ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ చర్యల పట్ల, అతని వైఖరి పట్ల అంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా అమెరికాలో ప్రజల ఆలోచనా ధోరణి అతనికి ఎందుకను కూలంగా ఉంది అన్న ప్రశ్న అమెరికా వెళ్ళొచ్చినప్పటి నుంచి నన్ను తొలిచేస్తు న్నది. అమెరికా ప్రజల్లో భారతీయుల పట్ల నిద్రాణంగా దాగి ఉన్న ఒక వ్యతిరేకత, రెండు సమాజాల మధ్యనున్న భిన్నత్వం ఈ రెండు దేశాల పరిస్థితు లను ఆర్థికంగా సామాజికంగా, వ్యక్తి గతంగా కూడా చాలా ప్రభావితం చేస్తోంది. మన దేశంలోని ఎందరో మెరికల్లాంటి విద్యార్థులు గంపెడాశతో అమెరికాలో చదువులకోసం, ఉద్యోగాల కోసం తరలివెళుతు న్నారు. అందులో చాలా మంది నిస్పృహతో తిరిగి వస్తున్నారు. ఇంకా కొందరు అక్కడి దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయి కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చిపోతున్నారు. ఎందుకు భారతీయు లను కానీ ఇతర దేశస్థులను కానీ అక్కడి ప్రజలు సహించలేకపోతున్నారు? అమెరికా అధ్యక్షుడి కఠిన నిబంధనలు భారత్‌లాంటి దేశాలను ఇంతగా ప్రభా వితం చేయడానికి ఏ పరిస్థితులు ఉసిగొల్పుతు న్నాయి అని ఆలోచిస్తే చాలా స్పష్టంగా దాని ఆన వాళ్ళు మనకు విద్యావ్యవస్థలో కనిపిస్తున్నాయి.
అమెరికాలోని భిన్నమైన సంస్కృతి, అక్కడి ఆధునిక కుటుంబ వ్యవస్థా పరోక్షంగా భారతీయ, ఇతర దేశాల ఉద్యోగులపై విద్వేషానికి కారణంగా మారుతోంది. అమెరికాలో విద్య అత్యంత ఖరీదైన విషయం. ఉన్నత విద్యకోసం లోన్లు తీసుకోవా ల్సిందే తప్ప మన దేశంలో మాదిరిగా ప్రభుత్వం బాధ్యతేమీ అక్కడ కనిపించదు. 18 ఏళ్ళు నిండా యంటే, ప్లస్‌టూ పూర్తయితే చాలు పిల్లల బాధ్యత కుటుంబాలకు కానీ, తల్లి దండ్రులకు కానీ లేనట్టే. పిల్లలు ఆ వయస్సు నుంచే తమకు తాముగా సంపా దనవైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. ఇక ఉన్నత చదువులు కొనసాగించాలన్నా కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, వాటిని తీర్చేందుకు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ రెండూ బ్యాలన్స్ చేయాల్సిన పరిస్థితి. అంత చిన్న వయస్సులో విద్యార్థులు ఎంతో భారాన్ని మోయాల్సిన పరిస్థితి. ఇక భారత్‌లో బలమైన కుటుంబ వ్యవస్థ కారణంగా పిల్లలకీ, తల్లిదండ్రులకీ మధ్య చాలా బలమైన బంధం పెనవేసుకొని ఉంటుంది. పిల్లలు పూర్తిగా ఉద్యోగాల్లో కుదురుకునే వరకు తల్లిదండ్రులే బాధ్యత వహిస్తారు. వారికి ఏ చిన్న ఇబ్బందీ కలగ కుండా పెళ్ళిళ్ళయ్యాక కూడా వారి అవసరాలను, బాధ్యతలను తల్లిదండ్రులే చూడటం ఇక్కడి సంస్కృతి.
తల్లిదండ్రులు ఎంత కష్టమైనా భరించి పిల్లలు జీవితంలో కుదురుకునే వరకూ అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తారు. వారి ఉన్నత చదు వులకి చేసిన రుణాలు సైతం తీర్చే బాధ్యతని తల్లి దండ్రులే తీసుకుంటారు తప్ప పిల్లలపై ఆ భారాన్ని వేయరు. ఉద్యోగాలకోసమో, ఉన్నత చదువులకో సమో అమెరికాకి వెళితే అటువంటి విద్యార్థులకు వేతన రూపంలో వచ్చేదంతా మిగులుగానే ఉంటోంది. దీంతో విలాసవంతమైన జీవితాలూ, మంచి ఉద్యోగాలూ, కార్లూ, సరదాలూ.. ఇవన్నీ అక్కడి యువతరంలో, ప్రధానంగా విద్యార్థుల్లో భారతీయుల పట్ల విద్వేషానికి కారణమవుతు న్నాయి. తమకు నిజాయితీగా రావాల్సిన ఉద్యో గాలు, ఉపాధి అవకాశాలూ వేరెవరో గెద్దలా తన్నుకు పోయే పరిస్థితిలో మార్పుకోసం అక్కడి యువత తహతహలాడుతున్నారు. దాన్ని సాధించుకోవడం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. చివరకు అది భారతీయులపై తీవ్రమైన దాడులకు దారి తీస్తోంది. మన దేశంలో ఉన్నత విద్యకు ప్రభుత్వాల బాధ్యత కీలకం. దాని ఖర్చు ప్రభావం మన పిల్లలపై పెద్దగా లేదు.
కానీ అదే అమెరికాలో చదువు చాలా ఖరీదు. దీని ప్రభావం మన కళ్ళెదుటే స్పష్టంగా కనిపిస్తోంది. దీనంతటికీ పరిష్కారం ఉన్నత విద్య ప్రాధాన్యతను గుర్తించి స్థానికులకు అవకాశాలి వ్వడం, ఉన్నత విద్యపై ఖర్చు ప్రభుత్వాలు పంచు కోవడం, లేదా ఉచితంగా ఉన్నత విద్యావకాశాలు కల్పించడం వల్ల పొరుగు దేశస్తులపట్ల అక్కడి యువ తరంలో ఉన్న విద్వేషాన్ని తగ్గించొచ్చు. అదేవిధంగా అక్కడి యువతరం ఉద్యమాల్లో భారతీయుల సమై క్యమవడం కూడా సమస్యని ఓ మేరకు తగ్గిస్తుంది. తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రులు తెలం గాణ పోరాటంలో భాగమయ్యారు. నాటి ఉద్య మంలో ఆంధ్రుల పట్ల తెలంగాణ ప్రజలకు విము ఖత లేదు. ఆ తరువాత వచ్చిన వారు ఆంధ్రప్రాంత ప్రజలను దూరంగా ఉంచారు. అలాగే ట్రంప్ సైతం నాన్‌లోకల్ ఫీలింగ్‌ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడు తున్నారు. తద్వారా స్థానికతపై ప్రజల్లో నెలకొన్న సున్నిత భావనలను ఉపయోగించుకుంటున్నారు. స్థానిక ఉద్యమాల్లో పాత్రధారులైతే అమెరికాలో ఉంటోన్న భారతీయులకు కూడా సమస్య ఉత్పన్నం కాదు. అప్పుడది స్థానిక సమస్యగా కాకుండా ప్రపంచ సమస్యగా మారుతుంది.
చుక్కారామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త
మాజీ ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment