నాన్న, మావలను చూస్తున్నట్టే ఉంది | join statues of bapu and venkatramana | Sakshi
Sakshi News home page

నాన్న, మావలను చూస్తున్నట్టే ఉంది

Published Sat, Dec 27 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

నాన్న, మావలను చూస్తున్నట్టే ఉంది

నాన్న, మావలను చూస్తున్నట్టే ఉంది

కొత్తపేట: రాజమండ్రిలో ప్రతిష్టించనున్న విఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు, సుప్రసిద్ధ రచయిత ముళ్లపూడి వెంకటరమణల జంట విగ్రహం నమూనాను చూసి బాపు కుమారుడు వెంకటరమణ ముగ్ధుడయ్యారు. ‘నాన్న, మావ(రమణ) విగ్రహాలు చూస్తుంటే వారిని సజీవంగా చూస్తున్నట్టే ఉంది’ అన్నారు. వెంకట రమణ, ఆయన భార్య భారతి, సోదరి చెల్లపల్లి భానుమతి, ముళ్ళపూడి వెంకటరమణ తమ్ముడు ప్రసాద్ కోడలు ఉదయ శుక్రవారం కొత్తపేటలో ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పశాలను సందర్శించారు.

అక్కడ రూపు దిద్దుకుంటున్న బాపు, రమణల జంట విగ్రహం నమూనాను చూసి పులకించిపోయారు. శిల్పి రాజ్‌కుమార్‌ను అభినందించారు.  నాన్నా, మావలది విడదీయరాని బంధమన్నారు. వారితో పాటు బాపు సన్నిహితుడు, కోనసీమ చిత్రకళాపరిషత్ అధ్యక్షుడు కురసాల సీతారామస్వామి, కొత్తపేట కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి.సుబ్బారావు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement