విశ్లేషణ
వార్తల అన్వేషణ కంటే స్టుడియోలో చర్చలు నిర్వహించడం చాలా చౌక. జాతీయ చానళ్లు అనేవి ‘రోజుకు ఒకటే కథనం’ అనే వైఖరితో, దేశంలో మరేమీ జరగలేదన్నట్టుగా దాన్నే రాత్రికి చర్చనీయాంశం చేసుకుంటున్నట్టుంది.
వార్తా పత్రికలకు చందాలు కట్టడం మానేసిన పలువురు దశాబ్ది కంటే కంటే క్రితమే నాకు తటస్థ పడ్డారు. ఇంటర్నెట్‌లో వార్త లను చదువుకోగలగడం అందుకు కారణం కాదు. సాధారణంగా టాబ్లాయిడ్ పత్రికల్లో కనిపించే సంచ లన వార్తలను వార్తా పత్రికల్లో చదవాల్సి వస్తుండ టమే అందుకు కారణం. వాస్తవాలు రోజు రోజుకీ మరింత భయానకంగా మారాయి. దీంతో వారూ, వారిలాంటి చాలా మంది ఇతరులు నేడు వార్తా టీవీలను చూడటమంత పాపం మరేదీ లేదని వాటిని చూడటం మానేశారు. ‘వార్త’ అంటే ఏమిటో టీవీ ఎన్నడో మరచిపోయిందని వారు గుర్తించారు. కనీసం ఇది జాతీయ చానళ్లకైనా వర్తిస్తుంది. వాటి లోని కుశాగ్ర బుద్ధులు వార్తల కోసం బయటకు వెళ్లటం అవసరమా? అని అడుగుతుంటారు.
మొదట్లో, టెలివిజన్ వార్తలను మన ముంగిట నిలిపిన మాట వాస్తవమే. కానీ, నేటి స్థితిని చూస్తుంటే బాబ్ ఉడ్‌వార్డ్‌తో కలసి వాటర్‌గేట్ కుంభ కోణాన్ని బయటపెట్టిన సుప్రసిద్ధ పాత్రికేయుడు కార్ల్ బెర్న్‌స్టీన్ చెప్పిన విలువైన మాట గుర్తుకు వస్తుంది. ‘‘వాస్తవానికి సంబంధించి లభించగల అత్యుత్తమ కథనం’’ అందించడం కోసం వార్తా మీడియా కృషి చేయాలి. కానీ పాత్రికేయ వృత్తి నేడు ఎంత మాత్రమూ ‘‘నిబద్ధతగలది’’గా లేదు.
టీవీ జర్నలిజం పూర్తిగా భిన్నమైనది, వార్తా సేక రణ చాలా వ్యయభరితమైనది. సందేహం లేదు. ఈశాన్య ప్రాంతానికంతటికీ తమ చానల్‌కున్న ఓబీ వ్యాన్ ఒక్కటే కాబట్టి అక్కడి వార్తలను సరిగ్గా అందించలేకపోతున్నామని రాజ్‌దీప్ సర్దేశాయ్ తర చుగా అంగీకరిస్తుంటారు. అయితే, వార్తాపత్రికలు పీటీఐ, యూఎన్‌ఐలపై ఆధారపడినట్టే చాలా వరకు చానళ్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వార్తలు, కథనాలపై ఆధార పడుతుంటాయి. మరో పాత్రికేయుడు రవీశ్ కుమార్ (ఎన్‌డీటీవీ ఇండియా) తమ సిబ్బందిని తీసుకుని ఓ మురికివాడకు లేదా కళాశాలకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకో వడం ప్రారంభించారు. అందుకోసం రాత్రి ప్రైమ్ టైమ్ ‘‘చర్చ’’ను విడిచిపెట్టేసే సాçహసం చేశారు. రాత్రి ‘‘ప్రదర్శన కోసం కోతులను తెచ్చే’’ అలాంటి చర్చలు వార్తలలోని సమాచార సారాన్ని చంపేస్తా యని ఆయన బహిరంగంగానే హెచ్చరించారు.
ఆయన చెప్పింది సరైనదే. సరైన సమాచారం లేదా ఏ సమాచారమూ లేకపోయినాగానీ ఏ పక్షం తరఫునైనా వాదనా పటిమగల ఓ పార్టీ పెద్దమనిషి స్టూడియోలోని తన ప్రత్యర్థికి∙సమయాన్ని నిరాక రించి లేదా మిగతా అందరి నోళ్లను మూయించేసి తానే మాట్లాడటం ఎందుకు? ఒక్క ప్రభుత్వ ప్రతి నిధినైనా అలాంటి చర్చలకు ఎందుకు తీసుకురారు? కనీసం వారి దృష్టి కోణాన్ని చెప్పడానికైనా పిలవరెం దుకు? మొదట్లో వాటికి ‘చాట్ షోస్’ (సంభాషణా కార్యక్రమాలు) అనే తగిన గుర్తింపే ఉండేది. కొద్ది కాలానికి వాటిని ‘చర్చల’ స్థాయికి లేవనెత్తారు. ఆ తర్వాత, కించపరచేవిగా దిగజార్చారు. చాలా సంద ర్భాల్లో యాంకర్లే స్వయంగా కేకలేస్తుండే స్థాయికి లేదా చర్చకే స్థానం లేకుండేలా పద్ధతిని పాటించని వారిని మాట్లాడటానికి అనుమతించే స్థాయికి అది దిగజారింది. దానికే రోజువారీ ముఖ్య కార్యక్రమాల్లో ఒకటిగా ప్రైమ్‌టైమ్‌ను కేటాయిస్తున్నారు.
నా దృష్టిలో ప్రైమ్ టైమ్ అంటే బీబీసీ, అల్ జజీరా చానళ్లలాగా వార్తలన్నిటినీ అందించడానికి అత్యుత్తమ సమయమని అర్థం. ఏదైనా పరిణామా నికి నేపథ్యాన్ని తెలపడం కోసం ఎవరైనా నిష్పాక్షిక నిపుణుల అభిప్రాయాలను జోడించవచ్చు. కానీ మన చానళ్లకు మనమంతా ఏ పనీ పాటూ లేకుండా టీవీ ముందు కూచుని, రోజంతా వార్తలను చూసే బాప తనే తప్పుడు అభిప్రాయం ఉన్నట్టుంది. మన వాళ్లు టీవీ పెట్టేసరికి, చెవులు దద్దరిల్లేలా అరుపులు, ఆగ్రహం ప్రత్యక్షమౌతాయి. ఎవరు ఏమి చెప్పారో కూడా తెలియకుండానే సాగే ఈ నిస్సారమైన రాత్రి నాటకాలు ప్రజల బుర్రలపై పట్టుబిగించి, ప్రభా వితం చేయడంలో ఆశ్చర్యమేమైనా ఉందా? వార్తల అన్వేషణ కోసం సిబ్బందిని పంపడం కంటే స్టూడి యోకి చర్చలు జరిపేవారిని రప్పించడం చాలా చౌక. దేశంలోని అన్ని భాషలవారికి చేరగల ఇంగ్లిష్, హిందీ చానళ్లు అనే దృష్టితో జాతీయ చానళ్లు అని పిలిచేవి బహుశా ‘రోజుకు ఒకటే కథనం’ అనే వైఖరిని అవ లంబిస్తున్నట్టుంది. 130 కోట్ల జనాభాగల దేశంలో మరేమీ జరగలేదన్నట్టుగా ఆ కథనాన్నే రాత్రికి చర్చ నీయాంశం చేసుకుంటున్నట్టుంది.
ప్రతి అంశం మీదా వ్యాఖ్యానించడానికి ఒక రాజకీయవేత్తను కనిపెట్టి, ఆ తర్వాత వారు దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించడం ఇందులోని విషాదకరమైన భాగం. ‘మీరు మీ భార్యను కొట్టడం మానేశారా?’ వంటి సమాధానాన్ని కూడా చెప్పేసే ఏక వాక్య ప్రశ్నలను సంధించి వ్యక్తులను ఉచ్చుల్లో పడేయడం జరుగుతుంది. ప్రసారం చేయడానికి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కాదది, అవును లేదా కాదు అనే రెండు అంశాల చర్చను పెంపొం దింపజేయడం. ‘వార్తల’ శకం నుంచి నేడు మనం వినోదానికి నల్లమందును జోడించే ‘సమాచార వినోద’ శకానికి పరివర్తన చెందలేదా?
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేశ్ విజాపుర్కర్
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment