెస్ట్.. అని పాట మొదలౌతుంది. తనను ద్వేషించేవాళ్ల కోసం.. ఎంతో ప్రేమగా ఈ పాటను అల్లి, ఆ వలలో వారిని పడేసుకుంది డెమీ. ‘పేబ్యాక్ ఈజ్ ఎ బిచ్’ అనేది ఇంగ్లిష్‌లో ఒక ఫ్రేజ్. ‘నువ్వలా చేసినందుకే ఇదిగో ఇలా అయింది’ అనే మీనింగ్‌లో ఈ ఫ్రేజ్‌ని వాడతారు. పాటలో డెమీ కూడా అదే కంప్లైంట్ చేస్తూ.. ‘నేను బ్యాడ్ బిచ్ కంటే బ్యాడ్’ అంటోంది! ఎంతో బ్యాడో ఈ వీడియో చూస్తూ పాట వినండి. అమ్మానాన్నలకు తెలియకుండా ఈ పార్టీలో చాలా పనులు జరిగిపోయాయ్ మరి!
వెళ్లిపోయావా బిట్టీ.. నా బిట్టీ!
బరేలీ కి బర్ఫీ : ట్రైలర్
నిడివి : 2 ని. 50 సె., హిట్స్ : 60,30,643
‘మమ్మీ.. నేను వెళ్లిపోతున్నా. నాతో పాటు, నువ్వు దాచుకున్న రెండు వేల రూపాయల్ని కూడా తీసుకెళ్తున్నా. నా కోసం కానీ, నీ డబ్బు కోసం కానీ ఎదురుచూడకు’.. ఓ కూతురు తల్లికి రాసిపెట్టి వెళ్లిన ఉత్తరంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఉత్తరం చదవగానే తల్లి ‘బిట్టీ’ అని ఏడుస్తుంది. బిట్టీ బరేలీ వెళ్లిపోతుంది. తను ఆడి, బరేలీని ఒక ఆట ఆడిస్తుంది. ఇంగ్లిష్ ఫిల్మ్‌లు చూస్తుంది. బ్రేక్ డ్యాన్స్‌లు వేస్తుంది. టిపికల్ యంగ్ ఛాప్. ఇంకా రెండు క్యారెక్టర్లు ఉంటాయి. ఒకడు ఆయుష్మాన్ ఖురానా, ఇంకొకడు రాజ్‌కుమార్ రావ్. వీళ్ల ముగ్గురి చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ రొమాంటిక్ కామెడీని థియేటర్స్‌లో చూడాలంటే ఆగస్టు 18 వరకు ఆగాలి. ఆ లోపు వచ్చే మరిన్ని టీజర్లతో మీ జీవితాన్ని సరిపెట్టుకోవచ్చు. అంత ప్రామిసింగ్‌గా ఉంది మరి ఈ ట్రైలర్. అన్నట్టు.. బిట్టీ ఎవరనేనా మీ డౌటు? బ్యూటిఫుల్ అండ్ లవ్‌లీ లేడీ కృతీ సనన్.
మర్చిపోయా.. మళ్లీ చెప్పండి
ది డిజాస్టర్ ఆర్టిస్ట్ : టీజర్
నిడివి : 1 ని. 24 సె., హిట్స్: 0,90,888
రెడీ.. యాక్షన్. నటుడు తలుపు తోసుకుని వచ్చేస్తాడు. వచ్చాక డైలాగ్ చెప్పాలి కదా. చెప్పడు. ‘వాటీజ్ ద లైన్?’ అని అడుగుతాడు! డైరెక్టర్ చెబుతాడు. ‘ఐ డిడ్ నాట్ హిట్ హర్, ఇటీజ్ నాట్ ట్రు, ఇటీజ్ బుల్‌షిట్’. ఇదీ డైలాగ్. నటుడు మళ్లీ లోపలికి వెళ్లి, రెడీ.. యాక్షన్ అని అనగానే తలుపు తోసుకుని బయటికి వస్తాడు. వచ్చాక డైలాగ్ చెప్పాలి కదా. చెప్తాడు. కానీ తప్పు చెప్తాడు. అలా బోలెడన్ని టేకులు తింటాడు. చివరికి ఎప్పటికో కరెక్ట్ డైలాగ్ చెప్తాడు. కానీ కెమెరా రెడీగా ఉండదు. జేమ్స్ ఫ్రాంకో డైరెక్షన్‌లో వస్తున్న అమెరికన్ బయోగ్రఫికల్ కామెడీ–డ్రామా ‘ది డిజాస్టర్ ఆర్టిస్ట్’ చిత్రం టీజర్‌లోని సన్నివేశాలు ఇవి. ఫ్రెంచి–అమెరికన్ రచయిత గ్రెగ్ సెస్టెరో 2013లో రాసిన అవార్డు విన్నింగ్ నవల ‘ది డిజాస్టర్ ఆర్టిస్ట్’ అధారంగా అదే పేరుతో తయారవుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 1న విడుదల అవుతోంది. కథాంశం ఏమీ లేదు. 2003లో టామీ విస్యూ తీసిన ‘ది రూమ్’ చిత్ర నిర్మాణ విశేషాలు ఉంటాయి! నవల రాయడానికి ముందే ‘ది రూమ్’ చిత్రంలో మార్క్ అనే పాత్రలో నటించిన గ్రెగ్ సెస్టెరో ‘ది డిజాస్టర్ ఆర్టిస్ట్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. అదొక విశేషం. గ్రెగ్, టామీల తొలినాళ్ల స్నేహంలోని హాస్యభరిత సందర్భాలు కూడా ఇందులో జోడించారు. ఇదొక క్లాసిక్ కామెడీ మూవీ. మరి ఈ కామెడీ ఇంట్రెస్టుగా ఉంటుందా? ఉండేలా తీస్తున్నారని ఈ టీజర్‌ని చూసి చెప్పేయొచ్చు.
పనిలేక పగలగొట్టేసింది
గోట్ బ్రేక్స్ ఇన్‌టు ఆర్గానిక్ కొలరాడో ఆఫీస్
నిడివి : 52 సె., హిట్స్ : 14,45,261
జూలై 17 సోమవారం 2017. కొలరాడో (యు.ఎస్.)లోని ఆర్గానిక్స్ సంస్థ కార్యాలయం. డ్యూటీ టైమ్‌కి సిబ్బంది వచ్చేశారు. వచ్చినవాళ్లు వచ్చినట్లుగా ఎంట్రెన్స్ దగ్గరే షాక్ తిన్నారు. ఆఫీస్ తలుపులు బద్ధలు కొట్టి ఉన్నాయి! ఆఫీస్‌లో దొంగలు పడ్డారని వారికి అర్థమైంది. లోపలికి వచ్చి చూశారు. ఆశ్చర్యం. ఇన్‌సైడ్ ఏమీ చెక్కు చెదర్లేదు. చెల్లాచెదురూ కాలేదు. ఎక్కడివక్కడే ఉన్నాయి! మరి దొంగలు ఏం తీసుకెళ్లినట్లు? ఎవరు చెప్తారు. పోలీసులకు చెప్తామా అనుకున్నారు. ముందైతే సి.సి.కెమెరాలు చూద్దాం అని, వెంటనే రివైండ్ కొట్టారు.
జూలై 16 ఆదివారం 2017. సాయంత్రం 5. 34 నిముషాలు. ఎద్దులాంటి బలమైన మేక ఒకటి గ్లాస్ డోర్ దగ్గరికి వచ్చింది. తలతో బలంగా డోర్‌ని గుద్దింది. డోర్ స్ట్రాంగ్‌గా ఉంది. కానీ మేక ఇంటెన్షన్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నట్లుంది. తలతో మళ్లీ బలంగా గ్లాస్ డోర్‌పై మోదింది. మళ్లీ మోదింది. భళ్లున గ్లాస్ బద్ధలైంది. ఆ చప్పుడుకు మేక బెదిరిపోయి వెనక్కు పరుగెత్తింది. కానీ కొన్ని క్షణాల్లోనే మళ్లీ అక్కడికి చేరుకుంది. ఈసారి రెండో గ్లాస్ డోర్‌పై తన ప్రతాపం చూపించింది. డోర్ పగలగొట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఫన్నీ అండ్ పెయిన్‌ఫుల్ వీడియోను మీరు చూసి తీరాల్సిందే.