
వాటే చాన్స్!
అదృష్టమంటే కుర్ర హీరో వరుణ్‌ధావన్‌దే అనుకుంటున్నారు బీ-టౌన్ ప్రజలు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది రోజులకే ఒకే సినిమాలో నలుగురు భామలతో రొమాన్స్ చేసే సూపర్ చాన్స్ కొట్టేశాడనేది వారి బాధ.
అదృష్టమంటే కుర్ర హీరో వరుణ్‌ధావన్‌దే అనుకుంటున్నారు బీ-టౌన్ ప్రజలు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్ది రోజులకే ఒకే సినిమాలో నలుగురు భామలతో రొమాన్స్ చేసే సూపర్ చాన్స్ కొట్టేశాడనేది వారి బాధ. అదీ హాట్ గాళ్స్ యామీ గౌతమ్, హుమా ఖురేషి, దివ్యాదత్తా, రాధికా ఆప్టేలతో. సీన్లు కూడా కెమిస్ట్రీ తెగ వర్కవుటయ్యి, ఎంతో సహజంగా వచ్చాయనేది టాక్! సినిమా పేరు ‘బదలాపూర్’.
ఇందులో మనోడైతే బాగా వయెలెంట్‌గా కనిపిస్తూ బరువైన పాత్రలో జీవిస్తున్నాడట. అదే సమయంలో అంతే సహజంగా శృంగార సన్నివేశాలనూ పండిస్తున్నాడట! మొత్తానికి ఈ లవర్‌బాయ్ సినిమా రిలీజ్‌కు ముందే అటు బాలీవుడ్‌లో, ఇటు అభిమానుల్లో మాంచి క్రేజ్ సంపాదించేసుకున్నాడు!