వెంకన్న క్షేత్రం... విహంగ వీక్షణం | Tirumala brahmotsavalu 2015 | Sakshi
Sakshi News home page

వెంకన్న క్షేత్రం... విహంగ వీక్షణం

Published Sat, Sep 19 2015 11:55 PM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

వెంకన్న క్షేత్రం... విహంగ వీక్షణం - Sakshi

వెంకన్న క్షేత్రం... విహంగ వీక్షణం

తిరుమల ఆలయానికి  రెండువేల సంవత్సరాలకు పైగా చారిత్రకనేపథ్యం ఉంది. కాలిబాట, డోలీలు, ఎడ్లబండ్లపై  యాత్రికులు ఏడుకొండెలెక్కి తిరుమలకొండకు చేరేవారు. అప్పట్లో వేళ్లమీదలెక్కపెట్టేజనమే. వేయికాళ్ల మండపంలో నిద్రచేసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లేవారు. 1933లో టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. అప్పటి ఆలయ బాధ్యతలు నిర్వహించే  అన్నారావు, భారత ఇంజనీరింగ్ పితామహుడు  మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ సర్ ఆర్థర్‌హూప్ నేతృత్వంలో 1945 ఏప్రిల్10న తొలిఘాట్‌రోడ్డు ఏర్పాటైంది.

తర్వాత 1973లో రెండో ఘాట్‌రోడ్డు రావటంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే టీటీడీ తిరుమల ఆలయానికి చుట్టూ 10 చ.కి.మీ. విస్తీర్ణంలో సౌకర్యాలు పెంచుతూ వస్తోంది. ఫలితంగా భక్తుల సంఖ్య నేడు లక్ష దాటుతుండటం విశేషం. ఇటీవల శేషాచలంలో ఏర్పడిన అగ్నికీలల్ని ఆర్పేందుకు టీటీడీ, భారత ప్రభుత్వం హెలికాఫ్టర్లు వినియోగించారు. అప్పట్లో తీసిన తిరుమల విహంగ వీక్షణలో అరుదైన చిత్రమిది.
 
1.    భూ వరాహస్వామి ఆలయం-తొలి దర్శనం అందుకునే వేల్పు
2.    పుష్కరిణి- ప్రకృతిసిద్ధంగా ఆవిర్భావం
3.    ఆనందనిలయం-8వ శతాబ్దానికి పూర్వం
4.    వెండివాకిలి గోపురం-12వ శతాబ్దం
5.    మహద్వార గోపురం-13వ శతాబ్దం
6.    హథీరామ్ మహంతుమఠం-17వ శతాబ్దం
7.    నాలుగు మాడ వీధులు-19వ శతాబ్దం
8.    పాత అన్నప్రసాద భవనం-1980
9.    మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్-1985
10.    కొత్త కల్యాణకట్ట -1985
11.    ఆస్థాన మండపం -1985
12.    రాంభగీచా అతిథిగృహాలు-1985
13.    వరాహస్వామి అతిథిగృహాలు-1993
14.    సప్తగిరి సత్రాలు-1996
15.    రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2003
16.    కొత్త అన్నప్రసాద భవనం ప్రారంభం-2010
17.    నందకం అతిథిగృహం-2010
18.    పాపవినాశం ప్రవేశ తోరణం
19.    నారాయణగిరి పర్వతశ్రేణులు
20.    శ్రీనివాసమంగాపురం
21. చంద్రగిరి ఊరు
22. కొండమీద చంద్రగిరి కోట
23. పద్మావతి అతిథి గృహాల ప్రాంతం
24. ఆళ్వారు చెరువు
25. శ్రీవారి వసంత మండపం
26. నారాయణగిరి ఉద్యానవనం
27. పౌరోహిత సంఘం, కళ్యాణవేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement