అప్పుడు 7,000 ఇప్పుడు 80,000
అదొక వడపోత యంత్రం. మంచిని గ్రహించి శరీరానికి అందజేసి, చెడును బయటికి పంపించే అవయవం. అదే కిడ్నీ! ఇప్పుడిది ఒత్తిడికి గురవుతోంది. నగరజీవి అనుభవిస్తున్న ఒత్తిడిలో ఎక్కువ షేర్ చేసుకుంటున్నది ఇదే. దీంతో నగరజీవి చితికిపోతున్నాడు. ఏ ఆస్పత్రిలో చూసినా డయాలసిస్ పేషెంట్లే. ముందు కేవలం 20 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 80కి పెరిగాయి. గతంలో నెలకు 7వేల మందికి డయాలసిస్ జరిగేది. ఇప్పుడు 80 వేలకు పెరిగింది. కిడ్నీ మీద ప్రెజర్ పడటానికి కారణం నగరజీవి అనుభవిస్తున్న ప్రెజరే కారణమంటున్నారు ప్రముఖ మూత్రపిండ వ్యాధుల నిపుణులు.
నివారణకు మార్గాలు...
►కిడ్నీ జబ్బులు రాకుండా కాపాడుకోవాలంటే సాధారణ వ్యక్తి రోజూ
నాలుగైదు లీటర్ల నీరు తాగాలి. ఒత్తిడి ఉన్నవారు రోజూ 8 లీటర్లు తాగాలి.
►ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువైతే వడపోతలో ఇబ్బందులెదుర్కొని రక్తంలో ఉప్పు కలుస్తుంది. దీంతో రక్తపోటు వస్తుంది.
►సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల కొన్ని రకాల ఉత్ప్రేరక ఎంజైములు
విడుదలవుతాయి. ఇవి కిడ్నీలపై ఒత్తిడి పెంచుతాయి.
►ట్యాబ్లెట్స్ ఇష్టారాజ్యంగా వాడకూడదు. వీటిని శుద్ధిచేయాల్సింది కిడ్నీలే కాబట్టి చూసి వాడాలి.
►ఒత్తిడి కి గురయ్యేవారు తరచూ 3 నెల్ల్లకోసారి యూరిన్, క్రియాటినైన్
పరీక్షలు చేయించుకోవాలి.
►ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామమే దీనికి అత్యుత్తమ మార్గం.
సమస్యలకు కారణాలు...
►పగలు చేయాల్సిన పని రాత్రివేళ, రాత్రి నిద్రను పగలుకు పోస్ట్‌పోన్‌చేయడంతో మెటబాలిక్‌సిండ్రోమ్ కిడ్నీ జబ్బులకు కారణమవుతోంది.
►ఒత్తిడికి గురవుతున్న వాళ్లు చిన్న సమస్య వచ్చినా పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారు. వీటివల్ల బాడీల్లో ప్రత్యేక ఆమ్లాలు విడుదలై కిడ్నీకి ముప్పు వాటిల్లుతోంది.
►బైక్, స్కూటర్స్‌పై ప్రయాణంతో కిడ్నీపై ఒత్తిడి పడుతోంది.
►{ఫైడ్ ఫుడ్ (వేపుళ్లతోకూడిన) ఫుడ్ తినడం వల్ల శుద్ధి యంత్రమైన కిడ్నీ దెబ్బ తింటుంది.
►స్థూలకాయం కూడా మూత్రపిండాల సమస్యకు ఓ కారణం.
40
పేషెంట్లలో సాఫ్ట్‌వేర్, బీపీఓ ఇండస్ట్రీలో ఉన్నవారు 40 శాతం మంది
70
ఆరోగ్యశ్రీ ద్వారా జరుగుతున్న డయాలసిస్ కేసుల్లో 70 శాతం 40 ఏళ్ల లోపువారే
ప్రజెంటేషన్ : జి.రామచంద్రారెడ్డి