ఆ దర్శకుడే ఇప్పుడు హాట్ టాపిక్! | Cinema Industry Hot Topic director VV Vinayak! | Sakshi
Sakshi News home page

ఆ దర్శకుడే ఇప్పుడు హాట్ టాపిక్!

Published Wed, Nov 19 2014 9:31 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

వి.వి.వినాయక్ - Sakshi

వి.వి.వినాయక్

ఆదితో బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ని అడ్డంగా నరికేశాడు. ఠాగూర్‌తో కలెక్షన్ల సునామీ సృష్టించాడు. అదుర్స్‌తో నవ్వులు పువ్వులు పూయించాడు. రాటుతేలిన ఫ్యాక్షన్ విలన్స్‌తో ఎమోషన్స్‌ పండించాడు. యాక్షన్‌ హీరోలతో కామెడీ చేయించాడు. విక్టరీలతో టాలీవుడ్‌ హిస్టరీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవర్‌ఫుల్ డైరెక్టర్.  అంతేకాదు ఆ డైరెక్టర్ రీసెంట్‌గా ఓ స్టార్ నిర్మాతకి చుక్కలు కూడా చూపించాడని టాలీవుడ్ టాక్.  అగ్రహీరో చిత్రమైనా, అగ్రహీరో కొడుకు చిత్రమైనా దర్శకుడిగా మొదట వినిపించే పేరు అతనిదే. ఆ డైరెక్టర్ ఎవరో అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. అతనే వి.వి.వినాయక్.

సుమోలు -  బాంబులు - కత్తులు - కొడవళ్ళు - అంతా బీభత్సం - నరికేస్తా - చంపేస్తా అంటూ కేకలు. వినాయక్ సినిమా అంటే ఇంతేనా అని ఆడియెన్స్ ఫిక్స్‌ అయిపోయే టైమ్‌కి సడెన్‌గా కామెడీ ట్రాక్ పట్టాడు. యాక్షన్ హీరోలతో నవ్వుల పువ్వులు పూయించాడు.  కృష్ణ, అదుర్స్ వంటి యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో  ప్రేక్షకుల్ని అలరించాడు.

హీరోయిజంలో  ఉండే అన్ని కోణాల్ని  ఫవర్‌ఫుల్‌గా  స్క్రీన్‌పై చూపించడంలో  వినాయక్ దిట్ట‌. అందుకే తనకున్న ఈ ప్రత్యేక టాలెంట్‌తో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ని అల్లుడు శీనుగా ప్రేక్షకుల ముందుకి తెచ్చినందుకు ఈ స్టార్‌ డైరెక్టర్‌ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్‌ అందుకున్నాడని చెబుతారు. ఇదే తరహాలో అఖిల్‌ డెబ్యూ మూవీకి కూడా వినాయక్‌ భారీగా డిమాండ్‌ చేస్తున్నట్లు ఫిల్మ్‌ నగర్‌లో రూమర్స్ షికార్లు చేస్తున్నాయి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement