Aquarius
-
కుంభ రాశి ఫలాలు 2022-23
ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే) శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు) పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (జన్మం)లోను తదుపరి మీనం (ద్వితీయం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (వ్యయం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలో సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (చతుర్థం) కేతువు వృశ్చికం (దశమం)లోను తదుపరి రాహువు మేషం (తృతీయం) కేతువు తుల (నవమం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (చతుర్థం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా చిత్ర విచిత్రమైన జీవనశైలితో కాలం నడుస్తుంది. గురువు అనుకూలంగా ఉన్న కారణంగా ధన కుటుంబ ఆరోగ్య విషయాల్లో వచ్చే సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆగస్టు నుంచి కుజస్తంభన దృష్ట్యా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. అలాగే తరచుగా అయిష్టమైన కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనవలసి రావడం, బంధువులతో కలహాలు ఉంటాయి. శని సంచారం అనుకూలంగా ఉన్నట్లే చెప్పాలి. మకర కుంభ సంచారాలలో ఈ రాశివారికి శని చెడు పెద్దస్థాయిలో ఉండదు. అయితే పనులు మందకొడిగా సాగడం, ముఖవర్చస్సు తగ్గడం, చెప్పుకోలేని బాధలు ఉన్న భావన కలుగుతాయి. భోజన వసతికి ఇబ్బంది రాగలదు. కుటుంబసభ్యులు బాగా సహకారంగా ఉన్నా, ఏదో తెలియని అవగాహన లోపంతో ముందుకు సాగుతారు. గతం కంటే ఈ సంవత్సరం బాగానే ఉన్నా, అసంతృప్తితో కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వనరులు బాగా సమకూరుతాయి. అదే రీతిగా ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. కావలసిన సమయానికి ఋణాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చుకోవడానికి మార్గం సుగమమవుతుంది. తరచుగా గురువులను పూజ్యులకు సందర్శించుకుంటారు. ఏలినాటి శని ప్రభావం చేత కార్మికుల సమస్య ఇబ్బందికరంగా ఉండి వ్యాపారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమ, చికాకు తప్పదు. సీజన్లకు తగిన రీతిగా స్పందించి వ్యాపారం చేయలేరు. ఉద్యోగులకు విచిత్రమైన సమస్యలు ఎదురవుతాయి. అధికారుల సహకారం లేకపోవడం, తోటివారి నుంచి సమస్యలు రావడం జరుగుతుంది. సుఖంగా పనులు సాగవు. ఆరోగ్యపరంగా బాగా జాగ్రత్తలు పాటించాలి. పెద్దగా యిబ్బందులు ఉండవు కానీ తరచుగా సమస్యలు ఎదురుకాగలవు. నరాలు, రక్త సంబంధ అనారోగ్యం ఉన్నవారు ఎక్కువ ఇబ్బందికి గుురవుతారు. ఆరోగ్యరీత్యా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా, శ్రమతో పనులు పూర్తవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి పనులు ఇబ్బందికరమే అయినా ఫలితం సానుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి ఖర్చు అధికంగా ఉన్నా, కార్యసాఫల్యం జరుగుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. ఊహాతీతంగా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్నా, చివరకు మంచి ఫలితాలు అందుతాయి. గర్భిణీ స్త్రీలు అనవసర విషయాలపై ఆలోచనలు విరమించుకోడం శ్రేయస్కరం. ధనిష్ఠ నక్షత్రం వారికి కుటుంబసభ్యుల సహకారం ఈ సంవత్సరం శ్రీరామరక్ష అనే చెప్పాలి. ఉద్యోగంలో మీరు కార్యనిర్వహణ చాలా వికృతంగా చేయడం. సమయపాలన లేకుండా ప్రవర్తించడం వంటివి చేస్తారు. అయితే ఏదో తెలియని అద్భుతశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. శతభిష నక్షత్రం వారికి విచిత్రమైన స్థితి వుంటుంది. తరచుగా అన్ని పనులూ మందగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంతా లాభదాయకం అనుకునే సందర్భంలో పనులు వెనక్కు మళ్లే అవకాశం వుంటుంది. పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవాలనుకుంటే, మీరు స్వయంగా శ్రమించాలి. పూర్వాభాద్ర నక్షత్రం వారికి విశేషమైన కాలమనే చెప్పాలి. పూర్తిగా స్వేచ్ఛగా జీవిస్తారు. భారంగా వుండే పనులు చేయకుండా సరళంగా వుండే పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటారు. శాంతి: శని రాహు కుజులకు జపం, దానం చేయించడం మంచిది. ప్రతిరోజూ ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం మంచిది. ఆరు ముఖముల రుద్రాక్షధారణ శ్రేయస్కరం. ఏప్రిల్: శనిగ్రహ శాంతి చేయించండి. వరుసగా మూడు మాసములు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని వ్యవహారాలూ మందకొడిగా నడుస్తాయి. అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు తప్పక ఉంటాయి. ప్రయాణాలు విరమించండి. మే: శని కుజుల కుంభరాశి సంచారం చాలా ఇబ్బందికరం. మూడవ వారంలో బాగా చికాకులు రాగలవు. ఆర్థిక వెసులుబాటు చికాకులు కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలను సరిచేయగలుగుతారు. ఋణ విషయాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బహు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేయవద్దు. జూన్: చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. ప్రత్యేక లాభములు ఉండవు. ప్రతి పనీ స్వయంగా చేసుకొని లబ్ధి పొందుతారు. ఆర్థిక వెసులుబాటు, ఋణ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. జూలై: శ్రద్ధతో ప్రవర్తించి కార్యజయం సాధిస్తారు. అంతటా విజయావకాశాలు ఉన్నాయి. కాలం వృథా చేయకుండా గత సమస్యల పరిష్కారం, భవిష్య ప్రణాళికలు, దీర్ఘకాలిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి. కుటుంబపరంగా కాలం అనుకూలం. ఆర్థిక, ఋణ విషయాలు బాగుంటాయి. ఆగస్టు: ఏలినాటి శని అర్ధాష్టమ కుజుడు షష్ఠ శుక్రుడు ప్రభావంగా మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అసౌకర్యం. అవగాహన లోపాలు ఎక్కువవుతాయి. ఉద్యోగ అంశాలు స్వయంగా చూసుకోండి. వ్యాపార విషయంలో మీకు తోటివారు, సిబ్బంది చికాకులు సృష్టిస్తారు. సెప్టెంబర్: పూర్తి అనుకూల వాతావరణం ఉండదు అలాగని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అనవసర విషయాలలో భయాందోళనలు ఎక్కువవుతాయి. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో వస్తువులు చోరీకి గురవుతాయి. విధి నిర్వహణలో జాగ్రత్తపడండి. అక్టోబర్: సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. 15వ తేదీ వరకు అన్ని పనులూ ఒత్తిడిగా ఉంటాయి. ప్రత్యేకంగా కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. రోజువారీ పనులతో కాలక్షేపం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలు, ఋణ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. పెద్దల ఆరోగ్య విషయం జాగ్రత్త. నవంబర్: చాలా విచిత్రమైన కాలం. క్రమంగా కార్యసానుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి. మాసారంభంలో శుక్రుడు, ద్వితీయార్ధంలో రవి అనుకూలిస్తారు. పనులు వాయిదా వేసే ఆలోచనలను విరమిస్తే విజయం మీతో ప్రయాణం చేస్తుంది. అన్ని విషయాల్లోనూ సహనంతో వ్యవహరిస్తారు. డిసెంబర్: ఒక కోణంలో మీరు ఈనెలలో అదృష్టవంతులనే చెప్పాలి. శ్రమతో కూడుకున్న పనులను ముందుగానే గుర్తించి, వాటి జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా చేయగలిగిన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెడతారు. అందరి సహకారం బాగుంటుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తారు. జనవరి: గురుబలం ఈ నెల విశేషం. ప్రయాణ విçఘ్నాలు ఉంటాయి. తరచుగా వస్తువులు పనులు మరచిపోయే అవకాశం ఉంది. 15వ తేదీ వరకు రవి అనుకూలత దృష్ట్యా వృత్తిలో సమస్యలను దాటవేయగలుగుతారు. మూడవవారం అన్నింటా చికాకులు ఉంటాయి. చివరి వారంలో శుక్ర సంచారం అనుకూలత వల్ల సమస్యలను దాటగలరు. ఫిబ్రవరి: రవి కుజ శని సంచారం బాగులేదు. ప్రధానంగా ఆదాయం ఒత్తిడిగా అందుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. తరచుగా దుర్వార్తలు వినవలసి వస్తుంది. బంధువుల అనారోగ్య వార్తలు మానసిక ఇబ్బందులకు గురి చేస్తాయి. పనులు బాగా ఆలస్యం అవుతాయి. మార్చి: ప్రతి పనిలో ఆలస్యం ఎదురైనా, సానుకూలంగా పూర్తవుతాయి. కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలం. ఖర్చులు నియంత్రించడం ద్వారా ఈ నెల అంతా సుఖంగా జీవనం సాగుతుంది. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితాలు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
శార్వరి నామ సంవత్సర (కుంభ రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. అందులో అబద్ధాలు ఉన్నాయని తెలిసినా డబ్బు సర్దుబాటు చేస్తారు. నమ్ముకున్న వ్యక్తులు, మీవాళ్లు అనుకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగపడరు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేస్తారు. ఆత్మీయవర్గం కూడా కొన్ని సందర్భాలలో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగినవారు, సమాజంలో ప్రఖ్యాతి కలిగిన వారు వారి వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు, మీ మాటలు, సలహాలు, ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి. నిత్యం ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రభుత్వ కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటివాళ్ళు మీకన్నా అధికంగా లాభం పొందుతారు. ఈ విషయం మిమ్మల్ని బాధించినా కొంతకాలం తరువాత మీకు కూడా అదే విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తెస్తారు. అనుభవం లేని రంగాలలో కొత్తవారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్ల జోలికిపోవద్దు. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలలో మీకు సహకరించిన వారి ఋణం తీర్చుకుంటారు. కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిజమైన మిత్రులు ఎవరో? కాని వారు ఎవరో? కంటికి స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటారు. గణాంకములలో మోసాలు చెల్లించిన ధనాన్ని చెల్లించలేదని, తీసుకోని ధనము తీసుకున్నారని మొదలైన నిందలు అసౌకర్యానికి గురిచేస్తాయి. నష్టము, బాధలు ఏ స్థాయిలో జరిగినా ఇలాంటివి అల్పమని గ్రహించండి. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయడం మరిచిపోకండి. దొంగతనాలకు అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అనుమానాస్పద భూములు, ఆర్థికలావాదేవీల జోలికి వెళ్ళవద్దు. గృహ సంబంధిత విషయాలకు అధిక ధనం వెచ్చిస్తారు. ఇరుగు పొరుగు వారితో పరుష సంభాషణలు, బేధాభిప్రాయాలు సంభవిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తయి, మంచి స్థితి సాధించినా సుఖపడటానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు. భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారడం బాధ కలిగిస్తుంది. నిష్కారణంగా నోరుజారి పరువు తీసుకొని బజారుకు ఎక్కే ఆత్మీయవర్గం మనోవేదనగా మారుతారు. మీ ఓర్పు, సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్లుగానే అందరికీ అర్థం అవుతుంది. సమస్యలు ఎదురైనా అభివృద్ధి సాధించడానికి శారీరకంగా, మానసికంగా అహోరాత్రులు శ్రమిస్తారు. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. బరువుబాధ్యతలు, శుభకార్యాలు పూర్తి చేయడానికి అధికంగా ధనం వెచ్చిస్తారు. స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి, మోసపోయే అవకాశం ఉంది. రాజకీయాలలో రాణిస్తారు. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. విందువినోదాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. కీలక సమాచారం లభిస్తుంది. అపురూపమైన ప్రదేశాలను కుటుంబసభ్యులతో కలిసి సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంధి. నాగబంధాన్ని ఉపయోగించండి. సమాజంలో పెద్దలుగా చలామణీ అవుతున్న వారి అంతరంగిక రహస్యాలు మీకు తెలుస్తాయి. దీక్షలు ఘనంగా పూర్తిచేస్తారు. మహత్తరమైన కార్యక్రమాలను శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నతస్థానాలలోని వారి సహకారం లేకుండా మీరు సాధించిన వాటికి మీ శక్తికొలది సహాయపడతారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాలను అందజేస్తారు. విదేశాల నుండి కూడా నిధులు పోగుచేసి వారికి సహాయం చేద్దామనుకున్న మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైంధవుడిలా అడ్డుపడతాడు. మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది. కళా, సాంస్కృతిక వ్యవహారాలలో, క్రీడలలో నూతన అవకాశాలు అందివస్తాయి. మీ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియటం వల్ల వివాదాలు, విమర్శలు చోటుచేసుకుంటాయి. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ అవసరము. వృత్తిఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు. మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది. ఇందుకు కారణాలు ఎంత వెతికినా మీకు కనిపించవు. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందన్న నిజాన్ని మీరు గ్రహిస్తారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు మీ చొరవ వల్ల ఒక కొలిక్కి వస్తాయి. గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవవత్సరం సానుకూలపడుతుంది. వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు ఋణాలు తీసుకుంటారు. నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎన్నుకున్న ప్రదేశాలను బట్టి లాభనష్టాలు ఉంటాయి. సమున్నతమైన శిఖరాలను అధిరోహించాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. మీరు శ్రమించిన ఒకానొక వ్యవహారం లాభిస్తుంది. ఇక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. లీజులకు సంబంధించిన విషయాలు, ఇసుక వ్యాపారము కొంత వివాదస్పదం అవుతాయి. ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం, రాజకీయ పలుకుబడి మిమ్ములను రక్షిస్తాయి. ప్రైవేటు వ్యక్తుల నుండి లోనులు తీసుకోవలసిన పరిస్థితి బహుశా రావచ్చు. వృత్తిఉద్యోగాలపట్ల అంకితభావంతో దివారాత్రులు శ్రమిస్తారు. అందరి మెప్పులను పొందగలుగుతారు. ప్రమోషన్ లభిస్తుంది. కానీ కొంతమంది కుహానా వ్యక్తులు మీ శ్రమ, అంకితభావం వెనుక స్వార్థప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేస్తారు. మీ వ్యక్తిత్వంలో, దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొంతకాలం బాధపెడతాయి. అరికాలి మంటలు, మోకాళ్ళనొప్పులు, ఇ.ఎన్.టి. ప్రాబ్లమ్స్ ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా కీళ్ళు, వెన్నెముక బాధలు ఉండవచ్చు. సోదరసోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థికసహాయం అందిస్తారు. వాళ్ళలో ఐకమత్యం లేకపోవడం వల్ల మీరు చేసిన సహాయం బయటపెడతారు. ఎంత కలిసి వచ్చినా డబ్బులు ఉన్నా సంఘంలో మంచి స్థాయి లభించినా దేనికీ లోటు లేని పరిస్థితి ఉన్నా ఏదో ఒక మానసిక అప్రశాంతత బాధిస్తుంది. గతించిపోయిన వ్యక్తి జ్ఞాపకాలు ఎంతగానో బాధిస్తాయి. మరుపు అంత తేలిక కాదని గ్రహిస్తారు. కాలానికి ఎదురీదడం మీ వల్ల కాదని గ్రహిస్తారు. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ బిజినెస్లోని వాళ్ళకి బాగుంది. వ్యవసాయరంగంలో ఉన్న వారికి ఫలితాలు బాగున్నాయి. డాక్టర్లు, లాయర్లకు, విద్యాసంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు. పోటీపరీక్షలో గానీ మామూలు పరీక్షలలో గానీ మీరు వ్రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాపీయింగును ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు. రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్‌కాల్స్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిష్కారణ వేధింపులకు గురి అవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లరమల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీయత్నాలు విసుగుపుట్టిస్తాయి. ఏ పనిచేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనులను కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహయోగం ఏర్పడుతుంది. -
వికారినామ సంవత్సర (కుంభ రాశి) రాశిఫలాలు
ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏకాదశంలో శని కేతువుల సంచారం, పంచమంలో రాహు గ్రహ సంచారం, ఏకాదశంలో, వ్యయంలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహæణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఉద్యోగపరంగా ప్రాధాన్యత లేనటువంటి స్థానాలలో కొంతకాలం పనిచేసినప్పటికీ తరువాత మెరుగైన స్థానాన్ని సంపాదిస్తారు. మీ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు తాత్కాలికంగానే ఫలిస్తాయి. మిమ్మల్ని నిష్కారణంగా విమర్శిస్తున్న వారికి పరోక్షంగా సమాధానమిస్తారు. పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఉన్నంతలో మానసిక ప్రశాంతత ఏర్పరచుకోవడంలో ఆనందం ఉన్నదని గ్రహిస్తారు. మీ వ్యవహారశైలిలో అనేకమైన మార్పులు తెచ్చుకుంటారు. పరస్పర విరుద్ధ భావాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు మొండివాళ్ళని కలపడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. మీ సమస్యల కంటే అధికంగా ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి సమయం కేటాయించవలసి వస్తుంది. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మీ మనస్తత్వానికి విరుద్ధంగా ఇష్టం లేకపోయినా కొన్ని పైరవీలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వపరంగా, ప్రైవేటుపరంగా రావలసిన ధనం అతికష్టం మీద చేతికి వస్తుంది. పగ ప్రతీకారాలకు అతీతంగా పెద్దమనిషిగా వ్యవహరిస్తారు. సమాజంలో వివిధ రంగాలలో పేరుప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులను మీ స్వహస్తాలతో సత్కరించి మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు ఏ విషయం చెప్పినా వద్దు, కాదు అని అపశకునాలు పలికి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు మీ కార్యక్రమాలు విజయవంతం కావడం చూసి సిగ్గు విడిచి మళ్ళీ మీతోనే నడుస్తారు. భ్రాంతితో, భయంతో జీవనం వెళ్ళదీస్తున్న వ్యక్తులను చేరదీసి ధైర్యం చెబుతారు. ఆస్తి కోసం, ధనం కోసం తల్లిదండ్రులతో కూడా విరోధం కల్పించే ప్రయత్నం చేస్తారు. అయితే సహోదరవర్గం అండగా నిలిచి దుష్పరిణామాలు సంభవించకుండా అండగా నిలబడతారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీ సాటివాళ్ళు మీ కన్నా అధికంగా లాభం పొందుతారు. మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. అఖండమైన రాజకీయ రాజయోగం సంప్రాప్తం. శత్రువర్గంపై అఖండ విజయం. భాగస్వాముల అత్యుత్సాహం వలన కొన్ని నష్టాలు, రావలసిన లాభాలు రాకపోవడం, అధికారులతో వివాదాలు ఏర్పడతాయి. వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. పురాతన వస్తుసామగ్రి సేకరిస్తారు. వినూత్నమైన కార్యక్రమాలు, సరికొత్త వ్యాపారాలు చేసే వారు మీకు సన్నిహితం అవుతారు. మిమ్ములను భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తెస్తారు. అనుభవంలేని రంగాలలో కొత్తవారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు. ప్రభుత్వ కార్యాలయాలలో మీ పరపతి పెరుగుతుంది. చెల్లించిన సొమ్మును చెల్లించలేదని, తీసుకోని ధనం తీసుకున్నారని మొదలైన నిందలు అసౌకర్యానికి గురిచేస్తాయి. సామాజిక చర్చలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వారితో కావలసిన వనరులను, ప్రయోజనాలను సమకూర్చుకుంటారు. ప్రజాసంబంధాలను అభివృద్ధిపరచుకునే ప్రయత్నాలను అధికం చేస్తారు. విందులు, వినోదాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించుకుంటారు. స్థిరాస్తులు అమ్మే సమయంలో మోసపోయే అవకాశం ఉంది. కళా, సాంస్కృతిక వ్యవహారాలలో, క్రీడలలో నూతన అవకాశాలు అందివస్తాయి. కీర్తిప్రతిష్ఠలు సూచిస్తున్నాయి. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ అవసరం. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు. కొందరి ప్రోత్సాహం, సహకారం వల్ల మీలో నిద్రాణమైన ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ మనోభావాలను వ్యక్తం చేయకుండా ఇతరుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందన్న నిజాన్ని మీరు గ్రహిస్తారు. ఎన్నికలలో శత్రువర్గం కన్నా స్నేహితులే ఎక్కువగా నష్టం చేస్తారు. ఇరుగు పొరుగు వారితో పరుష సంభాషణలు భేదాభిప్రాయాలు సంభవిస్తాయి. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. మీది అహంకార వైఖరి అని ముద్రవేయడం జరుగుతుంది. ఒకవర్గానికి చెందిన వ్యక్తిగా మీపై ముద్రపడే అవకాశం ఉంది. భూములు, ఫ్లాట్స్, బంగారం కొనుగోలు చేస్తారు. మిత్రవర్గం, సన్నిహిత, సేవకవర్గం వారితో కొంత ఆలస్యంగా అయినా పనులు చేయించుకోగలుగుతారు. బంధువుల వల్ల, సన్నిహిత, రక్తసంబంధీకుల వల్ల, పరస్త్రీల వల్ల నష్టం జరుగుతుంది. శిరోవేదన, పార్శ్వపు నొప్పి, కీళ్ళనొప్పులు ఇబ్బంది కలిగిస్తాయి. సంస్థల విస్తరణే ధ్యేయంగా కృషి చేస్తారు. అనేకమంది ఉద్యోగుల పట్ల, వారి వారి విధుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. కుటుంబ విషయాల కారణంగా కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. మధ్యమధ్యలో జీవితభాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. స్త్రీ సంతానం పురోగతి బాగుంటుంది. భూమి, భవనాల రూపంలో ధనాన్ని మదుపు పెడతారు. జీవితంలో ఇది మీరు అనుకున్న వ్యక్తులకు ఉపయోగపడాలని ఆశిస్తారు. కాలం సజావుగా సాగుతున్నప్పటికీ వర్గవైషమ్యాలు, రాయబారాలు విసుగు కలిగిస్తాయి. వాటిని వదిలించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల లాభపడతారు. మీ ఓర్పు చాలా విజయాలకు కారణం అవుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశాలు లభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో ట్యాక్సులు వసూలు చేసే అధికారుల ద్వారా మీ ప్రత్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలు చేసి కొంతమేరకు నష్టాన్ని కలిగిస్తారు. రాజకీయ పరపతిని ఉపయోగించి చాలావరకు నష్టాన్ని నివారించుకోగలుగుతారు. ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేసినందుకు చింతిస్తారు. కోర్టు సమస్యలు సంవత్సర ప్రథమార్ధంలో ఇబ్బందిపెట్టినా ద్వితీయార్ధంలో సానుకూలపడతాయి. బంధువర్గం వారు స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. వారికి మీరు సహాయ నిరాకరణ చేస్తే, మీ ఇంట్లోని వారి ద్వారా మీపై ఒత్తిడి పెంచుతారు. సినీ, కళా పరిశ్రమలోని వారికి మంచి రోజులు గోచరిస్తున్నాయి. టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఎంతమంది పక్కన ఉన్నా, ఎన్నివిధాలుగా కలిసి వచ్చినా ఒంటరిగా ఉన్నామన్న భావన మీ మనస్సులో ప్రబలంగా నాటుకుంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మీ తోడబుట్టిన వాళ్ళకు అండగా నిలువవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జ్యేష్ఠ కుమారుడిని అతిగారాబం చేయటం వల్ల ఇంట్లో విమర్శలు వస్తాయి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పెద్దకొడుకు పట్ల మీ ప్రేమాస్పద వైఖరి మారదు. కుటుంబసభ్యుల సౌకర్యం కోసం విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార విషయాలలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తారు. వ్యాపారంలో రొటేషన్, లాభాలు బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత బాకీలు తీర్చేస్తారు. మొండి బకాయిలు చేతికి అందివస్తాయి. తల్లిదండ్రులకు, పెద్దలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళకి చెప్పనిదే ఏ పనీచేయరు. ప్రతి విషయంలోనూ స్వప్రయోజనాలకే ప్రాముఖ్యతనివ్వాలని నిర్ణయించుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు. మనోహరమైన మాటల విన్యాసంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబంలోనూ, స్నేహితులతోనూ ఐకమత్యం సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎంత ఆదాయం ఉన్నా కొన్ని సందర్భాలలో ఆర్థికంగా సర్దుబాటు చేసుకోవడానికి ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వపరమైన కాంట్రాక్టులు, లీజులను తక్కువ ధరకే దక్కించుకుంటారు. వ్యాపార విస్తరణ చేయడానికి నూతన భాగస్వాములను కలుపుకుంటారు. నిజంగా ఇబ్బందులలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేస్తారు. ముఖ్యమైన విషయాలలో భాగస్వాములతో లేక కుటుంబసభ్యులతో అభిప్రాయభేదాలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధిక ఒత్తిడి, శ్రమ కలిగి ఉంటారు. చాలా విషయాలలో ఒంటరిపోరాటం చేయక తప్పదు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదంలోకి లాగే యత్నాలు మీ శత్రువర్గం చేయటం జరుగుతుంది. జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ సైంధవుడిలా అడ్డుపడుతున్న అధికారికి స్థానచలనం కలుగుతుంది. స్థిరంగా మీ కార్యక్రమాలను చేసుకోగలుగుతారు. దూరప్రాంత వ్యాపారాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, లాభాలు పొందుతారు. వైద్యవిద్యను అభ్యసించాలన్న మీ అభిలాష నెరవేరుతుంది. ప్రింటింగ్, ప్రచార సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా లాభిస్తాయి. మీ ప్రయోజనాలను స్థిరంగా కాపాడుకోగలుగుతారు. దురుసుగా మాట్లాడి, చొరవగా చొచ్చుకుపోయే వ్యక్తుల వల్ల మీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన వ్యక్తులు చెప్పుడు మాటలు విని మీ నుండి కనీస వివరణ కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కుటుంబంలో ఐక్యత మీ ఆనందానికి, పురోభివృద్ధికి కారణం అవుతుంది. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. సంతానం భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ధనాన్ని పొదుపు చేయాలని భావిస్తారు. జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరిపేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల లాభపడతారు. విలువైన కాలాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. నిజమైన స్నేహబంధాలను వృద్ధి చేసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తారు. సమాజంలో ఉపయుక్తమైన వారితో మిత్రత్వం ఏర్పరచుకుంటారు. క్రమశిక్షణాయుతమైన మీ పద్ధతుల వల్ల లాభపడతారు. రాత్రిపూట చేసే దీర్ఘాలోచనలు ఫలిస్తాయి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి వివిధ మార్గాలు అనుసరిస్తారు. రహస్య రాయబారాలు ఫలిస్తాయి. న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా కొందరితో విడిపోయే అవకాశం ఉంది. మీ సన్నిహిత వర్గం దురాశకు పోయి నష్టపోవడం జరుగుతుంది. చాలా విషయాలలో మంచి వ్యక్తిగా, మాట తప్పని వ్యక్తిగా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. వైజ్ఞానిక రంగంలో ఉన్నవారికి, డాక్టర్లకు, లాయర్లకు, బోధనా రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కాలం కలిసివస్తుంది. ప్రభుత్వం నుండి రావలసిన బిల్స్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మానసికమైన ఒత్తిడి ఏర్పడవచ్చు. అసమర్థులకు మీరు అండగా ఉన్నారన్న ఆరోపణలు, అపోహలు రావచ్చు. సన్నిహితులు వారించినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో మీకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికిగాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ గంటలు, గంటలు ఆలోచించే విధానానికి స్వస్తి చెబుతారు. సమస్యలు పొడిగించకుండా వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాలలో లాభపడతారు. ధాన్యం వ్యాపారులకు, తోలు ఉత్పత్తుల వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, జల సంబంధమైన వ్యాపారాలు, ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి. గృహం లేక స్థలం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వయం ఆర్థిక పరిపుష్టి సాధిస్తారు. సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా, సాహిత్య రంగాలలో ప్రతిభని పెంచుకోగలుగుతారు. ఆత్మీయులతో, జీవితభాగస్వామితో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టంలేని వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోతారు. వృత్తి ఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు కలిసివస్తాయి. ధనాన్ని పొదుపు చేస్తారు. లాభాన్ని పెట్టుబడిగా పెడతారు. వినోదానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారని మీపై ఆరోపణలు వస్తాయి. కొన్ని పుకార్లు తాత్కాలికంగా ఇబ్బంది పెడతాయి. కీలక సమయంలో సహోదరవర్గం సహాయపడతారు. అడుగడుగునా సమస్యలను అధిగమించవలసి వస్తుంది. ఆటంకాలు చాలా వస్తాయి. ఇంటికి అవసరమైన ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఏర్పడుతుంది. ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఒంటరిగా ప్రతి కార్యక్రమాన్నీ నిర్వహించడం మేలు. ప్రేమవివాహాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. విద్యాపరంగా విశేషించి సాంకేతికవిద్యలో బాగా రాణిస్తారు. పోటీపరీక్షలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. మీ పట్టుదల విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది. పునర్వివాహం చేసుకునే ఉద్దేశం ఉన్నవారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వివాహంకాని వారికి వివాహప్రాప్తి, సంతానంలేని వారికి సంతానప్రాప్తి. మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు, గౌరవప్రదమైన పురస్కారాలు లభిస్తాయి. మీ పిల్లలపై ఇతరులు చూపే మమకారం కృత్రిమంగా తోస్తుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య సయోధ్య కుదర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న ఉద్యోగం లభించడం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. యోగా, మెడిటేషన్ పట్ల దృష్టి కేంద్రీకరిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. అప్పులు తీరుస్తారు. సాంస్కృతిక, క్రీడారంగాలలో విశేషంగా రాణిస్తారు. రాజకీయ పలుకుబడి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఫైనాన్షియల్ స్కీమ్‌లకు సంబంధించిన విషయాలలో దూరంగా ఉండండి. శాడిస్టు అధికారుల వల్ల కొద్దికాలం ఇబ్బందిపడతారు. ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్స్, బ్యూటీపార్లర్స్, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సంవత్సర ద్వితీయార్ధంలో వృత్తి ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. ఇతర భాషలలో కూడా ప్రావీణ్యత సాధించగలిగితే మరిన్ని మంచి ఫలితాలను అందుకోగలమని భావిస్తారు. కఠినమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారు. కళ్ళు అలసటకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. కార్యాలయంలో సమస్యలు సమసిపోతాయి. చాలా విషయాలలో గతంలో కంటే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. -
తొణకరు... బెణకరు!
ఆస్ట్రోఫన్డా : కుంభంరాశి రాశిచక్రంలో పదకొండో రాశి కుంభం. ఇది బేసి రాశి. వాయుతత్వం, వైశ్య జాతి, క్రూర రాశి, కృష్ణ వర్ణం. తొడలు, కన్ను, శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థలను సూచిస్తుంది. స్థిర రాశి, పురుష రాశి. దిశ దక్షిణం. ఇందులో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్తిగా, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలుంటాయి. అధిపతి శని. శంఖం, గవ్వలు, బొగ్గు, మినుములు, ఇనుము, నువ్వులు, పట్టు మొదలైన ద్రవ్యాలను సూచి స్తుంది. అబిసీనియా, స్వీడన్, సూడాన్ తది తర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. కుంభరాశిలో పుట్టినవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొణకరు. సంప్రదాయాలకు విలువనిస్తూనే, ఆధునికతను స్వాగతించే విశాల దృక్పథం వీరిది. మానవతా దృక్ప థంతో వ్యవహరిస్తారు. ఆత్మసాక్షి మేరకు నడుచు కుంటారు. క్రియాశీలత, స్వేచ్ఛాకాంక్ష, నిష్పాక్షికత వీరి సహజ లక్షణాలు. న్యాయం విషయంలో తనపర భేదాలు పాటించకపోవడం వల్ల అయినవారి నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే సందర్భాలూ ఉంటాయి. గొప్ప జిజ్ఞాసులు, చింతనా పరులు. శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి ఎక్కువ. తెలివితేటలు, విశ్లేషణాత్మక శక్తి, సున్నితత్వం, ఔదార్యం వంటి లక్షణాలు వీరికి గుర్తింపు తెచ్చిపెడతాయి. ఎట్టి పరిస్థితు ల్లోనూ తమ అభిప్రాయాలను మార్చుకోవ డానికి ఇష్టపడరు. సహనం ఎక్కువే అయినా, సహనం నశిస్తే కోపతాపాలను తారస్థాయిలో ప్రదర్శిస్తారు. ఏకాంతాన్ని కోరుకుంటారు. స్వేచ్ఛకు భంగం కలిగే పరిస్థితులలో ఇమడ లేరు. ఆధ్యాత్మిక చింతన, మార్మిక విద్యలపై ఆసక్తి ఎక్కువ. శాస్త్ర, కళా రంగాలలో అద్భు తాలను సాధించగలరు. గ్రహగతులు ప్రతి కూలిస్తే, స్వేచ్ఛాభిలాషతో అయినవారిని వదులుకునేందుకు సైతం సిద్ధపడతారు. వెటకారాన్ని తట్టుకోలేరు. చిన్న చిన్న కారణాలకే శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటారు. ఆందోళనను తట్టుకోలేక వ్యసనాలకు లోనవు తారు. రక్త పోటు, నాడి, గుండె, కంటి, జీర్ణకోశ సమస్యలతో బాధపడతారు. - పన్యాల జగన్నాథ దాసు