Director Bapu
-
'బాపు' గారి బొమ్మలు చూడలేమా ?
దుమ్ముగూడెం: కోట్లు వెచ్చించి ప్రతిష్టించిన చిత్రాలకు ఆదరణ లేకుండాపోయింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. 2003లో జరిగిన పుష్కరాల సమయంలో అప్పటి కలెక్టర్, ప్రత్యేకాధికారి అరవింద్‌కుమార్ పర్ణశాలను మరింత అందంగా ముస్తాబు చేయడానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. రూ.1.40కోట్లు కేటాయించి.. రామాయణ దృశ్యాల చిత్రాలను ఏర్పాటు చేసే బాధ్యతను సినీ దర్శకుడు, సీనియర్ చిత్రకారుడు బాపుకు అప్పగించారు. ఆయన పర్ణశాలను సందర్శించి.. చిత్రాలను ప్రతిష్టించే ప్రాంతాలపై అధ్యయనం చేశారు. సీతా కుటీరంను బాంబోలతో నిర్మించడంతో పాటు చుట్టూ రామాయణ దృశ్యాల ప్రతిమలను ప్రతిష్టించారు. అయితే శిథిలమైన ఆ బొమ్మలు భక్తులకు కనిపించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు వాటిని చూసే భాగ్యం లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
నాన్న, మావలను చూస్తున్నట్టే ఉంది
కొత్తపేట: రాజమండ్రిలో ప్రతిష్టించనున్న విఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు, సుప్రసిద్ధ రచయిత ముళ్లపూడి వెంకటరమణల జంట విగ్రహం నమూనాను చూసి బాపు కుమారుడు వెంకటరమణ ముగ్ధుడయ్యారు. ‘నాన్న, మావ(రమణ) విగ్రహాలు చూస్తుంటే వారిని సజీవంగా చూస్తున్నట్టే ఉంది’ అన్నారు. వెంకట రమణ, ఆయన భార్య భారతి, సోదరి చెల్లపల్లి భానుమతి, ముళ్ళపూడి వెంకటరమణ తమ్ముడు ప్రసాద్ కోడలు ఉదయ శుక్రవారం కొత్తపేటలో ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పశాలను సందర్శించారు. అక్కడ రూపు దిద్దుకుంటున్న బాపు, రమణల జంట విగ్రహం నమూనాను చూసి పులకించిపోయారు. శిల్పి రాజ్‌కుమార్‌ను అభినందించారు. నాన్నా, మావలది విడదీయరాని బంధమన్నారు. వారితో పాటు బాపు సన్నిహితుడు, కోనసీమ చిత్రకళాపరిషత్ అధ్యక్షుడు కురసాల సీతారామస్వామి, కొత్తపేట కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి.సుబ్బారావు తదితరులున్నారు. -
15న ‘కిన్నెర’ ఆధ్వర్యంలో బాపు సినీ సంగీత విభావరి
ప్రఖ్యాత చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు 81వ జయంతి సందర్భంగా ‘కిన్నెర’ ఈ నెల 15న సాయంత్రం 5.45 గంటలకు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ‘ముత్యమంత’ పేరిట బాపు సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నిత్యసంతోషిణి, తేజస్విని, హరిణి, రోహిత్, సాయిచరణ్ తదితరులు బాపు దర్శకత్వం వహించిన సినిమాల్లోని పాటలను ఆలపిస్తారు. ముక్తేవి ఫణి సమర్పిస్తున్న ఈ కార్యక్రమానికి స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణ అధ్యక్షతన ఏర్పాటయ్యే సభా కార్యక్రమాన్ని శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా, సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా, కరూర్ వైశ్యాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.సుబ్రహ్మణ్యం ఆత్మీయ అతిథిగా, ఇండ్-భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ సీఎండీ కె.రఘు గౌరవ అతిథిగా, టాలీవుడ్ చానల్ సీఈవో మా శర్మ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. -
బాపు పార్ధీవ దేహానికి చిరంజీవి నివాళి