నిజాంపేటలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
సాక్షి, రామాయంపేట(మెదక్) : దండంపెట్టి చెపుతున్నా... ఎవరూ దయచేసి బయట తిరగకండని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానికంగా బాలాజీ ఫంక్షన్‌హాలులో గురువారం మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. భయంకరమైన కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్షి్మతో కలిసి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆమె వెంట ఎంపీపీ భిక్షపతి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పుట్టి యాదగిరి, సరాపు యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, సుందర్‌సింగ్, దేమె యాదగిరి పాల్గొన్నారు. (కరోనా వైరస్ ; నటుడిపై దాడి )
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజాంపేట(మెదక్): ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని గురువారం నిజాంపేటలో నిత్యావసర సరుకులు పంపీణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవెందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, తన స్నేహితుల ఆర్థిక సహాయంతో మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆటో కార్మికులకు, పారిశుధ్య కారి్మకులకు నిత్యావసర సరుకులను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుందని, దీన్ని నిర్మూలించాలంటే ప్రతీ ఒక్కరు ఇంటిలో ఉంటూ బయటకు రాకుండా ఉండడమే సరైన మార్గమని తెలిపారు.
(మంచి వార్త తెలిసింది : ట్రంప్ )
కొనుగోలు కేంద్రాన్ని సది్వనియోగం చేసుకోండి
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందన్నారు. (కరోనా: మరో 5 పాజిటివ్‌లు)
విరాళాల వెల్లువ
రామాయంపేట(మెదక్): లాక్‌డౌన్ దరిమిలా పేదలను ఆదుకోవడానికి వ్యాపారులు, ఎన్‌ఆర్‌ఐ ముందుకువచ్చారు. ఇందులో భాగంగా గురువారం రామాయంపేటకు వచి్చన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డికి 1987 బ్యాచ్‌కు చెందిన పదోతరగతి పూర్వ విద్యార్థులు రూ. 30 వేల నగదును అందజేశారు. వీరితోపాటు కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ రవీందర్‌రెడ్డి రూ. రెండు లక్షలు, వ్యాపారులు మంచికట్ల శ్రీనివాస్ రూ.లక్ష, పల్లెర్ల అశోక్ రూ. 75 వేలు, మురికి రవీందర్ రూ. 71వేలు, పుట్నాల రాములు రూ. 50వేలు, సరాపు శిల్ప ప్రవీణ్, తోటరాజు, కొత్త శ్రీనివాస్, మద్దెల రమేశ్ రూ. 25 వేల చొప్పున సీబీఆర్ రూ. 15వేలు, మెట్టు యాదగిరి రూ. 12 వేలు, బట్టల వర్తక సంఘం ప్రతినిధులు, వెంకటేశ్వర్‌రావు, మాసులరామరాజు, అభిరుచి హోటల్, గజం యాదగిరి, మాసుల రామరాజు, సహాయం అందజేశారు. విరాళాలు అందజేసినవారిని ఎమ్మెల్యే ప్రశంసించారు. (కరీంనగర్‌లో కరోనా కేసులు ఇలా...)
Comments
Please login to add a commentAdd a comment