
తుంటరి చెంప ఛెళ్!
బిగ్, స్మాల్... స్క్రీన్ ఏదైనా ముద్దుగుమ్మలకు తిప్పలు తప్పడం లేదు పబ్లిక్‌లోకి వెళితే. హాలీవుడ్... బాలీవుడ్ అన్న తేడా లేదు... ఎక్కడో అక్కడ తారలపై ఆకతాయిల ఆగడాలు రొటీన్ అయిపోయాయి. తాజాగా టీవీ నటి ఐరిస్ మైటీకీ ఓ తుంటరి గ్యాంగ్ తగిలింది. అందులో ఒకడు ఆమె వెంటపడి.. ఆపై తిట్లు అందుకున్నాడు. చిర్రెత్తిన ఐరిస్... డిఫరెంట్ ట్రీట్ ఇచ్చింది. సర్రున వెనక్కు తిరిగి ఆ పోకిరి గూబ గుయ్యిమనిపించింది. దెబ్బకు అతగాడు దిమ్మ తిరిగి కిందపడ్డాడు. అంతటితో వదలకుండా... పోలీసులకు పట్టించింది. ‘ఓ గాడ్! నాకు మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వచ్చు కాబట్టి సరిపోయింది’ అంటూ తన టాలెంట్ గురించి లేటుగా హింటిచ్చిందీ సుందరి!