ఆఫ్టర్ ఆల్..! | Chris Klein Is Engaged to Laina Rose Thyfault | Sakshi
Sakshi News home page

ఆఫ్టర్ ఆల్..!

Published Thu, Dec 25 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

ఆఫ్టర్ ఆల్..!

ఆఫ్టర్ ఆల్..!

ఊ...ఫ్..! మూడున్నరేళ్ల సుదీర్ఘ డేటింగ్‌కు ఎట్టకేలకు తెర దించారు హాలీవుడ్ స్టార్ క్రిస్ క్లెయిన్, అతని ప్రేయసి లైనా రోజ్ థైఫాల్ట్. ఇన్నాళ్లూ చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన ఈ ఇద్దరి డేటింగ్‌షిప్ ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌గా మారింది. సరిగ్గా మూడున్నరేళ్ల కిందట కామన్ ఫ్రెండ్ పెళ్లిలో చూపులు కలిపిన ఈ ఇద్దరూ... ఆపై దాన్ని ప్రేమగా మార్చుకున్నారు.

సహవాసాన్ని సహజీవనంగా చేసుకుని ఆస్వాదించారు. అయితే తొలుత ప్రజోజ్ చేసింది మాత్రం మనోడే. అదీ అందమైన వెనిస్ బీచ్ సాక్షిగా. సముద్రపు గాలులు అమ్మడిలో వైబ్రేషన్స్ తెచ్చినట్టున్నాయి... నాడు అతగాడి ప్రజోజల్‌కు వెంటనే ఓకే చెప్పేసింది లైనా. అన్నీ కుదిరితే రాబోయే సమ్మర్‌లో పెళ్లి బాజా కూడా మోగుతుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement