
ఇంటికి వెలుగు
ప్రముఖ రచయిత్రి అంజూ పొద్దర్ కలం నుంచి మరో రచన జాలువారింది. తన జీవితంలోని అనుభవాలకు అక్షర రూపమిచ్చిన ఈ ‘హోమ్ దివా’ పుస్తక ఆవిష్కరణ మంగళవారం సోమాజిగూడ ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్‌లో జరిగింది. ‘ఇంటి వాస్తు, కిచెన్, స్టోర్, చీరలు, శాలువా వాడుకునే తీరు, ఆర్ట్ వర్క్, బుక్స్, ఫొటోగ్రాఫ్, ముత్యాలు, జ్యువెలరీ, గడియారాలను భద్రపరుచుకునే టిప్స్ వంటివెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. బ్యూటిఫుల్ హోమ్‌ను సమర్థంగా నిర్వహించుకునేందుకు గృహిణులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
వారి బాధ్యతలను సులభతరం చేస్తుంది. నా లైఫ్‌లో ఎదురైన సంఘటనలకే అక్షరరూపమిచ్చా. దివా అంటే వెలుగులు. ఆ ఇంటికి కొత్త వెలుగులిచ్చేందుకు దోహద పడుతుందీ పుస్తకం. గతంలో నేను తీసుకొచ్చిన పుస్తకాల కంటే దీనికి మరింత ఆదరణ వస్తుందనుకుంటున్నా’ అన్నారు అంజు. ఇందిర సుబ్బరామిరెడ్డి, ప్రిన్సెస్ సలేహా సుల్తాన్, పింకిరెడ్డి, సంగీతారెడ్డి, డాక్టర్ శశికళ కోలా పాల్గొన్నారు.
సాక్షి, సిటీప్లస్