15న ‘కిన్నెర’ ఆధ్వర్యంలో బాపు సినీ సంగీత విభావరి | 15 'Kinner' concert film under the direction of Bapu | Sakshi
Sakshi News home page

15న ‘కిన్నెర’ ఆధ్వర్యంలో బాపు సినీ సంగీత విభావరి

Published Thu, Dec 11 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

15న ‘కిన్నెర’ ఆధ్వర్యంలో బాపు సినీ సంగీత విభావరి

15న ‘కిన్నెర’ ఆధ్వర్యంలో బాపు సినీ సంగీత విభావరి

ప్రఖ్యాత చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు 81వ జయంతి సందర్భంగా ‘కిన్నెర’ ఈ నెల 15న సాయంత్రం 5.45 గంటలకు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ‘ముత్యమంత’ పేరిట బాపు సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నిత్యసంతోషిణి, తేజస్విని, హరిణి, రోహిత్, సాయిచరణ్ తదితరులు బాపు దర్శకత్వం వహించిన సినిమాల్లోని పాటలను ఆలపిస్తారు.

ముక్తేవి ఫణి సమర్పిస్తున్న ఈ కార్యక్రమానికి స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ అధ్యక్షతన ఏర్పాటయ్యే సభా కార్యక్రమాన్ని శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా, సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా, కరూర్ వైశ్యాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.సుబ్రహ్మణ్యం ఆత్మీయ అతిథిగా, ఇండ్-భారత్ పవర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సీఎండీ కె.రఘు గౌరవ అతిథిగా, టాలీవుడ్ చానల్ సీఈవో మా శర్మ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement