దుర్గం చెరువు.. పూనమ్ పాండే | Durgam pond to be changed as Punam pond at New year eve | Sakshi
Sakshi News home page

దుర్గం చెరువు.. పూనమ్ పాండే

Dec 31 2014 12:15 AM | Updated on Oct 17 2018 4:29 PM

దుర్గం చెరువు..  పూనమ్ పాండే - Sakshi

దుర్గం చెరువు.. పూనమ్ పాండే

చలిలో వణుకుతున్న నగరాన్ని న్యూ ఇయర్ ఈవ్ వేడెక్కించనుంది. జూబ్లీహిల్స్‌లోని దుర్గం చెరువు పూనమ్ పాండ్‌గా మారనుంది.

నేడు పూనమ్ షో
ఎక్కడ: మరకేష్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్
సమయం: రాత్రి 10:00

 
చలిలో వణుకుతున్న నగరాన్ని న్యూ ఇయర్ ఈవ్ వేడెక్కించనుంది. జూబ్లీహిల్స్‌లోని దుర్గం చెరువు పూనమ్ పాండ్‌గా మారనుంది. వస్త్రధారణలో బహు పొదుపరి, నిరంతర వివాదాలతో తరచు వార్తలకెక్కడంలో కడు గడసరిగా పేరుమోసిన పూనమ్ పాండే తన చిందు చిద్విలాసాలతో హైదరాబాదీలను హీటెక్కించనుంది. తన తొలి తెలుగు చిత్రం ‘మాలిని అండ్ కో’ ప్రోమో కోసం న్యూ ఇయర్ ఈవ్‌కు ఒకరోజు ముందే నగరానికి విచ్చేసిన ఈ బాలీవుడ్ బాంబ్‌షెల్ కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. అవి ఆమె మాటల్లోనే..
 
వివాదాలే నా విలాసం..
 నేను ముంబైలో పుట్టి పెరిగాను. స్కూల్ డేస్ నుంచే వరల్డ్ క్లాస్ టాప్ మోడల్ కావాలని కలలు కనేదాన్ని. అదే దృష్టిలో పెట్టుకుని చదువు పూర్తి చేశాను. అనుకున్నట్లుగానే ఎన్నో మోడలింగ్స్, క్యాలెండర్ యాడ్స్, రియాలిటీ షోస్ చేశాను. నేనందరిలాంటి దాన్ని కాను. నిరంతరం వివాదాలతోనే వార్తల్లో నలుగుతూ పైకొచ్చాను. మంచో, చెడో నాపై చెలరేగిన వివాదాల వల్లనే నాకెన్నో సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో నా సెమీన్యూడ్ ఫొటోస్ జనాల అటెన్షన్ డ్రా చేయడం కోసమే. నేనలా సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకోకుండా ఉంటే, ఇప్పుడు నాకు ఈ అవకాశాలేవీ ఉండేవి కాదు. దానిని కూడా కాంట్రావర్సీ చేస్తే, నేనేం చేయను? ఎనభయ్యేళ్ల వయసులోనూ ఇలానే సెక్సీగా, పర్‌ఫెక్ట్‌గా ఉండాలనేదే నా కోరిక.
 
 హైదరాబాద్‌తో తెలియని అనుబంధం..
 ఇక టాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఒక తెలుగు సినిమా చేయడం నాకు మంచి అనుభూతినిచ్చింది. ఇదే నా మొదటి తెలుగు సినిమా. హైదరాబాద్ లొకేషన్స్‌లోనే ఈ సినిమా షూటింగ్ అంతా జరిగింది. నేను హైదరాబాద్ రావడం కూడా ఇదే మొదటిసారి. ఇక్కడి ప్రజలు నన్ను ఓ ఏంజెల్‌లా చూసుకుని, ఎంతో ఆదరించారు. నేను ఊహించని విధంగా నన్ను ట్రీట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌తో నాకు ఒక తెలియని అనుబంధం ఏర్పడింది. న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా దుర్గంచెరువు వద్ద స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నా. హైదరాబాద్‌లోని అభిమానుల కోసం కొన్ని సర్‌ప్రైజింగ్ కాన్సెప్ట్స్, సిజ్లింగ్ డ్యాన్స్ నంబర్స్‌తో న్యూ ఇయర్ బాష్‌ను అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. ఒక తెలుగు సినిమాను, తెలుగు వారితో న్యూఇయర్ బాష్ సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చిన హైదరాబాద్‌ను, 2014 సంవత్సరాన్ని నేను ఎన్నటికీ మరువలేను.
 - శిరీష చల్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement