జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి
జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి
తెలంగాణ ఏర్పాటులో రాజ్యాంగ విధులను నిర్భయంగా నిర్వర్తించిన న్యాయమూర్తుల పాత్ర ఎంతో ఉంది. అలాంటి న్యాయమూర్తులు కింది నుండి పైవర కు ఎందరో ఉన్నారు. అయితే వారందరిలోకీ ఒకే ఒక్కడు... న్యాయమూర్తి నరసింహారెడ్డి. ఆయనను చూస్తే ఎమర్జెన్సీ కాలం నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి హెచ్‌ఆర్ ఖన్నా గుర్తుకొస్తారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంతో మంది పాత్ర ఉం ది. అమ రవీరులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, కార్మి కులు, కవులు, కళాకారులు, న్యాయవాదులు ఇలా ఎం దరో... వారిలో న్యాయమూర్తులూ ఉన్నారు. అయితే అందరికీ కేంద్ర బిందువు మాత్రం కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావే! ఆయన నేతృత్వంలో తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డా తెలంగాణ ప్రజలంతా సొంత రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషంతో ఉన్నారా? అంటే.. అవుననే సమాధానంతో పాటూ, కాదు అని కూడా వినిపిస్తుంది. ఆ గొంతు తెలంగాణ న్యాయవాదులది, న్యాయమూర్తులది. వాళ్లింకా సొంత రాష్ట్రంలో ఉన్న అనుభూతిని పొందడంలేదు. ఆ పరిస్థితిని అధిగమిం చడానికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం కృషి చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతికూల శక్తుల బలం ఇంకా ఎక్కువ గానే ఉంది. ఏదిఏమైనా తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పాత్ర అమోఘమైనది. అలా అని న్యాయమూర్తుల పాత్రను విస్మరిస్తే తెలంగాణ చరి త్రకే ద్రోహం చేసినవాళ్లం అవుతాం. తెలంగాణకు చెందిన ప్రతి న్యాయమూర్తి రాజ్యాంగానికి లోబడి ఉద్యమానికి తోడ్పడ్డారు. అయితే న్యాయవాదులు మాట్లాడగలరు, న్యాయమూర్తులు అలా మాట్లాడరు. వారు తమ తీర్పులు, ఉత్తర్వుల ద్వారానే మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమం రాజ్యాంగబద్ధం కాబట్టి వారు దాన్ని తమ తీర్పులతో, ఉత్తర్వులతో సమర్థించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో న్యాయమూర్తుల పాత్ర పైకి కనిపించేది కాదు. కనిపించినా చాలా మంది గుర్తించరు. గుర్తించినా ఆ గుర్తింపును న్యాయమూ ర్తులు ఇష్టపడరు. అలా కృషి చేసిన న్యాయమూర్తులు ఎందరో! అయితే అందులో అగ్రభాగాన ఉండే వ్యక్తి మాత్రం ఒకే ఒక్కడు. ఆయనే కేంద్ర బిందువు. ఆయనే ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి, కాబోయే పట్నా హైకోర్టు ప్రధాన నాయమూర్తి లింగాల నరసింహారెడ్డి. తెలంగాణ ఉద్యమ కీలక ఘట్టాల్లో, మాట్లాడాల్సిన సమయంలో ఆయన దృఢంగా తన తీర్పులు, ఉత్తర్వు లతో మాట్లాడారు. ప్రతికూల పరిస్థితుల్లో అలా నిలబ డటం తేలికేం కాదు. ఆ విషయంలో ఆయనను చూస్తే ఎమర్జెన్సీ కాలంలో అలాగే వ్యవహరించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి హెచ్‌ఆర్ ఖన్నా గుర్తుకొస్తారు. జస్టిస్ ఖన్నా ఏడీఎం జబల్‌పూర్ కేసులో వెలువరిం చిన తీర్పు కంటే, నరసింహారెడ్డి శ్రీకృష్ణ కమిషన్ ఎని మిదవ అధ్యాయంపై ఇచ్చిన తీర్పు గొప్పదనిపిస్తుం ది. ఆ ఉద్యమ కాలం నాటి ఆయన తీర్పులు, ఉత్తర్వు లను ప్రజాస్వామ్యవాదులు ఎప్పటికీ మరచిపోరు. దేశ న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోతాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ ‘‘డిసెంబర్ 9’’ ప్రకటన వెలువడిన తదుపరి తెలంగా ణలోని విద్యాసంస్థలన్నిటినీ మూసివేయాలని ప్రకటిం చి నాటి పోలీస్ కమిషనర్ తన అధికార పరిధిని అతి క్రమిస్తున్నారంటూ జస్టిస్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అవి తెలంగాణ ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు గొప్ప ఉపశమనాన్ని కలిగించాయి. విద్యా ర్థుల మర్యాదకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవ ర్తించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ప్రతికూల పరిస్థితులకు తలవొంచక నిటారుగా నిలవడం నరసింహారెడ్డి లాంటి వారికే తప్ప అందరికీ సాధ్యం కాదు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో అత్యంత దురదృ ష్టకరమైనది శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదవ అధ్యాయం. మీడియాను, రాజకీయ పక్షాలను భయ పెట్టి, ప్రలోభపెట్టి, బెదిరించి తెలంగాణ వ్యతిరేక అభి ప్రాయాన్ని తీసుకురావాలని అందులో పేర్కొన్నారు. 17 జిల్లాల పోలీసు అధికారులతో కలసి రూపొందిం చిన అధ్యాయమది. దాన్ని అఖిలపక్షానికి సైతం అంద జేయక గోప్యంగా ఉంచారు. జస్టిస్ నరసింహారెడ్డి దాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించి అది బహిర్గత మయ్యేలా చేశారు. తద్వారా దేశవ్యాప్త చర్చను లేవదీ శారు. అప్రజాస్వామిక సూచనలు, పత్రికా స్వేచ్ఛను అంతం చేసే అవకాశాలున్నాయని, వివక్షతో కూడుకు న్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ను మామూలు వ్యవహారంగా తీసుకోవడాన్ని తన తీర్పులో నిరసించారు. ఆ సందర్భంగా వివిధ రాజ కీయ పక్షాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నా, ధైర్యం గా ఆయన తన రాజ్యాంగ నిబద్ధతను కొనసాగిం చారు. ఆ ఎనిమిదవ అధ్యాయం బహిర్గతం కావడం వల్లనే తెలంగాణ వ్యతిరేకుల కుట్రలు బహిర్గతమ య్యాయి. తెలంగాణ కాంక్ష మరింత బలపడింది. అది సెప్టెంబర్ 2011 సకల జనుల సమ్మెగా మారింది. ఆ తర్వాత పలు మలుపులతో తెలంగాణ రాష్ట్రం సాకార మైంది. రహస్య అధ్యాయం బహిర్గతం కాకుంటే ఇంత త్వరగా తెలంగాణ ఏర్పడేదా? అంటే సమాధానం చెప్పడం కష్టమే. ‘డిసెంబర్ 9’’ తర్వాత తెలంగాణ లోని పరిస్థితులు ఎమర్జెన్సీ రోజుల్లాగే ఉన్నాయి. అప్పుడు న్యాయబద్ధంగా వ్యవహరించడం నేడు సామాన్యమైనదిగా కనిపించవచ్చు. కానీ అది ఆనాడు అసాధారణం. తెలంగాణ ఏర్పాటులో రాజ్యాంగ విధు లను నిర్భయంగా నిర్వర్తించిన న్యాయమూర్తుల పాత్ర ఎంతో ఉంది. అలాంటి న్యాయమూర్తులు కింది నుండి పై వరకు ఉన్నారు. అయితే వారందరిలోకీ ఒకే ఒక్క డు... న్యాయమూర్తి నరసింహారెడ్డి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలను స్వీకరిం చనున్నందున జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిని సముచిత రీతిలో సన్మానించడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. ఆయనను సన్మానించడమంటే రాజ్యాంగాన్ని, తెలం గాణ ప్రజలను సన్మానించడమే. కాబట్టి జస్టిస్ నరసిం హారెడ్డి అందుకు సమ్మతించాలి. ఇది... న్యాయమూ ర్తిగా ఆయన మరిన్ని సమున్నత శిఖరాలు అధిరోహిం చాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలు, ప్రజాస్వా మిక వాదులందరి ఆకాంక్ష.
అనురాగ్ జింబో, (వ్యాసకర్త కవి, రచయిత), మొబైల్: 001-7324212369