మెచ్చుకోలు
జ్యోతిర్మయం
ఏ రంగంలోనైనా అంతో ఇంతో ప్రతిభ ఉన్న ప్రతి వాడూ తన ప్రతిభను లోకం మెచ్చుకోవాలని ఆశిస్తాడు. కవికీ, కళాకారుడికీ ఆ మెచ్చుకోలు సాటి కళా కారుల నుంచి వస్తే మరీ ఆనందం. మెచ్చుకోలు వాళ ్లకు ఎంత ఆనందం ఇస్తుందో, తిరస్కారం అంతకంటే ఎక్కువ హృదయ వేదన కలిగిస్తుంది. అలాంటి వేద నలో తమ కావ్యాలు తామే నిప్పులో పారేసిన వాళ్లూ, ఆత్మహత్యలు చేసుకొన్న వాళ్లూ చరిత్రలో ఎందరో ఉన్నారు. ఆశ్చర్యమేమిటంటే, మహాకవులుగా చరి త్రలో నిలిచిన చాలా మందికి, తమ జీవిత కాలంలో తమ సమకాలికుల చేత హృద యపూర్వకంగా ‘సెభాష్’ అని పించుకోవటం తీరని కోరిక గానే మిగిలిపోయింది. కాళిదా సు అంతటి మహాకవి కాళీమా త ప్రసాదాన్నీ, రాజ సత్కారాన్నీ అయితే పొందాడు కానీ, తన సమకాలికుడైన దిగ్నా గుడి వంటి వాళ్ల వెటకారాలూ, హేళనలూ తప్పించు కోలేకపోయాడు. అందుకే, ‘రసజ్ఞులారా, పురాతనమై నదంతా మహత్తరమైనదని నెత్తిన పెట్టుకొని, నాలాం టి నవీనులు రాసిందంతా నిస్సారమని భావించకం డి’ అని మొరపెట్టుకొన్నాడు. బాణభట్టు తన కావ్యం తన సమకాలిక విమర్శకులకు నచ్చలేదని బాధపడి, దాన్ని నిప్పులో గిరవాటు వేశాడట. చాలా వరకు కాలి పోగా, దుఃఖావేశం తగ్గిన తరవాత కొడుకు సహాయం తో దాన్ని మళ్లీ మొత్తం తిరగరాసుకొన్నాడట.
భవభూతి కూడా సమకాలికుల విమర్శల బాధి తుడే. ‘అయ్యా, లోకంలో నా కావ్యం చూసి పెదవి విరి చే వాళ్లు ఉంటే ఉండచ్చుగాక. వాళ్ల జ్ఞానమూ పాం డిత్యమూ వాళ్లవి. నేను రాసేది వాళ్ల కోసం కాదు. ఈ అనంత కాలచక్రంలో, ఈ విశాల విశ్వంలో నాలాంటి మనోధర్మం కలవాడు మరొకడు పుట్టకనూ పోడు, నా కావ్యంవల్ల ప్రయోజనం పొందకనూ పోడు!’’ అన్నాడు.
నిజానికి, ఒక మహానుభావుడి కళాఖండానికి, అతని సమకాలికుడై అదే రంగంలో ఉన్న మరో మహానుభావుడు బహిరంగంగా ‘ఆహా, ఓహో’ అని వివిధ కారణాల వల్ల ‘పెద్ద’ మనిషి తరహా మెచ్చుకోలు ప్రకటించవచ్చు గాని, పూర్తిగా, హృదయపూర్వకంగా ప్రశంసించటం కష్టమే. దీనికి చాలా కారణాలు. మాన వ సహజమైన స్పర్థ, సంకుచితత్వం ఒక కారణం. దోష రహితం అని ప్రశంసించదగ్గ కళాఖండాలు చాలా చాలా అరుదు కావడం మరొక కారణం. అభి రుచులు భిన్నంగా ఉండటం ఇంకో కారణం. రాసు కొన్న కవికి తన కవిత్వం పట్ల ఉండే మమత్వం, విమ ర్శకులకు ఉండకపోవటం మరో కారణం. పైగా, మని షికి తన ముందు తిరుగుతున్న సాటి మనిషిని మహాక విగా కళాకారుడిగా గుర్తించటం, తేలిక కాదు.
‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా!’ అని చేమకూర వెంకట కవిరాజు, తన కావ్యంలో వసంతాన్ని వర్ణిస్తూ శ్లేషిస్తాడు. అయితే నిజమైన ప్రతిభ ఊరికే పోదు. స్పర్థవల్ల సమకాలికులు మెచ్చలేకపోయినా, తరవాతి కాలం లోనైనా గుర్తింపు వచ్చి తీరుతుంది. అందుకే గొప్ప కవులూ, కళాకారులూ మరణానంతరం కూడా, జరామరణాలు లేని కీర్తికాయాలతో చిరకాలం నిలిచి ఉంటారు.
ఎం.మారుతిశాస్త్రి