మైక్రోసాప్ట్ విండోస్ కొత్త వెర్షన్
మైక్రోసాప్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొత్త వెర్షన్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం విండోస్‌లో ఉన్న లేటెస్ట్ వెర్షన్ 8.1. దీనిని అప్‌గ్రేడ్ చేసి విండోస్ 9 పేరుతో మైక్రోసాప్ట్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కొత్తగా విడుదల చేయనున్న వెర్షన్ విండోస్ 9 పేరు పెడుతుందా? లేక విండోస్ 8.5 గానీ ఇంకా మరేదైనా వేరే పేరు పెడుతుందా? అనే దానిపై మైక్రోసాప్ట్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
కొత్త విండోస్‌లో చాలా మార్పులు ఉంటాయని ఆన్‌లైన్‌లో పలు రకాల అంచనాలు వస్తున్నాయి. వీటిలో ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే స్టార్ట్ మెనులో ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నారు. విండోస్ ప్రత్యేకతే స్టార్ట్ మెను. విండోస్ 8లో స్టార్ట్ మెను లేకపోవడంతో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరువాత స్టార్ట్ మెను ఆప్షన్ ఇస్తూ విండోస్ 8.1ను మైక్రోసాప్ట్ విడుదల చేసింది. విండోస్ 9లో కూడా స్టార్ మెను ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్చువల్ డెస్క్‌టాప్ ఫీచర్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఓవరాల్‌గా డెస్క్‌టాప్‌ను మరింత యూజర్‌ఫ్రెండ్లీగా మైక్రోసాప్ట్ తీర్చిదిద్దుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు ఆఖరులో ఈ కొత్త వెర్షన్ను విడుదల చేస్తారని భావిస్తున్నారు.