‘ఐ లవ్ హైదరాబాద్’ : రేష్మా రాథోడ్ | reshma rathore shares her feeling on hyderabad | Sakshi
Sakshi News home page

‘ఐ లవ్ హైదరాబాద్’ : రేష్మా రాథోడ్

Published Sun, Nov 2 2014 11:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

‘ఐ లవ్ హైదరాబాద్’ : రేష్మా రాథోడ్ - Sakshi

‘ఐ లవ్ హైదరాబాద్’ : రేష్మా రాథోడ్

ఏడో తరగతిలో హైదరాబాద్‌కు విహారిగా వచ్చింది. సిటీలోని ప్లేస్‌లన్నీ చుట్టేసి రిటర్న్ అయింది. కట్ చేస్తే.. ఐదేళ్ల కిందట మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఈసారి విహారిగా కాక తారకలా వచ్చి వెండితెరపై తళుక్కుమంది. ‘ఈ రోజుల్లో’ అందంతో అంతకుమించిన అభినయంతో అందరి మన్ననలు అందుకుంటోంది హీరోయిన్ రేష్మా రాథోడ్. సిటీలో చక్కర్లు కొట్టకున్నా.. ఇక్కడి షూటింగ్ స్పాట్స్ చూసి సిటీపై మనసైందని చెబుతోంది. మస్తీ షహర్‌తో ఐదేళ్లుగా ఉన్న అనుబంధాన్ని ‘ఐ లవ్ హైదరాబాద్’ అంటూ ‘సిటీప్లస్’తో పంచుకుంది.
 
మాది ఖమ్మం. నేను లా చదువుకున్నాను. మూవీస్ కెరీర్‌కి ముందు మోడలింగ్ కూడా చేశాను. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. భరతనాట్యం అంటే ఆసక్తి. అలా డ్యాన్సింగ్ నుంచి మోడలింగ్‌కు వెళ్లాను. తర్వాత యాడ్స్‌లో నటించాను. నా ఫొటోలు చూసిన డెరైక్టర్ మారుతి ‘ఈ రోజుల్లో’ సినిమాలో చాన్స్ ఇచ్చారు. అప్పుడే హైదరాబాద్‌కు వచ్చాను. అందుకే హైదరాబాద్ అనగానే నాకు షూటింగ్ గుర్తొస్తుంది. నాకు రంగుల ప్రపంచాన్ని పరిచయం చేసిన ఈ సిటీ అంటే నాకు చాలా ఇష్టం.
 
అదే తొలిసారి..
నేను ఏడో తరగతిలో ఉండగా విహారయాత్ర కోసం మొదటిసారిగా హైదరాబాద్ వచ్చాను. చార్మినార్, గోల్కొండ ఇలా సిటీలోని అన్ని ఫేమస్ స్పాట్స్ చూశాను. అప్పుడు ట్యాంక్‌బండ్‌పై ఫ్రెండ్స్‌తో కలసి చేసిన ఎంజాయ్‌మెంట్ ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. షూటింగ్స్ కోసం తప్ప సిటీలో బయట తిరిగింది తక్కువే. ఎక్స్‌కర్షన్ కోసం వచ్చినప్పుడే ఎక్కువ తిరిగానేమో. ఇప్పుడు షూటింగ్‌తోనే టైం అయిపోతుంది. షార్ట్ బ్రేక్స్‌లో చుట్టూ ఉన్న నేచర్‌ని ఎంజాయ్ చేస్తుంటాను. ఎక్కువగా ఇంట్లో ఉండటానికే ఇష్టపడతాను.
 
అప్పుడే తెలిసింది..
ఈ రోజుల్లో సినిమా మొత్తం హైదరాబాద్‌లోని డిఫరెంట్ లొకేషన్స్‌లో తీశారు. అప్పుడే సిటీని దగ్గరగా చూశా. బొటానికల్ గార్డెన్, ఔటర్ రింగ్ రోడ్డు ఇలా షూటింగ్ అంతా ఇక్కడిక్కడే జరిగింది. సిటీ గురించి ఇక్కడ ఉన్నవాళ్ల కన్నా.. వేరే వాళ్లు చె బుతున్నప్పుడు బాగా అనిపిస్తుంది. బయట నుంచి వచ్చిన హీరోయిన్స్ హైదరాబాద్ కల్చర్ బాగుంటుంది, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారని చెబుతుంటారు. అది నూటికి నూరుపాళ్లు నిజం. అందుకే ఇక్కడి నుంచి షిప్ట్ అవ్వాలనే ఆలోచన లేదు. ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. వెల్ డెవలప్డ్ సిటీ. ఈ రేంజ్‌లో ఇంకో సిటీ డెవలప్ కావాలంటే కష్టమే.
 
రెయిన్ రెయిన్‌బో..

ఔటర్‌రింగ్ రోడ్ మీద ఒక స్వీట్ మెమరీ ఎప్పటికీ మరిచిపోలేను. ఈ రోజుల్లో షూటింగ్ జరుగుతోంది. సన్నగా వర్షం కురుస్తోంది. ఆకాశంలో పెద్ద రెయిన్ బో కనిపించింది. ఎప్పుడు రెయిన్‌బో కనిపించిన బిల్డింగ్‌లు, చెట్లు ఉండటంతో మొత్తం చూసే అవకాశం ఉండదు. కానీ అప్పుడు ఫస్ట్‌టైం ఫుల్ రెయిన్ బో చూశాను. సీన్ అదిరిపోయేలా ఉండటంతో ఓ షాట్ షూట్ చేశారు. ఆ సినిమాలో బైక్ సాంగ్‌లో ఆ సీన్ కనిపిస్తుంది.
 
లైట్స్ అండ్ క్రాకర్స్..
షాపింగ్ పెద్దగా చెయ్యను. ఇక్కడి రెస్టారెంట్స్‌లో ఓరీస్ అంటే చాలా ఇష్టం. పానీపూరి, పునుగులు అంటే ఇష్టం. ఐమాక్స్‌లో ఓసారి చాట్ తిన్నాను. ఆ టేస్ట్ ఎప్పటికీ మరచిపోలేను. ఆ స్ట్రీట్ కూడా భలేగా ఉంటుంది. ఐదారేళ్లకోసారి నా బర్త్‌డే దీపావళికి ముందు వెనుక రోజుల్లోనే వస్తుంది. అప్పుడు లైట్స్ అండ్ క్రాకర్స్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటా. ఇట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్. ఇక ఈ రోజు నా పుట్టిన రోజును షూటింగ్ స్పాట్‌లోనే చేసుకుంటున్నాను.
 
రేష్మా రాథోడ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement