
రంగుల ‘బతుకమ్మ’
మహిళా కళాకారుల కుంచెల నుంచి వర్ణభరితంగా జాలువారిన బతుకమ్మ చిత్రాలు కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైన ఈ చిత్ర ప్రదర్శనను తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, జీవకళ ఉట్టిపడే చిత్రాలను రూపొందించిన మహిళా కళాకారులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు, గౌరవ పారితోషికంతో సత్కరించారు. ఈ చిత్రప్రదర్శన ఈ నెల 17 వరకు కొనసా గుతుంది.
- మాదాపూర్