వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు) | Weekly Horoscope For 4th August To 11th August 2019 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)

Published Sun, Aug 4 2019 8:13 AM | Last Updated on Sun, Aug 4 2019 8:13 AM

Weekly Horoscope For 4th August To 11th August 2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న పనులు ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు విజయాలు చేకూరతాయి. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉండి రుణాలు తీరతాయి. వ్యతిరేకులు కూడా మీకు సహకరించడం విశేషం. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. గులాబి, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొన్ని పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటుంది. సన్నిహితులు, బంధువులతో ముఖ్యమైన విషయాలపై ^è ర్చిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తగినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశపయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు మన్నిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సానుకూల వాతావరణం. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు మిశ్రమంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు. ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు సాగండి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. నిర్ణయాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో  పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు. కుటుంబబాధ్యతలపై కొంత విముఖత చూపుతారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. చిన్ననాటి మిత్రుల కలయిక. తెలుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఎంతటి పనైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా  గడుపుతారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలలో గందరగోళాలు తొలగి, ఊరట చెందుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. మీపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సందేశం అందుతుంది. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలకు సర్వత్రా ప్రశంసలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలు చేపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకర్షిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు పదవులు వరించవచ్చు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనయోగం. మీ మనస్సులోని భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయినా పట్టుదలతో అధిగమిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారంపై చర్చలు జరుపుతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి అనుకోని సన్మానాలు, రివార్డులు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠనం మంచిది.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలబాటలో పడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోగతి సాధిస్తారు.  ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు రావచ్చు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారి కలలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement