
నెట్టింట్లోంచే తిరుమల యాత్ర
తిరుమలలో నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఆధునిక, సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఇంట్లో నెట్ ఉంటే చాలు... ఆన్‌లైన్‌లోనే స్వామి దర్శనం, బస, సేవలను బుక్ చేసుకునేలా నిబంధనలు సులభతరం చేసింది.
తిరుమలలో రూ.300 టికెట్ల కేటాయింపుల్లేవు... ఆన్‌లైన్ లోనే 26వేల టికెట్లు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కేటాయింపులో మార్పు వచ్చింది. 2009 నుండి తిరుమలలోనే టికెట్లు కేటాయించేవారు. ఇటీవల పూర్తిగా రద్దు చేశారు. ఆ కోటాలో రోజు కేటాయించే 26 వేల టికెట్లను ఇంటర్నెట్ ద్వారా కేటాయిస్తున్నారు.
ఓ కుటుంబంలోని భక్తుల్లో ఒకరు తమ ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేయాలి. మొదటి వ్యక్తితోపాటు మిగిలినవారి పేర్లు నమోదు చేసుకోవాలి.
* అదే టికెట్టుపై ఒకరికి రెండు లడ్డూలు ఇస్తారు. అదనంగా మరో రెండు లడ్డూలు కావాలంటే దర్శన టికెట్ల బుకింగ్ సందర్భంలోనే మరో రూ.50 చెల్లించి రెండు లడ్డూ టికెట్లు తీసుకునే సదుపాయం కల్పించారు. స్వామి దర్శనం తర్వాత ఆలయం వెలుపల ఆ టికెట్లపై భక్తులు లడ్డూలు పొందే అవకాశం ఉంది.
* ఆన్‌లైన్‌తోపాటు టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల్లోనూ, మండల పోస్టాఫీసుల్లోనూ రూ.300 దర్శన టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించారు. ఇటీవల టీటీడీ ఏపీ, తెలంగాణలోని 2500 పోస్టాఫీసుల ద్వారా రోజుకు 5 వేల టికెట్ల వరకు పొందే అవకాశం కల్పించింది..
* ఈ రూ.300 టికెట్లను ప్రతిరోజూ 56 రోజులకు ముందు కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఖాళీలను బట్టి భక్తులు తమకు నచ్చిన తేదీల్లో టికెట్లు రిజర్వు చేసుకునే సౌకర్యం కల్పించారు.
* ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పది టైం స్లాట్లలో టికెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.
* ఇక ఇదే విధానంలో రూ.50 సుదర్శనం టికెట్లు రోజుకు 4 వేలు కేటాయిస్తున్నారు. వీరికి రాత్రి 7 నుంచి రాత్రి 10 గంటల్లోపు మూడు టైం స్లాట్లలో స్వామి దర్శనానికి అనుమతిస్తారు.
సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి
* శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ సంప్రదాయం తెలియజేసేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ప్రారంభంలో కల్యాణోత్సవం, ఆ తర్వాత అన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ అమలు చేసింది.
టీటీడీ ఆలయ దర్శనం కోసం...
* చిత్తూరుజిల్లా వ్యాప్తంగా టీటీడీ ఆలయాలు ఉన్నాయి. ఇందులో అనాదిగా దేవస్థానం నిర్వహించే ఆలయాలతోపాటు స్థానికంగా పూజలందుకుంటూ టీటీడీకి అప్పగించిన ఆలయాలు ఉన్నాయి. వీటి సందర్శన కోసం దేవస్థానం సొంతంగా ఏపీ టూరిజం బస్సులతో ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసింది. తక్కువ టికెట్ల ధరతో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఏడెనిమిది ఆలయాలు సంద ర్శించే అవకాశం కల్పించింది. ఆ ప్రత్యేక ప్యాకేజి టూర్ వివరాలేమిటో తెలుసుకుందాం!
తిరుపతిలోని స్థానిక ఆలయాలు
* శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు శ్రీకోదండరామస్వామి ఆలయం, తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి ఆలయం, తిరుపతి శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీఅగస్త్యేశ్వరస్వామి ఆలయం, తొండవాడ.
ప్యాకేజీ: టికెట్టు ధర రూ.100. (నాన్ ఏసీ- 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరం లేదు) బస్సు బయలుదేరే స్థలం, సమయం: శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి. ఉ. 6 నుండి మ.1 గంటల వరకు ప్రతి ఒక గంటకు.
చిత్తూరు జిల్లాలో దర్శించే ఆలయాలు
* శ్రీవేణుగోపాలస్వామి ఆలయం, కార్వేటినగరం శ్రీవేదనారాయణస్వామి ఆలయం, నాగలాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట శ్రీకరియమాణిక్యస్వామి ఆలయం, నగిరి శ్రీఅన్నపూర్ణాసమేత కాశీవిశ్వేరస్వామి ఆలయం, బుగ్గ, కార్వేటినగరం శ్రీవల్లికొండేశ్వర స్వామి ఆలయం, సురుటుపల్లి, నాగలాపురం
అదనపు వివరాలకు: 0877-2289120, 2289123, 09848007033
ప్యాకేజీ: టికెట్టు ధర రూ.200. (నాన్ ఏ.సీ), 300(ఏ.సీ) 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరం లేదు) బస్సు బయలుదేరే స్థలం: శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం తిరుపతి. ఉ. 8 నుండి మ. 9 గంటలకు
భక్తులు ఇలా టీటీడీ సమాచారం
తెలుసుకోవచ్చు: టీటీడీ కాల్‌సెంటర్‌లో శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి సమాచారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 0877-22 33333, 2277777, 2264252
టీటీడీ వెబ్‌సైట్: www.tirumala.org www.tirupati.org
ఈమెయిల్:www.tirumala.org www.tirupati.org
సేవలు, వసతి ఆన్‌లైన్ బుకింగ్: www.tirumala.org www.tirupati.org
టీటీడీ దాతల విషయ వివరాల కేంద్రం: 0877-2263472
ఉచిత సేవలకు డబ్బులు అడిగితే టీటీడీ విజిలెన్స్ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో (0877-2263261) ఫోన్‌చేసి నేరుగా ఈఓతో టీటీడీ పరిధిలో తమకు ఎదురైన సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు.
నిత్యాన్న ప్రసాదానికి కూరగాయల విరాళం
అన్నప్రసాదాల తయారీకోసం రోజుకు టన్నుల కొద్దీ కూరగాయలు వాడతారు. వాటిలో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వంటి కూరగాయల్ని భక్తులు విరాళంగా ఇస్తే టీటీడీ అధికారులు స్వీకరిస్తారు. అదనపు వివరాలకు 0877-226458 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
దాతలకు బస, దర్శనంలో కోటా
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.1 లక్ష ఆపైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర బహుమానాలు టీటీడీ అందజేస్తోంది. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం ఫోన్:087722-63472,2263727కు సంప్రదించవచ్చు.
టీటీడీ పౌరోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే...
భారతీయ వివాహ చట్టాల ప్రకారం వధూవరులకు నిర్ణీత వయోపరిమితి ఉండాలి. వధూవరుల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ప్రభుత్వం ద్వారా వచ్చిన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, పాస్‌పోర్టు, ఓటరు కార్డు... వంటి వాటిల్లో ఫొటో గుర్తింపు కార్డు నకలును అందజేయాలి.