
ఉగాది సంబరం
తెలుగు వాళ్లకు మన్మథనామ సంవత్సరం ప్రారంభం అయిన రోజునే ఇండోనేసియాలో భాగమైన బాలి దీవిలోని హిందువులకు కూడా నూతన సంవత్సరం ప్రారంభమైంది. మరి వీరికీ మనకూ ఏ మూలాలు ముడిపడి ఉన్నాయో కానీ... మన ఉగాది రోజునే అక్కడ నూతన సంవత్సర వేడుకలు చాలా ఉత్సాహభరితంగా జరిగాయి. ఆ సంబరాల్లో భాగంగా జరిగిన కిస్సింగ్ ఫెస్టివల్‌లో ఇలా ఉల్లాసంగా గడిపిన జంటలెన్నో!