వారఫలాలు నవంబర్ 16 నుండి 22 వరకు | Varaphalalu from November 16 to 22 | Sakshi
Sakshi News home page

వారఫలాలు నవంబర్ 16 నుండి 22 వరకు

Published Sun, Nov 16 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

వారఫలాలు నవంబర్ 16 నుండి 22 వరకు

వారఫలాలు నవంబర్ 16 నుండి 22 వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం.
 
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
ఇంతకాలం వేధించిన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులు, మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మిత్రులతో వివాదాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 పరిచయాలు పెరుగుతాయి.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. భూవివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. వారం మధ్యలో అనారోగ్యం.
 
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. గృహ నిర్మాణయత్నాలు నత్తనడకన సాగుతాయి. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధనలబ్ధి.
 
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. నాయకులకు పదవీయోగం. వారం చివరిలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
 
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం మధ్యలో అనారోగ్యం.
 
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాకీలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. కళారంగం వారికి ఉత్సాహవంతం. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం.
 
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక నిర్ణయాలకు తగిన సమయం. భూ, గృహయోగాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు అనుకోని అవకాశాలు. వారం మధ్యలో  మిత్రులతో మాటపట్టింపులు.
 
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.  వ్యాపార లావాదేవీలు అంతంతగానే ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధన, వస్తులాభాలు.
 
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
ఇబ్బందులు ఎదురైనా సర్దుబాటు కాగలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం.
 
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. భూ, గృహయోగాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు.
 
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)

ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివర్లో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement