గోల్ఫ్‌కొండ అదిరింది! | golf court is superb | Sakshi
Sakshi News home page

గోల్ఫ్‌కొండ అదిరింది!

Published Sat, Mar 14 2015 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

గోల్ఫ్‌కొండ అదిరింది!

గోల్ఫ్‌కొండ అదిరింది!

ఎప్పుడూ కుక్కపిల్లలతో.. పిల్లికూనలతో.. ఉండే అమల అక్కినేని గోల్ఫ్ స్టిక్‌తో ఉందేంటబ్బా అనుకుంటున్నారా..! ఈ సీన్ వెనుక కూడా పరమార్థం ఆ మూగజీవాల శ్రేయస్సే ఉంది మరి. వన్యప్రాణి సంరక్షణకు పాటుపడుతున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్, గతి సంయుక్తంగా గోల్ఫ్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి.
 శుక్రవారం గోల్కొండ నయాఖిలాలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌కు అమల హాజరయ్యారు. అదే టైమ్‌లో ఆమె కాసేపు ఇలా గోల్ఫ్ ప్లేయర్ అవతారమెత్తారు. ఆదివారం జరగనున్న గోల్ఫ్ టోర్నమెంట్‌లో గోల్ఫర్ల కుటుంబసభ్యులు కూడా పాల్గొనవచ్చని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛైర్మన్ అనిల్‌కుమార్ వి.ఈపూర్ అన్నారు. గోల్ఫర్ల పిల్లలకు పెయింటింగ్ పోటీలు, బర్డ్ వాచింగ్ సెషన్లు, వైల్డ్ లై ఫ్ ఫొటోగ్రఫి కం వర్క్‌షాప్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఈవెంట్‌కు హీరో రామ్‌చరణ్‌తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement