
ఆర్ట్ హౌస్
ఆర్టిస్టులు గ్యాలరీలు ప్రారంభించడం నగరంలో అరుదైన విషయమే. సిటీ నుంచి చిత్రకారుడిగా సుపరిచితుడైన హరిశ్రీనివాస్... సొంత గ్యాలరీని బంజారాహిల్స్ రోడ్‌నం: 7లో నెలకొల్పారు. ‘ఆర్ట్ హౌస్’ పేరుతో మెరిడియన్ స్కూల్ ఎదురుగా ఏర్పాటైన ఈ గ్యాలరీని బుధవారం నటుడు రాజా ప్రారంభించాడు. వ్యక్తిగత చిత్రాలతో పాటు ఔత్సాహికులు, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే చిత్రకారులకు ఈ గ్యాలరీ అండగా నిలుస్తుందని గ్యాలరీ నిర్వాహకులు హరిశ్రీనివాస్, అనిత చెప్పారు.
- సాక్షి, సిటీ ప్లస్