లలిత కళల ఒలింపిక్స్
పాత సంగతి
ప్రాచీన కాలం నుంచి జరుగుతున్న ఒలింపిక్స్ అంటే నాలుగేళ్లకు ఓసారి జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా పోటీలుగానే ప్రస్తుతం మనందరికీ తెలుసు. అయితే, 1912-48 కాలంలో లలిత కళల్లోనూ ఒలింపిక్స్ పోటీలు ఉండేవి. వివిధ క్రీడలతో పాటే పెయింటింగ్, సంగీతం, సాహిత్యం, శిల్పకళ, ఆర్కిటెక్చర్ వంటి అంశాల్లోనూ పోటీలు నిర్వహించి, విజేతలకు పతకాలు ఇచ్చేవారు. ఒలింపిక్స్ కమిటీ... కళాకారులను ప్రొఫెషనల్స్‌గా పరిగణించడంతో లలిత కళల పోటీలను 1954లో రద్దు చేశారు. ఆ తర్వాత 1956 నుంచి ఒలింపిక్స్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది.