వేపాకు ప్యాక్ | Vepaku Pack | Sakshi
Sakshi News home page

వేపాకు ప్యాక్

Published Sat, Jul 23 2016 9:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

వేపాకు ప్యాక్

వేపాకు ప్యాక్

న్యూ ఫేస్
కావలసినవి: వేపాకు పేస్ట్ (ఆకులను మెత్తగా నూరుకోవాలి) - 1 టేబుల్ స్పూన్, శనగపిండి - 1 టీ స్పూన్, పెరుగు - అర టీ స్పూన్
తయారీ: ఓ బౌల్‌లో వేపాకు పేస్ట్, శనగపిండి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే... చర్మం మృదువుగా తాజాగా అవుతుంది. (వేపాకు పేస్ట్‌కి బదులు... ఎండిన వేపాకుల పొడిని కూడా ఉపయోగించొచ్చు)
     
వేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మాన్ని మొటిమలు, దద్దుర్ల నుంచి కాపాడతాయి. అలాగే ఈ ప్యాక్‌లోని శనగపిండి ముఖంపై ఆయిలీనెస్‌ను తగ్గిస్తుంది. మంచి క్లీనింగ్ ఏజెంట్‌గానూ శనగపిండి తోడ్పడుతుంది. రోజూ కాలుష్యంలో తిరిగేవారు ఈ ప్యాక్‌ను రోజు విడిచి రోజు వేసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధులు దరి చేరవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement