అందానికివే మంత్రదండాలు ! | Aesthetic Dermatology will make to glow in skin | Sakshi
Sakshi News home page

అందానికివే మంత్రదండాలు !

Published Wed, Dec 17 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

అందానికివే మంత్రదండాలు !

అందానికివే మంత్రదండాలు !

అందం అదృష్టం కాదు. ఇందుకోసం ఎంతో శ్రద్ధ కావాలి. చాలా కొద్దిమంది మాత్రం అందమైన చర్మాన్ని, ఆకర్షణీయమైన రూపానికి కారణమయ్యే జన్యువులను కలిగివుంటారు. కాబట్టి ఎక్కువ కష్టపడకుండానే యవ్వన రూపాన్ని కోల్పోకుండా ఉంటారు. ఇక మిగిలిన వాళ్లకు కూడా సహాయపడగలిగే ఆధునిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. అదే ఈస్తటిక్ డెర్మటాలజీ. ఏ వయసులోనైనా ఆకర్షణీయంగా కనబడడాన్ని ఈ వైద్యపరిజ్ఞానం సుసాధ్యం చేస్తున్నది. యాంటి ఏజింగ్ అనేది కేవలం వయసు తక్కువ కనిపించేట్టుగా చేసే ప్రయత్నం మాత్రమే కాదు. వయసుకు తగిన అందాన్ని కాపాడుకోవడం, ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవడం కూడా..
 
 మీ భావవ్యక్తీకరణలను కనిపించకుండా ఫ్రీజ్ చేసేసి, ముడతల్ని ఇస్త్రీ చేసేసి, సాగిన చర్మానికి కృత్రిమ మెరపులద్దడం యాంటి ఏజింగ్ కాదు. నిజానికి ఈ కృత్రిమ హంగులు అంత మంచివి కూడా కాదు. యాంటి ఏజింగ్ అనేది ఒక మంత్రదండం లాంటిది. అయితే మీరు తప్పుబట్టాల్సింది మ్యాజిక్‌ని కాదు... మెజీషియన్‌ని.. అందుకే నిపుణుడైన, అనుభవజ్ఞుడైన డాక్టర్‌పై నమ్మకం పెట్టడం అవసరం. ఇంజెక్షన్లు నాకు అత్యంత ఇష్టమైన మంత్రదండాలు, సరైన పద్ధతిలో ఇస్తే వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సన్నని గీతలు చెరిపేయడానికి, చర్మాన్ని బిగుతుగా, మృదువుగా చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ముఖ ఆకృతిని సరిచేయడంలో కూడా ఇవి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కాస్మెటిక్ చికిత్సల్లో ఇంజెక్టబుల్స్ అత్యంత సురక్షితమైనవని అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ చేసిన ఇటీవలి అధ్యయనంలో తేలింది.
 
 ప్రముఖమైన ఇంజెక్టబుల్స్ ఇవీ...
 బొటాక్స్:
 ఇది ఒక ప్రొటీన్. ఇంజెక్షన్ ఇచ్చిన చోట కండరాన్ని ఈ బొటాక్స్ వ్యాకోచింపచేస్తుంది. మన భావవ్యక్తీకరణల వల్ల ఏర్పడిన సన్నని గీతల వంటి చిన్న చిన్న ముడతలను తొలగించడానికి సాధారణంగా దీన్ని ఉపయోగిస్తారు. అయితే దవడ పునర్నిర్మాణం, ముఖ కండరాలు కిందకి జారిపోవడం (అంటే మెడ దగ్గరి ముఖ కండరాలు, నుదురును కిందికి జారినట్టు చేసే కండరాలు) వంటి వాటికి కూడా వీటిని ఉపయోగిస్తారు. బన్నీస్మైల్, ముక్కు రంధ్రాల్లో మంట లాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. అంతేగాక మైగ్రేన్ తలనొప్పి, అధిక చెమట లాంటి ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స అందిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తవడానికి కేవలం 10 నిమిషాల
 సమయం చాలు.
 
 ఫిల్లర్:
 ఫిల్లర్ అనేది ఒక జెల్ లాంటి పదార్ధం. ఇది జీవసంబంధమైన పదార్థాలతో తయారుచేసింది. (బయలాజికల్ జెల్). దీన్ని లోపం ఉన్న భాగానికి ఇంజెక్ట్ చేస్తారు. విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా కనిపించే గీతలు (నవ్వినప్పుడు ఏర్పడే గీతలు, కోపం ముఖం వల్ల ఏర్పడిన గీతల్లాంటివి) ఉన్నచోటికి కూడా దీన్ని ఇంజెక్ట్ చేస్తారు. లోపలికి పోయిన బుగ్గలు, కళ్ల కింది భాగాల్లోకి కూడా పంపిస్తారు. పెదవులు, గడ్డం, బుగ్గల లాంటి భాగాలను బలోపేతం చేసి, వాటి పరిమాణాన్ని పెంచుతారు. ఏవైనా మచ్చలు, లేదా హైడ్రేషన్, చర్మం రిఫ్రెష్ చేయడం ద్వారా సన్నని స్టాటిక్ గీతలను కూడా తగ్గిస్తారు. చికిత్స చేయాల్సిన భాగం రంగును బట్టి దీనికి 5 నుంచి 20 నిమిషాలు పడుతుంది. బొటాక్స్, ఫిల్లర్‌ల గురించి మరింత సమాచారం కొరకు కింది వీడియోలను చూడవచ్చు.
 www.drrashmishetty.com/pages/botox.html
 www.drrashmishetty.com/pages/filler.htm
 అందంగా మార్చడం వెనుక డాక్టర్ నైపుణ్యం ఉంటుంది. అంతేగాక సమస్యను విశ్లేషించడం, చికిత్సకు ప్రణాళిక రూపొందించడం కూడా కీలకమే.
 
- డాక్టర్ రశ్మిశెట్టి
 రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్,
 రోడ్ నెం. 4, బంజారాహిల్స్, హైదరాబాద్
 9000770895, 8008001225

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement