కిలో బియ్యం.. రూ. 2,200! | supplement..benifit: Body building good healthy | Sakshi
Sakshi News home page

కిలో బియ్యం.. రూ. 2,200!

Published Mon, Feb 23 2015 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

కిలో బియ్యం.. రూ. 2,200!

కిలో బియ్యం.. రూ. 2,200!

రూపాయికే కిలో బియ్యం సంగతి తెలుసు. కాని కిలో రూ.2,200కు దొరికే బియ్యం గురించి విన్నారా? పాతిక రూపాయలకు దొరికే కోలాల గురించి తెలుసు.. రూ.8 వేలు పలికే సాఫ్ట్ డ్రింక్ గురించి తెలుసా? పదో  ఇరవయ్యో పెడితే పొట్ట నింపేసే రొట్టెముక్కలు చూసే ఉంటారు. కానీ రూ.300 ఖర్చు చేయించే బ్రెడ్ గురించి విన్నారా? పర్స్ వీకైనా.. స్ట్రాంగ్ బాడీ కావాలనుకునే నగరవాసులు.. డైట్ సప్లిమెంట్స్‌కు ‘రైట్ రైట్’ అంటున్నారు. దీంతో ఒకప్పుడు బాడీబిల్డర్‌లను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న ఈ ఉత్పత్తులు ఇప్పుడు సిటీలో ఫిట్‌నెస్ ఫీవర్‌ని, ‘ప్యాక్’ ఇష్టులనూ టార్గెట్ చేస్తున్నాయి.
- ఎస్.సత్యబాబు

 వ్యక్తి బాడీ వెయిట్‌లో ప్రతి కిలోకూ అవసరమైన 1.2 కి.గ్రాల ప్రొటీన్ రెగ్యులర్ ఫుడ్ ద్వారా అందకపోతే, దేహానికి అత్యంత అవసరమైన  ఒమెగా 2, ఒమెగా 6 ఫ్యాట్స్ ఆహారం ద్వారా లభించకపోతే.. ఉదయపు ఎండ అందించే డి విటమిన్  సరిపడా దక్కకపోతే... సప్లిమెంట్ తప్పదు. విటమిన్లు, పోషక లోపాలను వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్స్‌తో భర్తీ చేసుకోవడం  సహజమైన విషయమే. అయితే షేప్ కోసం సప్లిమెంట్స్ అనేది  లేటెస్ట్ ట్రెండ్.

 సప్లిమెంట్.. గిఫ్ట్ ‘ప్యాక్’
 సిక్స్‌ప్యాక్ కోరుకున్నవాళ్లు తినే అన్నం, తాగే నీళ్లు సైతం నియంత్రించుకుంటున్నారు. దీంతో పోషక లోపాల భర్తీకి
 సప్లిమెంట్స్ తప్పడం లేదు. సాధారణ రీతిలో అయితే దాదాపు 6 నెలలు పట్టే శారీరక సామర్థ్యాన్ని వారంలోనే సంతరించుకోవడానికి వీటిపై ఆధారపడుతున్నారు. వ్యక్తికి 50 గ్రాముల ప్రొటీన్ సమకూరాలంటే కనీసం 200-300 కి.గ్రా. బాయిల్డ్ చికెన్ తినాలి. దీని కన్నా సప్లిమెంట్స్ వాడకమే తేలికని ‘ప్యాక్’ ప్రియులు భావిస్తున్నారు. ఇవి చాక్‌లెట్, స్ట్రాబెర్రీ, వె నీలా తదితర ఫ్లేవర్స్‌తో రుచికరంగా దొరుకుతున్నాయి కూడా. సాధనానంతరం ప్యాక్-పోషణలో కూడా సప్లిమెంట్స్ అవసరమే.

 మితిమీరితే...అనర్థాలే...
 ఈ ఆహార ప్రత్యామ్నాయాలు శరవేగంగా శక్తిని అందించినా, అలవాటైతే వదలడం అంత తేలికకాదని వైద్యులు అంటున్నారు. పరిమితికి మించిన వినియోగం హార్మోన్ల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. కొవ్వును కరిగించే ఫ్యాట్ బర్నర్స్‌ను అధిక మోతాదులో వాడడం ప్రమాదకరం. వైద్య, నిపుణుల  పర్యవేక్షణలో, ఉత్పత్తుల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పరిమిత స్థాయిలో వినియోగించాలని సూచిస్తున్నారు.

 కాస్ట్‌లీ ‘ప్యాక్స్’...
 ఆస్ట్రేలియాకు చెందిన ఎక్స్‌క్లూజివ్ ప్రొటీన్ రైస్ క్వినోరైస్ కిలో రూ.1800. అదే ఆర్గానిక్ అయితే రూ.2200. రోజుకి 100 గ్రాములు సరిపోతుందట. ఓట్స్‌లా ఉండే పుష్‌కుష్ కిలో రూ.600 పలుకుతోంది. 20 రోజులు సరిపోయే ప్యూర్ ప్రొటీన్ టిన్ ఒక్కోటి రూ.8000 దాకా, హోల్ గ్రెయిన్స్ బ్రౌన్ బ్రెడ్ రూ.300 ధరల్లో లభిస్తున్నాయి. కూల్‌డ్రింక్‌లా అనిపించే ప్రీ-వర్కవుట్ డ్రింక్ నైట్రిక్ ఆక్సైడ్ టిన్ రూ.4,000. పౌడర్ రూపంలోని క్రియేటిన్ ఎనర్జీ లెవల్స్‌ని శరవేగంగా పెంచుతుంది. ఇవేకాక మాస్ గెయినర్స్, వెయిట్ గెయినర్స్ కూడా
లభిస్తున్నాయి. కొన్ని మాల్స్, బేకరీల్లో వెల్‌నెస్ స్టోర్స్‌లలోనే ఈ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. జిమ్‌లు, ఫిట్‌నెస్ స్టూడియోస్, స్పాలకు సప్లయర్లే సరఫరా చేస్తుంటే, బంజారాహిల్స్, పంజగుట్ట, అబిడ్స్ ప్రాంతాల్లో ప్రత్యేక స్టోర్స్ వెలిశాయి.  వీ షేప్, సిక్స్‌ప్యాక్ వంటి ప్రత్యేక లక్ష్యాలతో హెవీ వర్కవుట్స్ చేసేవారికి ఇవి అవసరమవుతాయంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్ వెంకట్. వీటి వాడకానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరని చెబుతున్నారు.

 ప్రొటీన్ రొటీన్ ఇదీ...
 హెవీ ఎక్సర్‌సైజ్‌లకు ఆహారం ద్వారా లభించే న్యూట్రిషన్స్ సరిపోవు కాబట్టి సప్లిమెంట్స్ భాగం చేశా. మార్నింగ్ ప్రీ వర్కవుట్ డ్రింక్, వర్కవుట్ తర్వాత 2 స్కూప్స్ ప్రొటీన్ 200 మి.లీ నీటితో తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్‌గా ఎగ్‌వైట్స్, 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, లంచ్‌గా 100 గ్రా.చికెన్, క్వినో రైస్, రెండుగంటలు ఆగి ఒక ప్రొటీన్ స్కూప్, లైమ్‌జ్యూస్‌తో తీసుకుంటాను. గ్రిల్డ్ ఫిష్‌తో డిన్నర్ పూర్తి చేసి, 1 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్, నిద్రపోయే ముందు తిరిగి 1స్కూప్ ప్రొటీన్. ఇది నా రెగ్యులర్ డైట్ విత్ సప్లిమెంట్స్.
 - రఘు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement