సర్ రోనాల్డ్ రాస్ మన తొలి నోబెల్ స్టార్ | sir ronaldo ross is our first nobel prize star | Sakshi
Sakshi News home page

సర్ రోనాల్డ్ రాస్ మన తొలి నోబెల్ స్టార్

Published Sun, Oct 20 2013 3:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

సర్ రోనాల్డ్ రాస్ మన తొలి నోబెల్ స్టార్

సర్ రోనాల్డ్ రాస్ మన తొలి నోబెల్ స్టార్

 ఆల్‌ఫ్రెడ్ నోబెల్... నోబెల్ పురస్కారాల ప్రదానం
 ప్రారంభించింది 1901లో. ఆ మరుసటి సంవత్సరం (1902లో) ఆ బహుమతిని అందుకున్న వ్యక్తి సర్ రోనాల్డ్ రాస్. ఇతడు నోబెల్ పురస్కారం అందుకున్న మొదటి భారతీయుడు (జన్మస్థలాన్ని బట్టి). ఇతడికి వైద్య శాస్త్రం శరీర ధర్మశాస్త్రం విభాగంలో నోబెల్
 బహుమతి లభించింది. మలేరియా వ్యాధిని నిర్మూలించడానికి రోనాల్డ్ రాస్ దోమల మీద చేసిన పరిశోధనలు, ఆయన జీవితవిశేషాలివి.
 
 రోనాల్డ్ రాస్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరాలో 1857వ సంవత్సరం మే నెల 13వ తేదీన జన్మించారు. ఇతడి తండ్రి సర్ సి.సి.జి.రాస్ ఉత్తరాఖండ్‌లో బ్రిటిష్ సైన్యంలో ‘జనరల్’గా (అత్యున్నత అధికారి) పనిచేసేవారు. ఆ రోజుల్లో భారతదేశంలోను, అనేక ఆసియా దేశాల్లోను మలేరియా వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తూండేది. అప్పట్లో అది ప్రాణాంతకమైన వ్యాధి కూడ. వైద్యుడైన రోనాల్డ్ రాస్ మలేరియా వ్యాధి గురించి విస్తృతమైన పరిశోధనలు చేశారు. ‘ఎనాఫిలస్’ జాతి దోమకాటు ద్వారా మలేరియా వ్యాధి సోకుతుందని, దోమల శరీరంలో ఉండే మలేరియా పరాన్నభక్కులు (parasites) దోమకాటు ద్వారా మానవ రక్తంలో ప్రవేశిస్తాయని తెలుసుకున్నారీయన. మలేరియాని మన రాష్ట్రంలో చలిజ్వరం అంటారు.
 
  దోమల నిర్మూలన ద్వారా ఈ వ్యాధిని నిరోధించవచ్చని రాస్ కనుగొన్నాడు. ‘ట్రోపికల్ మెడిసిన్’ విభాగాన్ని నెలకొల్పిన సర్ రోనాల్డ్ రాస్ వైద్య పరిశోధనా రంగంలో ఉన్న వారికి ఆదర్శనీయుడు.
 
 సర్ రోనాల్డ్ రాస్ జీవిత విశేషాలు
 సర్ రోనాల్డ్ రాస్... బ్రిటిష్ సైనికాధికారి జనరల్ (సర్) క్యాంప్‌బెల్ క్లే గ్రాంట్‌రాస్ (టజీట ఇఇఎ ఖౌటట), మటీల్డా చార్లొట్ ఎల్డకటన్ దంపతులకు ప్రథమ సంతానం. బ్రిటిష్ జాతీయుడైనప్పటికీ భారతదేశంలో జన్మించటం చేత, రోనాల్డ్‌కు భారతదేశమంటే ఎనలేని ప్రేమ, గౌరవం. రోనాల్డ్ రాస్ తాతగారైన లెఫ్టినెంట్ కల్నల్ హ్యూరాస్‌కు మలేరియా జ్వరం సోకింది. అది మొదలు రోనాల్డ్‌కు వైద్య విద్యనభ్యసించి మలేరియా వ్యాధిపై పరిశోధన చేయాలని, ఆ వ్యాధిని నిర్మూలించే మార్గం కనుగొనాలనే బలమైన కోరిక మనసులో నాటుకుంది. తాను ఆశించిన విధంగానే పాఠశాల విద్య అనంతరం తన 18వ యేట లండన్ వైద్య కళాశాలలో చేరి, 1880లో వైద్య పట్టా పొందారు. వెంటనే రాస్ భారతదేశానికి తిరిగివచ్చి, 1881వ సంవత్సరంలో ఇండియన్ మెడికల్ సర్వీస్‌లో చేరి, మలేరియా వ్యాధిపై పరిశోధనలు ప్రారంభించారు.
 
  రోనాల్డ్ రాస్ 1892వ సంవత్సరం వరకూ జరిపిన  పరిశోధనలు ఫలంతమయ్యాయి. మలేరియా వ్యాధి ‘ఎనాఫిలస్’ (అ్చఞజిడఠట) జాతి దోమల ద్వారా సంక్రమిస్తుందని, దోమల రక్తనాళాలలోని పరాన్నభక్కులు (ఞ్చట్చటజ్ట్ఛీట) మనిషి రక్తంలో ప్రవేశించి, మలేరియా వ్యాధిని కలగజేస్తాయని నిర్ధారించారు. ఎనాఫిలస్ దోమల నిర్మూలన ద్వారా మలేరియా వ్యాధిని నివారించవచ్చని కనుగొన్నారు.
 
 రోనాల్డ్ తన పరిశోధనలను అంతటితో ఆపలేదు. మరింత లోతుగా అధ్యయనం చేయడానికి 1899లో ఇంగ్లండుకు వెళ్లి లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో చేరాడు. ఆఫ్రికా దేశంలో విస్తారంగా ఉన్న మలేరియా, ఆఫ్రికన్ జ్వరాలపై పరిశోధనలు జరిపి, ఆయా వ్యాధుల నివారణకు మార్గాలు సుగమం చేశాడు.
 
 1901వ సంవత్సరంలో డాక్టర్ రాస్ ఊఖఇ (ఫెలోఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ సర్జన్స్), ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (ఊఖ) బిరుదులు పొందారు. రాస్... ప్రతిష్ఠాత్మకమైన రాయల్ సొసైటీకి ఉపాధ్యక్షునిగా కూడా ఎంపికయ్యారు. ఇంగ్లండులో అనేక ప్రతిష్టాత్మకమైన పదువులు చేపట్టి, వైద్యునిగా, బాక్టీరియాలజీ (సూక్ష్మజీవుల శాస్త్రం) విభాగాలలో పరిశోధనల ద్వారా కీర్తి గడించి అటు ఇంగ్లండులోను, ఇటు ఆసియా, ఆఫ్రికా దేశాలలోనూ ప్రసిద్ధి పొందారు.
 
 రోనాల్డ్ రాస్ ప్రపంచానికి శాస్త్రవేత్తగానే పరిచయమయ్యారు. కానీ ఆయన మంచి రచయిత కూడ. తీరిక వేళల్లో రచనలు చేసేవారు. కవి, నాటక కర్త, రచయితగా పేరుతెచ్చుకున్నారు. ఆయన రచనలలో ‘స్వీయ చరిత్ర’, ‘మలేరియా వ్యాధి నిరోధం’ ప్రధానమైనవి.
 
 1889లో రోనాల్డ్ జెస్సీ బ్లాక్సమ్ అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు. వారికి నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు... డరోతీ రాస్, సిల్వియా రాస్. ఇద్దరు కొడుకుల పేర్లు... రోనాల్డ్ రాస్, చార్లెస్‌రాస్. తన జీవితం అంతా వైద్యసేవకు, పరిశోధనకు అంకితం చేసిన డాక్టర్ రోనాల్డ్ రాస్ 1932వ సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన కన్నుమూశారు. ఆయన కొంతకాలం హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్శిటీలో కూడా పరిశోధనలు చేశారు. ఆయన పేరిట ఇప్పటికీ హైదరాబాద్ బేగంపేటలో ‘సర్ రోనాల్డ్ రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీ’ విభాగం పనిచేస్తోంది.
 
 నోబెల్ పురస్కారం
 మలేరియా వ్యాధిపై డాక్టర్ రాస్ జరిపిన పరిశోధనలకు గాను ఆయనకు 1902వ సంవత్సరపు నోబెల్ పురస్కారం లభించింది. రోనాల్డ్ రాస్ జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలలో ముఖ్యమైనవి...
 
     జీవితంలో కొన్ని నిర్దిష్టమైన ఉన్నతాశయాలు పెట్టుకుని, వాటిని సాధించేవరకు కృషి చేయటం.
 
     తాను ఆంగ్లేయుడైనా జన్మించిన భారతదేశం పట్ల ఎంతో ప్రేమ, గౌరవంతో ట్రోపికల్ మెడిసిన విభాగంలో పనిచేయటం.
 
     వైద్య వృత్తిని స్వీకరించినా... ఆంగ్ల సాహిత్యం, గణిత శాస్త్రం మొదలైన రంగాల్లో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం; కవిగా, రచయితగా, నాటక ప్రయోక్తగా కళాకారునిగా చూపిన శ్రద్ధాసక్తులు మొదలైనవి స్ఫూర్తిదాయకాలు.
 
 డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు
 విశ్రాంత రసాయనాచార్యుడు
 
 భారత నోబెల్స్: నాటి నుంచి... నేటి వరకు...
 
 నోబెల్ పురస్కారం అందుకున్న శాస్త్రవేత్తలలో భారతదేశానికి సంబంధించిన వారు 13 మంది. వారిలో తొమ్మిదిమంది భారత పౌరులు. మిగిలిన నలుగురు భారత సంతతికి చెందిన వారు. ఆ ప్రముఖుల పేర్లు, వారు నోబెల్ పురస్కారం పొందిన సంవత్సరాలు, సేవలు అందించిన అంశాల వివరాలు....
 
     1902లో ఆల్మోరా (ఉత్తరాఖండ్)కి చెందిన సర్ రోనాల్డ్ రాస్. శరీర ధర్మశాస్త్రం, వైద్య శాస్త్రం, మలేరియా వ్యాధిపై పరిశోధనలు చేశారు.
 
     1907లో ముంబైకి చెందిన రుడ్ యార్డ్ కిప్లింగ్. ఆంగ్ల సాహిత్యం, పిల్లల కథలు అంశానికి అందుకున్నారు.
 
     1913లో రవీంద్రనాథ్ ఠాగూర్. బెంగాలీ సాహిత్యం, గీతాంజలి పద్య సంకలనం వంటి రచనలకు.
 
     1930లో తమిళనాడుకి చెందిన సి.వి.రామన్. ‘భౌతిక శాస్త్రం కాంతి: రామన్ ఫలితం’ అనే పరిశోధనకు.
 
     1968లో వెస్ట్ బెంగాల్‌కి చెందిన హరగోవింద్ ఖొరానా శరీర ధర్మ శాస్త్రం, వైద్య శాస్త్రం ప్రొటీన్ సంశ్లేషణకు.
 
     1979లో మదర్ థెరిసా. ప్రపంచ శాంతి, రోగులకు సేవకు.
 
     1983లో తమిళనాడుకి చెందిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. భౌతిక శాస్త్రం, అంతరిక్ష శాస్త్రంలో పరిశోధనలకు.
 
     1998లో పశ్చిమ బెంగాల్‌కి చెందిన అమర్త్యసేన్. ఆర్థిక శాస్త్రం, ఆర్థిక సంక్షేమం అంశాల మీద అధ్యయనం.
 
     2009లో తమిళనాడుకి వెంకటరామన్ రామక్రిష్ణన్. రసాయన శాస్త్రం, జీవ రసాయన శాస్త్రంలో పరిశోధనలకు.
 
 ఈ తొమ్మిదిమందీ భారతపౌరులు. ఈ కింద ఉదహరించిన నలుగురు భారత సంతతికి లేదా మనదేశంలో సంబంధాలు కలిగినవారు.
 1979లో అబ్దుస్ సలామ్. భౌతిక శాస్త్రం
 1989లో దలైలామా. ప్రపంచ శాంతి
 2001లో ఎన్.ఎస్.నైపాల్. సాహిత్యం
 2006లో మహమ్మద్ యూనస్ ప్రపంచ శాంతి
 
 డాక్టర్ రోనాల్డ్ రాస్ గౌరవార్థం వేల్స్ యువరాజు ‘రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్’ అనే సంస్థను స్థాపించారు. రోనాల్డ్ రాస్ జరిపిన పరిశోధనల వివరాలన్నీ ఈ సంస్థలో ఇప్పటికీ లభిస్తాయి.
 
 పైన పేర్కొన్న ప్రఖ్యాత వ్యక్తుల జీవిత విశేషాలు, వివిధ రంగాలలో వారి ఆవిష్కరణల వివరాలు, వ్యయ ప్రయాసలకోర్చి వారు చేసిన కృషి మొదలైన చారిత్రక విషయాలను చదవటం ద్వారా ఈ తరం విద్యార్థులకు, యువతకు ఎంతో స్ఫూర్తి, పట్టుదల, ఉత్సాహం కలుగుతాయి.
 
 ‘ఎనాఫిలస్’ జాతి దోమకాటు ద్వారా మలేరియా వ్యాధి సోకుతుందని రాస్
 తెలుసుకున్నారు.
 
 డాక్టర్ రోనాల్డ్ రాస్ గౌరవార్థం వేల్స్ యువరాజు ‘రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్’ అనే సంస్థను స్థాపించారు. రోనాల్డ్ రాస్ జరిపిన పరిశోధనల వివరాలన్నీ ఈ సంస్థలో ఇప్పటికీ లభిస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement