తొణకరు... బెణకరు! | Astrophanda | Sakshi
Sakshi News home page

తొణకరు... బెణకరు!

Published Sun, Aug 9 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

తొణకరు... బెణకరు!

తొణకరు... బెణకరు!

ఆస్ట్రోఫన్‌డా : కుంభంరాశి
రాశిచక్రంలో పదకొండో రాశి కుంభం. ఇది బేసి రాశి. వాయుతత్వం, వైశ్య జాతి, క్రూర రాశి, కృష్ణ వర్ణం. తొడలు, కన్ను, శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థలను సూచిస్తుంది. స్థిర రాశి, పురుష రాశి. దిశ దక్షిణం. ఇందులో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్తిగా, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలుంటాయి. అధిపతి శని. శంఖం, గవ్వలు, బొగ్గు, మినుములు, ఇనుము, నువ్వులు, పట్టు మొదలైన ద్రవ్యాలను సూచి స్తుంది. అబిసీనియా, స్వీడన్, సూడాన్ తది తర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది.
 
కుంభరాశిలో పుట్టినవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొణకరు. సంప్రదాయాలకు విలువనిస్తూనే, ఆధునికతను స్వాగతించే విశాల దృక్పథం వీరిది. మానవతా దృక్ప థంతో వ్యవహరిస్తారు. ఆత్మసాక్షి మేరకు నడుచు కుంటారు. క్రియాశీలత, స్వేచ్ఛాకాంక్ష, నిష్పాక్షికత వీరి సహజ లక్షణాలు. న్యాయం విషయంలో తనపర భేదాలు పాటించకపోవడం వల్ల అయినవారి నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే సందర్భాలూ ఉంటాయి. గొప్ప జిజ్ఞాసులు, చింతనా పరులు. శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి ఎక్కువ. తెలివితేటలు, విశ్లేషణాత్మక శక్తి, సున్నితత్వం, ఔదార్యం వంటి లక్షణాలు వీరికి గుర్తింపు తెచ్చిపెడతాయి. ఎట్టి పరిస్థితు ల్లోనూ తమ అభిప్రాయాలను మార్చుకోవ డానికి ఇష్టపడరు. సహనం ఎక్కువే అయినా, సహనం నశిస్తే కోపతాపాలను తారస్థాయిలో ప్రదర్శిస్తారు. ఏకాంతాన్ని కోరుకుంటారు. స్వేచ్ఛకు భంగం కలిగే పరిస్థితులలో ఇమడ లేరు. ఆధ్యాత్మిక చింతన, మార్మిక విద్యలపై ఆసక్తి ఎక్కువ. శాస్త్ర, కళా రంగాలలో అద్భు తాలను సాధించగలరు. గ్రహగతులు ప్రతి కూలిస్తే, స్వేచ్ఛాభిలాషతో అయినవారిని వదులుకునేందుకు సైతం సిద్ధపడతారు. వెటకారాన్ని తట్టుకోలేరు. చిన్న చిన్న కారణాలకే శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటారు. ఆందోళనను తట్టుకోలేక వ్యసనాలకు లోనవు తారు. రక్త పోటు, నాడి, గుండె, కంటి, జీర్ణకోశ సమస్యలతో బాధపడతారు.
- పన్యాల జగన్నాథ దాసు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement