
సమజ్‌దార్ లోగ్
ఎడతెరిపి లేని పని భారంతో అలసిన మనసులను నవ్వుల జల్లులతో కాసింత ఉల్లాస పరిచే కామెడీ ప్లే ఇది. దర్పణ్ థియేటర్ గ్రూప్ ఈ నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ముగ్గురు మతి స్థిమితం లేని వారి చుట్టూ కథ తిరుగుతుంది. ముగ్గురూ కలసి తమ లైఫ్‌ను ఆశ్రమంలో ఆస్వాదిస్తుంటారు. ఓ రోజు ఉన్నట్టుండి వీరి మధ్యలోకి ఓ వ్యక్తి వస్తాడు.
తాను పిచ్చివాడిని కాదని, బాగా చదువుకున్నానని చెప్పుకుంటాడు. అసలు ఇంతకీ అతను ఎందుకు అక్కడికి వచ్చాడని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు ఆ ముగ్గురూ. వారి మధ్య సాగే సంభాషణ గిలిగింతలు పెడుతుంది. బంజారాహిల్స్ లామకాన్‌లో ఈ నెల 10, 11 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు ప్లే షురూ అవుతుంది. వివరాలకు: 9703169709