వుడ్ ఎక్స్‌ప్రెషన్ | Wood Expression | Sakshi
Sakshi News home page

వుడ్ ఎక్స్‌ప్రెషన్

Published Thu, Feb 19 2015 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

వుడ్ ఎక్స్‌ప్రెషన్

వుడ్ ఎక్స్‌ప్రెషన్

చెక్కముక్కలే కాన్వాస్‌గా... ఉలే కుంచెగా అద్భుత కళారూపాలకు ప్రాణం పోశారు కళాకారులు. అమీర్‌పేట ‘ది ఆర్ట్ స్పేస్’లో గురువారం ప్రారంభమైన ‘వుడ్ కట్ ఆర్ట్ క్యాంప్’లో బహుచక్కని చిత్రాలు ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పద్నాలుగు మంది వుడెన్ ఆర్ట్ కళాకారులంతా ఒక చోట చేరి నిర్వహించే ఈ వారం రోజుల వర్క్‌షాపులో మరెన్నో కళాకృతులు జీవం పోసుకుంటున్నాయి.  
 
మనసులోని ఊహా చిత్రాన్ని ఒక చెక్క పలక పై ప్రతిబింబింపజేయడమే వుడ్‌కట్ ఆర్ట్. కంబ కర్ర అనే ఒక విధమైన కలపను ఇందుకు ఉపయోగిస్తారు. మనసులో ఆలోచనకు చెక్కపై తగిన  విధంగా రూపురేఖలు గీసి, ఆ తర్వాత దశల వారీగా పూర్తి చిత్రంగా రూపొందిస్తారు. ఈ దశల్లో ఒకసారి తప్పు జరిగినా మొత్తం చెక్క వేస్టవుతుంది. అందుకే ఒక్కోసారి ఒక కళారూపాన్ని తయారు చేయడానికే నెలలు పడుతుంది. బైబిల్‌ను ముద్రించేందుకు తొలుత వుడ్ కట్ ఆర్ట్‌ను ఉపయోగించిన ట్టు చెబుతారు. కానీ, ఈ విద్యను ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం జపనీయులే అంటారు ప్రముఖ వుడ్ కట్ ఆర్టిస్ట్, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ టి.సుధాకర్‌రెడ్డి. 40 ఏళ్లుగా ఆయన ఈ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

వర్సిటీలో వందల మందికి నేర్పించారు. ‘చెక్కపై భావోద్వేగాలను ప్రస్ఫుటం చేయడమే వుడ్ కట్ ఆర్ట్. దీన్నే ఎక్స్‌ప్రెషనిజం అంటాం. 18వ శతాబ్దంలో పేపర్ ప్రింటింగ్ వేగవంతం అయ్యాక అక్షరాలను ముద్రించేందుకు వుడ్ కట్ బ్లాక్స్‌ను వాడారు. దేశ ంలో 1970 వరకూ ఈ విధానం ఉండేది. జర్మన్లు చిన్న చిన్న సంకేతాలను చూపడం కోసం వుడ్ కట్‌ను ఉపయోగించారు. నేటికీ వాడుతున్నారు. భారత్‌లో మళ్లీ ఇప్పుడిప్పుడే ఈ కళపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. అందరికంటే తెలుగు వారికే దీనిపై మక్కువ ఎక్కువ’ అని చెప్పారు వర్క్‌షాప్ నిర్వాహకులు, ఆర్టిస్ట్ భార్గవి గుండుల. సిటీలో నిర్వహించడం ఇదే తొలిసారన్నారు.
- ఎస్.శ్రావణ్‌జయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement