ఇక కల్యాణం... కమనీయం | Cameron Diaz Is Engaged to Benji Madden! | Sakshi
Sakshi News home page

ఇక కల్యాణం... కమనీయం

Published Sun, Dec 21 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

ఇక కల్యాణం... కమనీయం

ఇక కల్యాణం... కమనీయం

హాలీవుడ్ అగ్రతారల్లో ఒకరైన కామరూన్ డయాజ్ ఇప్పటివరకు అరడజను మంది స్టార్స్‌తో డేటింగ్ చేశారు. వాళ్లలో ఎవర్నీ పెళ్లి చేసుకోవాలనిపించలేదని పలు సందర్భాల్లో కామరూన్ పేర్కొన్నారు. ఏళ్ల తరబడి వీళ్లతో డేటింగ్ చేసి, పెళ్లి వరకూ వెళ్లని కామరూన్... కేవలం ఏడు నెలలుగా డేటింగ్ చేస్తున్న రాక్‌స్టార్ బెంజీ మాడ్డెన్‌తో మాత్రం పెళ్లికి సిద్ధపడ్డారు. కామరూన్ వయసిప్పుడు 42 ఏళ్ళు.  బెంజీ ఆమె కన్నా దాదాపు ఆరేళ్లు చిన్నవాడు. కానీ, మనసులో ప్రేమ ఉంటే వయసుతో సంబంధం ఏంటి? అంటున్నారు కామరూన్. ఈ ఇద్దరి నిశ్చితార్థం ఇటీవల జరిగింది.

ఈ సందర్భంగా కామరూన్ వేలికి బెంజీ తొడిగిన వజ్రపుటుంగరం ఆమె చేతి అందాన్ని మరింత పెంచింది. వచ్చే ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ఇది ఇలా ఉండగా, పెళ్లికి సిద్ధపడ్డ కామరూన్ తల్లవుతారా? లేదా? అన్నది ఇప్పుడు హాలీవుడ్‌లో జరుగుతున్న చర్చ. దీనికి కారణం లేకపోలేదు. మాతృత్వం మీద తనకంత మమకారం లేదని పలు సందర్భాల్లో కామరూన్ పేర్కొన్నారు. మరి.. ఆ నిర్ణయాన్ని రేపు పెళ్ళయ్యాక మార్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement