ప్రేమను ఆపేదెవరు | Youth directors to make film as Short film | Sakshi
Sakshi News home page

ప్రేమను ఆపేదెవరు

Published Mon, Aug 11 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

ప్రేమను ఆపేదెవరు

ప్రేమను ఆపేదెవరు

లవ్... మ్యారేజ్...   వీటిమీద ఎవరి ఒపీనియన్ వారిది...
 ముఖ్యంగా యూత్...
 లవ్ వేరు మ్యారేజీ వేరు అనుకుంటారు...
 లైఫ్ అంటే ఎంజాయ్‌మెంట్‌గా
 ఫీలవుతారు...
 అన్ని కథల్లాగే ఇందులోనూ..
 ఒక హీరో ఒక హీరోయిన్
 ఇద్దరూ ప్రేమ పెళ్లి గురించి
 చర్చించుకుంటుంటారు...
 హీరోయిన్ ప్రేమ నుంచి పెళ్లి జరగాలి అంటుంది.
 హీరో మాత్రం పెళ్లి వేరు ప్రేమ వేరు అంటాడు.
 ఈ రెంటినీ అనుసంధానం చేసి చూపాడు కరీంనగర్‌కి చెందిన వి.శ్రీకాంత్. బీటెక్ పూర్తి చేసి సినిమాలకి  అసోసియేట్ రైటర్‌గా, అసోసియేట్ డెరైక్టర్‌గా  ప్రయత్నిస్తున్నాడు.
 
డెరైక్టర్స్ వాయిస్:

 ఈ షార్ట్ ఫిల్మ్‌ని చాలామంది సినిమావాళ్లు చూసి మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరో శర్వానంద్, రైటర్ సత్యానంద్ ఫోన్‌చేసి నన్ను అభినందించారు. ప్రేమ కోసం అందరినీ వదులుకోవడం స్వార్థం అవుతుంది. పేరెంట్స్ కోసం ప్రేమను వదులుకోవటంలో త్యాగం ఉంది. ప్రేమించిన అమ్మాయిని జీవితాంతం ప్రేమించడంలోనే ఆనందం ఉంది.
 
 నిజమైన ప్రేమకి ప్రేయసి అవసరం లేదు. పెళ్లి అంతకన్నా అవసరం లేదు. లవ్ ఫెయిల్యూర్ అంటే విడిపోవడం కాదు. పెళ్లి చేసుకోవడం అని చెప్పడం ఈ లఘుచిత్రం ఉద్దేశం. ఈ థియరీ నిజ జీవితంలో పనికిరాదు. కనీసం సినిమాగా అయినా పనికొస్తుందని ఈ షార్ట్ ఫిల్మ్ తీశా. కొందరు పిచ్చి కాన్సెప్ట్ అని, చాలా మంది గొప్ప కాన్సెప్ట్ అని అన్నారు. డైలాగ్స్‌కి మంచి పేరు వచ్చింది. సినివూవాళ్లు, బయుటివాళ్లు సోషల్ వెబ్‌సైట్స్‌లో కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటే... మనం కూడా పనికొస్తావుని నమ్మకం కలుగుతోంది. కొత్తవాళ్లతో మంచి లవ్‌స్టోరీతో ఫీచర్ ఫిల్మ్ ప్లాన్‌లో ఉన్నా. రైటర్‌గా మార్క్ టై్వన్, రంగనాయకమ్మ స్ఫూర్తి.
 - డా. వైజయంతి
 
 అంకితం
తన ప్రేయసి కోసం ప్రేమను, ప్రాణాన్ని త్యాగం చేసిన ఓ యువకుడి  ప్రేమకథే అంకితం. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రైటర్ హేమంత్ శ్మశానంలో కూర్చుని స్క్రిప్ట్ పనుల్లో ఉంటాడు. ఓ యువ ప్రేమికుడు ఫణి అక్కడికి వస్తాడు. తన ప్రేమకథను రైటర్‌కు వివరిస్తాడు. చిన్ననాటి స్నేహితురాలు అంజలిని ప్రేమించిన ఫణి.. ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని చూసి తన ప్రేమను తనలోనే దాచుకుంటాడు. ఇంతలో ఓ ప్రమాదంలో ఫణి ప్రాణాలు కోల్పోతాడు. ఆత్మగా మారిన ఫణి శ్మశానంలో తిరుగుతుంటాడు. నా జీవితం అంజలికే అంకితం అని రైటర్‌తో చెప్పడంతో కథ ముగుస్తుంది. హేమంత్ డెరైక్ట్ చేసిన ఈ మూవీలో దీపక్, స్వాతి, ఫణి పాత్రలు పోషించారు.
 
 ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’  పాఠకులకు పరిచయుం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com
 
 నా గురించి: వీకే
 మాది వైజాగ్. సీనియర్ ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్. ఇండియాలో విప్రో, సత్యం కంపెనీల్లో పనిచేశాను. టెక్సాస్ తెలుగు రేడియోలో, ఆర్‌జేగా కూడా చేస్తుంటాను. వెబ్‌సైట్ పెట్టి వన్ ఇయర్ అవుతోంది. 8 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నా. ఇండియాతో కనెక్షన్ ఉండాలంటే ఇలా ఏదో ఒకటి చేస్తుండాలి. షార్ట్‌ఫిలింస్ మీద బుక్ రాస్తున్నాను. త్వరలో అది మార్కెట్లోకి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement