నో ప్రాబ్లమ్స్..!
విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నా మాజీ భార్య అమృతాసింగ్‌తో తనకు బంధాలు తెగలేదంటున్నాడు హీరో సైఫ్ అలీఖాన్. గత ఏడాది పెద్దగా కలసిరాకపోయినా... అంతా కూల్‌గానే సాగిపోయిందన్నాడు. ‘నాది పర్‌ఫెక్ట్ లైఫ్. ఇంటి వద్ద లవ్లీ వైఫ్ (కరీనాకపూర్). ప్రేమించే అమ్మ (షర్మిలా ఠాగూర్), సోదరీమణులు (సోహా, సబా అలీఖాన్), అద్భుతమైన పిల్లలు (సారా, ఇబ్రహీం)... అన్నీ ఉన్నాయి నాకు. ఆఖరికి నా మాజీ సతీమణి (అమృతాసింగ్)తో కూడా ఇప్పుడు హ్యాపీగానే మూవ్ అవ్వగలుగుతున్నా. మేమిద్దరం మా పిల్లల భవిష్యత్ గురించి చర్చించుకుంటున్నాం’ అంటూ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు సైఫ్. హూ... ఎంతమందికి ఉంటుందిలా ఎక్స్ వైఫ్‌తో కూడా హాయిగా సాగిపోయే లైఫ్!