ఫేస్‌బుక్‌లో విమర్శలను సమర్ధించవచ్చా? | Is Advocating Criticism in Facebook ? | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో విమర్శలను సమర్ధించవచ్చా?

Published Sat, May 24 2014 8:46 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ఫేస్‌బుక్‌లో విమర్శలను సమర్ధించవచ్చా? - Sakshi

ఫేస్‌బుక్‌లో విమర్శలను సమర్ధించవచ్చా?

ఇంటర్నెట్ పుణ్యమా అంటూ సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే దీని ఉపయోగం వల్ల మంచి, చెడు రెండు జరుగుతున్నాయి.

ఇంటర్నెట్ పుణ్యమా అంటూ సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే దీని ఉపయోగం వల్ల మంచి, చెడు రెండు జరుగుతున్నాయి. లాభాలు ఎన్ని ఉన్నాయో, అంతకు మించి నష్టాలు జరుగుతున్నాయి. ఈ సోషల్ మీడియా చాలా మందిని కలుపుతుంది. అలాగే చాలా జీవితాలను నాశనం చేస్తోంది. ఏదైనా మనం జాగ్రత్తగా వాడుకోవడంలోనే ఉంది. ప్రతి అంశంలోనూ మనం ఎలా జాగ్రత్తగా వ్యవహరిస్తామో, అదే మాదిరి సోషల్ మీడియా విషయంలో కూడా అందరూ జాగ్రత్తగా వ్వవహరించవలసిన అవసరం ఉంది.

ముఖ్యంగా కొందరు ఫేస్‌బుక్‌లో ప్రముఖులను తీవ్రస్థాయిలో విమర్శించి వారిని ఇబ్బందులు పెడుతున్నారు. సినిమా తారాలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు .... ఎవరినీ వదలరు.  ప్రముఖులను, ముఖ్యంగా సినిమా నటీమణులను ఎక్కువగా మనసిక వేధనకు గురిచేస్తున్నారు. కొందరు సభ్యత, సంస్కారం మరచి మరీ దారుణమైన భాష వాడతారు. అసహ్యమైన పదజాలం వాడుతుంటారు. ఫేస్బుక్లో ఈ విధమైన విమర్శలను పోస్ట్ చేసినవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, అంత అవసరంలేదని మరికొందరి వాదన.

ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఫేస్‌బుక్‌లో విమర్శలు చేసినందుకు గోవా పోలీసులు  ఓ యువకుడిపై  ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.  పలు పార్టీలు, సామాజిక కార్యకర్తలు  పోలీసుల చర్యను తప్పు పట్టారు. పోలీసుల చర్యకు నిరసనగా పణాజీలోని పోలీసు కేంద్రకార్యాలయం ఎదుట ఈరోజు ధర్నా కూడా  చేశారు.

ఫేస్‌బుక్‌లో విమర్శలు చేయడం వంటి  చర్యలను సమర్ధిస్తే భవిష్యత్లో సోషల్ మీడియా మరీ దారుణమైన పరిస్థితులకు దిగజారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎంతోమందిని ఇబ్బందిపెట్టిన ఇటువంటి చర్యలను ఖండించవలసిందేనని అంటున్నారు. తప్పుడు విమర్శలు, అసహ్యమైన భాష వాడేవారిపై చర్యలు తీసుకుంటేనే ముందు ముందు ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement