
ఎస్ఎంఎస్ నుంచి సువాసనలు
ఏదైనా సందేశం, ఈమెయిల్ లేదా ఫేస్‌బుక్‌లో ఎవరైనా మీ పోస్ట్‌కు లైక్ కొట్టిన నోటిఫికేషన్ ఫోన్‌కు వచ్చినప్పుడు.. ఆ సందేశం తనతోపాటు మీకు నచ్చిన సువాసనలను తెస్తే ఎలాగుంటుంది? చిత్రంలోని ‘సెంట్’ అనే పరికరాన్ని మీ ఫోన్‌కు తగిలిస్తే.. మీకు వచ్చే సందేశాలు సువాసనలను వెదజల్లుతాయి.
ఈ పరికరంలో అమర్చే ఒక్కో క్యాట్రిడ్జ్ 100 సందేశాల వరకూ పనిచేస్తుంది. తర్వాత దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని జపాన్‌కు చెందిన సెంట్ అనే కంపెనీ తయారుచేసింది. మల్లెలు, గులాబీ, యాపిల్, కాఫీ, లావెండర్.. చివరికి కార్న్ సూప్ కూడా.. ఇలా పలు సువాసనలకు సంబంధించిన క్యాట్రిడ్జ్‌లను మనం ఎంచుకోవచ్చు. సందేశం వచ్చినప్పుడు.. ఆ పరికరం నుంచి సెంట్ స్ప్రే అవుతుందన్నమాట. పరికరం ధర రూ.2,100. క్యాట్రిడ్జ్ వెల రూ.300.