భేషూగ్గా వెళ్లొచ్చు! | Rice, CA - Shoe Fence - Roadside America | Sakshi
Sakshi News home page

భేషూగ్గా వెళ్లొచ్చు!

Published Sun, Oct 11 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

భేషూగ్గా వెళ్లొచ్చు!

భేషూగ్గా వెళ్లొచ్చు!

విహంగం
‘‘ఎందుకు ఆ పాత షూస్‌ను అలా మూటగడుతున్నావ్?’’
 ‘‘న్యూజిలాండ్‌కు వెళుతున్నానులే’’
 ‘‘ఓహో... ‘వాయిహోల’కు వెళు తున్నావా? ఏం వదులుకుంటున్నావు?’’
 ‘‘బద్దకాన్ని!’’
న్యూజిలాండ్‌కు వెళ్లే పర్యాటకులలో చాలామంది వాయిహోల గురించి ఆరా తీస్తారు. అక్కడి ‘షూ ఫెన్స్’ గురించి వివరాలు తెలుసుకుంటారు. దాన్ని వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ ఉన్న తీగెకు తమతో తీసుకెళ్లిన బూట్లు, చెప్పులను తగిలిస్తారు.

ఎందుకలా చేస్తారు అంటే... దాని వెనుక ఎన్నో నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవా లంటే ఒక్కసారి ‘చెప్పుల స్వర్గం’ అని పిలిచే వాయిహోలకు వెళ్లి రావాల్సిందే.
 న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లో డునెడిన్, మిల్టన్ పట్టణాల మధ్య స్టేట్ హైవే-1ను ఆనుకొని ఉంటుంది వాయిహోల టౌన్‌షిప్. ఇక్కడి టూరిజం అట్రాక్షన్ లేక్ వాయిహోల. వాటర్ స్కైయింగ్, రోయింగ్ మొదలైన జల క్రీడాలకు అది ప్రసిద్ధి.  ఇంతకు మించి వాయిహోల గురించి చెప్పుకోవడానికి  పర్యాటక ఆకర్షణలేవీ లేకపోయినప్పటికీ, ఆ ప్రాంతం టూరిస్టు కేంద్రం కావడానికి ప్రధాన కారణం మాత్రం... షూ ఫెన్స్!
 
న్యూజిలాండ్ వచ్చే పర్యాటకుల్లో చాలామంది, షూ ఫెన్స్‌ని చూడటానికి పని గట్టుకుని వాయిహోలకు వస్తారు. హైవేకు ఒక పక్క... పొడవాటి కంచెకు రకరకాల బూట్లు కట్టి ఉంటాయి. వాటికి తమతో తెచ్చిన బూట్లను కూడా జత చేస్తుంటారు సందర్శకులు. ఇలా కట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి.
 
‘ఇక్కడ ప్రతి చెప్పుకు ఒక ఆత్మ ఉంటుంది’ అంటారు స్థానికులు. ఆ ఆత్మ ఏం చెప్తుంది అంటే, చెడు అలవాట్లను వదిలేయమంటుంది అంటారు. అందుకే చాలామంది వచ్చి, బూట్ల జతను కంచెకు వేళ్లాడదీసి, తమకున్న చెడు అలవాట్ల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించి వెళ్తుంటారు. అలాగే... వాడేసిన పాత బూట్లను ఈ రకంగా దూరం చేసుకుంటే, తమను వెంటాడుతోన్న దురదృష్టం కూడా దూరమవుతుందని నమ్ముతారు.
 
అయితే ఈ సంప్రదాయం ఎలా మొదలైంది అనేదాని గురించి స్పష్టత లేదు. కాకపోతే ఇమెల్డా మార్కోస్ లాంటి అభిరుచిని పోలిన వ్యక్తి ఎవరో వాయి హోల చుట్టుపక్కల ఉండి ఉండొచ్చనేది ఒక అంచనా. ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ భార్య అయిన ఇమెల్డా, ఎంత రేటు పెట్టి కొన్న పాద రక్షలనైనా ఒక్కరోజు మాత్రమే వేసుకొనే దట. దాంతో ఆమె దగ్గర వందలాది పాద రక్షలుండేవి. వీటిని ‘ఇమెల్డా సంపద’ అని పిలిచేవారు.

ఆమె సేకరించిన చెప్పులన్నీ ప్రసుత్తం నేషనల్ మ్యూజియం ఆఫ్ ఫిలిప్పైన్స్, మార్కిన నగరంలోని షూ మ్యూజియమ్‌లలో ఉన్నాయి. న్యూజి లాండ్‌లో కూడా ఇమెల్డా లాంటి వ్యక్తి ఎవరైనా తాను సేకరించిన షూస్‌ను సరదాగా ఈ కంచెకు కట్టి ఉండొచ్చు, కాలక్రమంలో ఆ సరదా కాస్తా సంప్ర దాయమై ఉండొచ్చు అనేది ఒక కథనం.
 
కంచెకు షూ కడితే... నేషనల్ హైవే మీద ప్రయాణించే వాళ్లకు ఎలాంటి ప్రమాదాలూ జరగవనే నమ్మకం కూడా షూ ఫెన్స్‌కు డిమాండ్‌ను పెంచింది.
 నమ్మకం కావచ్చు, మూఢనమ్మకం కావచ్చు. వాస్తవం కావచ్చు, కల్పన కావచ్చు. షూ ఫెన్‌‌స ఏర్పడటానికి కారణం ఏదైనా, అది ఓ సెంటిమెంటుగా మారింది. చెడును, దురలవాట్లను దూరం చేసే ప్రదేశంగా పేరొందింది.

ఓ ప్రముఖ సందర్శనీయ స్థలంగానూ ఖ్యాతికెక్కింది.
ప్రసిద్ధ ఫ్రెంచ్ ఫుట్‌వేర్ డిజైనర్ క్రిస్టియన్ లోబోటిన్ ఒక చక్కని మాట చెప్పాడు... ‘షూ అంటే కేవలం డిజైన్ మాత్రమే కాదు. అది మన శరీరభాషలో ఒక భాగం. దారి చూపే నేస్తం’ అని! న్యూజిలాండ్‌లోని షూ ఫెన్స్‌ను చూస్తే... షూ అనేది దారి చూపే నేస్తమే కాదు, మనసులోని కోరికను తీర్చే సాధనం అని కూడా అనిపిస్తుంది.            

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement